ఇంత కథ ఉందా?
అక్టోబరు సంచికలో ముఖచిత్ర కథనం బాగుంది. విజయదశమి సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయ క్షేత్ర పాశస్త్యం గురించి మునుపెన్నడూ వినని, తెలియని, చదవని విషయాలు తెలుసుకున్నాం.
మన విజయవాడ క్షేత్రం వెనుక ఇంత విశేషం ఉందా? అని ఆశ్చర్యమేసింది. కథనం ఎంతగానో చదివించింది. ఇలాంటి కథనాలు తరచుగా అందించండి.
– అమర్, నందీశ్వరరావు, నాగరాజారావు, విజయవాడ, ఉమాపతి, ఆర్.వెంకటాద్రి- హైదరాబాద్, మరికొందరు పాఠకులు
యువ ఔత్సాహిక దర్శకుడు దీపక్‍రెడ్డి రూపొందించిన ‘మనసానమ:’ షార్ట్ఫిల్మ్ ప్రపంచవ్యాప్తంగా వందలాది అవార్డులు గెలుచుకోవడం అబ్బురమనిపించింది.
రివర్స్ స్క్రీన్‍ప్లే టెక్నిక్‍తో రూపొందిన ఈ సినిమాను.. మీ పత్రికలో వచ్చిన కథనం చదివిన తరువాతే చూశాం. చాలా బాగుంది.
– ఆల చక్రవర్తి, కె.లలిత, చందర్, కర్నూలు
అభ్యంగనం..నలుగు
మన ప్రాచీన ఆచారాలను తెలియచెప్పింది.. ఈ మాసం ఆరోగ్యభాగ్యం శీర్షిక. శరీరానికి అభ్యంగన స్నానం, నలుగు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలను బాగా వివరించారు.
– చంద్రశేఖర్, హైదరాబాద్
Review ఉత్తరాయణం.