ఉత్తరాయణం

విధ్వంసానికి అడ్డుకట్ట వేద్దాం!
మన కళ్లెదుటే.. మనకు తెలియకుండానే అతి పెద్ద విధ్వంసం చోటుచేసుకుంటోంది. అయినా, మనం చూసీ చూడనట్టు వదిలేస్తున్నాం. ఆ విధ్వంసం పేరు- తెలుగు భాష, సంస్క•తి, సంప్రదాయాల విధ్వంసం. ఇవి నాశనమైపోయాయంటే, మనం ఉండీ తెలుగు వారమని చెప్పుకోవడం వృథా ప్రయాసే. అవి నశించిపోయాయంటే, మనం నిర్జీవులమై బతుకుతున్నట్టు లెక్క. వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ‘తెలుగు పత్రిక’ ద్వారా తెలుగు భాష, ఆచార వ్యవహారాలు, సంస్క•తీ సంప్రదాయాల పరిరక్షణకు జరుగుతున్న కృషి బాగుంది. తెలుగు వారమైన మనందరం కూడా ఇటువంటి ప్రయత్నాలను ప్రోత్సహించాలి. అందుకు ఎక్కడెక్కడ ఉన్న తెలుగు వారంతా ఏకం కావాలి.
– ఆర్‍.ప్రవీణ్‍-హైదరాబాద్‍, రాజ్‍.కె.- అట్లాంటా, ప్రమీల.ఎస్‍., కె.కారుణ్య, బీహెచ్‍.అమర్‍నాథ్‍, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు
విశేషాల అతిథి
‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రిక ప్రతి నెలా ఎన్నో విశేషాలను మోసుకొస్తోంది. విశిష్ట అతిథిలా మా మనసులను తాకుతోంది. భాష, సంస్క•తి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశేషాలపై ఈ కాలంలో ఇన్ని విశేషాలు, విలువైన శీర్షికలు అందించే పత్రిక మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. ప్రపంచంలో ఎక్కడ ఉన్న తెలుగు వారైనా సరే.. ఇటువంటి పత్రికలను ఆదరించాలి. మరిన్ని మంచి శీర్షికలు అందించడానికి కసరత్తు చేయండి. మాతృభూమి గొప్పదనాన్ని సగర్వంగా చాటుతున్న తెలుగు పత్రిక యాజమాన్యానికి అభినందనలు.
– పి.ఆర్‍.వెంకటేశ్వరరావు-హన్మకొండ, సందీప్‍- ఆన్‍లైన్‍ పాఠకుడు, చతుర్వేది- టెక్సాస్‍, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు
‘కాలమ్స్’ కావాలి!
తెలుగు పత్రికలో ప్రచురిస్తున్న శీర్షికలన్నీ కూడా బాగుంటున్నాయి. కానీ, ఆయా అంశాలపై ఆయా రంగాలకు చెందిన ప్రముఖుల కాలమ్స్ను కూడా నిర్వహిస్తే బాగుంటుందనేది మా అభిప్రాయం. ఏదైనా అంశంపై ఆ రంగానికి చెందిన ప్రముఖులు చెప్పే విషయాలకు, వెలువరించే అభిప్రాయాలకు ఎంతోకొంత విలువ, విశ్వసనీయత ఉంటాయి. పైగా అవి ఆయా అంశాలపై పాఠకులను ఎడ్యుకేట్‍ చేస్తాయి కూడా. కాబట్టి ఈ దిశగా ఆలోచించి, కాలమిస్టులను పరిచయం చేయగలరని మనవి.

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top