ఉత్తరాయణం

మూర్తి..కీర్తి

తెలుగు పత్రిక జూలై 2023 సంచికలో ముఖచిత్రం కింద అందించిన ‘మూర్తి చిన్నది.. కీర్తి గొప్పది’.. అంటూ కైవల్యోపనిషత్తు గురించి అందించిన వివరాలు బాగున్నాయి. మానవ జన్మకు పరమ గమ్యమైన మోక్షాన్ని అత్యంత సరళంగా, సులభంగా బోధించిన ఈ ఉపనిషత్తు నిత్య పఠనీయమని చెప్పడం బాగుంది.
– ఈశ్వరచంద్ర- హైదరాబాద్‍, కేఎస్‍ ప్రభాకర్‍- తిరుపతి, రామచంద్రం- విజయవాడ, రాంప్రసాద్‍, కె.ప్రభ, రవిశంకర్‍, మరికొందరు పాఠకులు

పంచతంత్ర కథలు

తెలుగు పత్రిక జూలై 2023 సంచికలో పంచతంత్ర కథలు పరిమితంగా ఇవ్వడం అసంతృప్తి కలిగించింది. మరికొన్ని కథలను జోడించాల్సింది. ఇంకా కాశీమజిలీ కథలు వంటివి వీలును బట్టి అందించండి.
– వ్యాస్‍.కె.ఆర్‍, టెక్సాస్‍

రుషి ప్రముఖులు

మన మహర్షులు, పురాణ ప్రముఖులు.. ఈ రెండు శీర్షికలు ఆసక్తికరంగా ఉన్నాయి. మన రుషుల గురించి, పురాణాల్లోని ప్రముఖుల గురించి అందిస్తున్న వివరాలు చదివిస్తున్నాయి.
– షణ్ముకరాజు, విశాఖపట్నం

అధిక మాసం

అధిక మాసం ఎందుకు, ఎలా వస్తుందో జూలై సంచికలో చదివి తెలుసుకున్నాం.
-ఆర్‍.సుధ, విజయవాడ

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top