ఉత్తరాయణం

గ‘ఘన’ విజయం

భారత్‍ అంతరిక్ష పరిశోధనల్లో మరో చరిత్రాత్మక తేదీని నమోదు చేసింది. ఆగస్టు 23న చంద్రయాన్‍-3 ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా ఘనత సాధించింది. చంద్రయాన్‍-2 వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాలతో చంద్రయాన్‍-3 ప్రాజెక్టును చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సాగించిన అద్వితీయ ప్రయత్నాలను తెలుగు పత్రిక అక్టోబరు 2023 సంచికలో ముఖచిత్ర కథనం కింద అందించడం బాగుంది.

– వైశాలి, కె.ప్రభాకర్‍- హైదరాబాద్‍, ఆర్‍.రవిప్రసాద్‍- తిరుపతి, సీహెచ్‍.శ్రీకాంత్‍- వరంగల్‍, వినయ్‍రాజ్‍, కనిగిరి వెంకట్‍, ఇస్మాయిల్‍ మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

కౌత్సుడి కథ
గతసంచికలో అందించిన నీతి కథల్లో- ‘రఘుమహారాజు- కౌత్యుడు’ కథ ఎంతో బాగుంది. మహారాజు దానశీలత, ఎలాగైనా గురుదక్షిణ చెల్లించాలనే కౌత్యుడి కృతజ్ఞతా బుద్ధి, నిజాయితీతో కూడిన ఈ కథ చదవగానే పులకరింపచేసింది.

– టి.శ్రీనివాస్‍, విశాఖపట్నం

కాల మహిమ
రాముడి ఉంగరం పడిపోవడం, దాన్ని వెతుకుతూ ఆంజనేయుడు పాతాళానికి వెళ్లడం, అప్పటికి ఎన్ని రామావతారాలు పుట్టాయో పాతాళరాజు చెప్పడం.. ఈ ఆధ్యాత్మిక కథ చాలా బాగుంది. .

– నరేన్‍, అట్లాంటా

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top