![](https://telugupatrika.net/wp-content/uploads/2024/01/Uttarayanam-Jan-2024-1024x427.jpg)
సమస్తం.. పుస్తకం
తెలుగు పత్రిక డిసెంబరు 2024 సంచికలో పుస్తక మహోత్సవం శీర్షిక కింద పుస్తకాలు చదవాల్సిన అవసరం గురించి, జీవితంలో తప్పక చదవాల్సిన తెలుగు పుస్తకాలు, తెలుగు అనువాదాల గురించిన వివరాలు చాలా చాలా బాగున్నాయి. ప్రస్తుతం అందరిలోనూ చదివే అలవాటు తగ్గిపోతుంది. ఈ శీర్షికలో అక్షరాన్ని ఆయుధంగా ఎలా మలుచుకోవచ్చో చక్కగా వివరించారు. అలాగే తప్పక చదవాల్సిన పుస్తకాల వివరాల జాబితా బాగుంది. ప్రతి ఒక్కరు భద్రంగా దాచుకోవాల్సిన సంచిక ఇది అనడం అతిశయోక్తి కాదు.
– పి.శంకరరావు, ఆనంద వర్ధిని, కె.రమ, రమేశ్‌రెడ్డి, సిహెచ్.పాండు, శైలజారావు, పి.రామయ్య, టి.కృష్ణమూర్తి, సుధాకర్, ఎల్.రమేశ్చంద్ర, చంద్రశేఖర్, వెంకటరావు పి.బాపూరావు మరికొందరు ఆన్లైన్ పాఠకులు
ఆరోగ్య చిట్కాలు
తేలికపాటి ఆరోగ్య చిట్కాలు (డిసెంబరు 2023 సంచిక) ఎంతో బాగున్నాయి. అలాగే, మునుపటి సంచికలో అందించిన ఆయుర్వేద వైద్య పారిభాషిక పదాలు కూడా ఆసక్తికరంగా చదివించాయి.
– ఆర్.పరమేశ్- హైదరాబాద్
తెలుసుకుంటున్నాం..
పురాణ పాత్రలు, మన మహర్షుల గురించి ఎన్నో వివరాలు తెలుసుకోగలుగుతున్నాం. ఇవి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
– పి.రామారావు, తిరుపతి
Review ఉత్తరాయణం.