
కొత్త సందేశం
తెలుగు పత్రిక జనవరి 2024 సంచికలో కొత్త సంవత్సరం సందర్భంగా అందించిన ప్రత్యేక కథనం చాలా బాగుంది. ప్రతి భాషలోనూ, ప్రతి సంస్క•తిలోనూ పలకరింపు అనేది ఎంతో ముఖ్యమైనది. దానిని సరిగా ఉపయోగించడం నేర్చుకుంటే, అది మనల్ని మనిషిగా ఓ మెట్టు పైన ఉంచుతుందనే విషయాన్ని ఎంతో చక్కగా వివరించారు. కొత్త సంవత్సరం వేళ కొత్త విషయాలను అందించినందుకు అభినందనలు.
– బి.హరినాథ్, కె.భిక్షపతి, హరిప్రసాద్, టి.ఎస్.నవీన్, శ్రీకాంత్ మరికొందరు ఆన్లైన్ పాఠకులు
మంత్లీ గైడ్
‘మాసం.. విశేషం’ శీర్షిక నిజంగా మొత్తం తెలుగుపత్రికకే హైలైట్. దీని ద్వారా ఏ రోజు ప్రాధాన్యం ఏమిటి? ఏ తిథానుసారం ఏమేం పండుగలు వస్తాయి? ఆయా రోజుల్లో ఆచరించాల్సిన విధులు ఏమిటి? తదితర వివరాలను తెలుసుకోగలుగుతున్నాం. నిజంగా ఈ శీర్షిక నెలంతా ఆధ్యాత్మిక మార్గదర్శిగా ఉపయోగపడుతోంది.
– పి.కన్యకా పరమేశ్వరి- తిరుపతి, ఆర్.విద్యాసాగర్- హైదరాబాద్, శ్యాంబాబు
కథలు..
నీతి కథలు బాగుంటున్నాయి. కానీ, దేశదేశాలోల జానపద కథలను కూడా పరిచయం చేస్తే బాగుంటుంది.
– కె.పరమేశ్, విశాఖపట్నం
Review ఉత్తరాయణం.