ఉత్తరాయణం

కొత్త సందేశం
వసంతానికి స్వాగతం పలుకుతూ చదువుల తల్లి సరస్వతిని పూజిస్తూ జరుపుకునే శ్రీపంచమి వేడుక గురించి తెలుగు పత్రిక ఫిబ్రవరి 2024 సంచికలో అందించిన ముఖచిత్ర కథనం చాలా బాగుంది.

‘జగత్తంతా సరస్వతీ మాతను ఆశ్రయించి జీవిస్తోంది. ఆ తల్లి పాదాలను నమ్ముకుని నేను జీవిస్తున్నాను’ అనేది నూటికి నూరుపాళ్లు నిజం. వసంత రుతు వర్ణనలు, సరస్వతీ దేవి మహత్తుల గురించి ఈ ప్రత్యేక కథనంలో బాగా వివరించారు.

– కె.రాహుల్‍, సి.హరిప్రసాద్‍, పి.వెంకటరమణ, కైలాస్‍, టి.తిరుపతి, ఆర్‍.కమలాదేవి మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

వస్తు గుణాలు
‘వస్తు గుణ దీపిక’ శీర్షిక కింద ఆయా వస్తువులు, పదార్థాల లక్షణాలు, వాటిలోని ఔషధ విశేషాల గురించి అందిస్తున్న వివరాలు బాగుంటున్నాయి. ఇలాంటి కొత్త శీర్షికలు మరిన్ని ప్రారంభించండి.

– ఉపేంద్రనాథ్‍, చంద్రకళ, రమేశ్‍చంద్ర, రవి, ఆర్‍.కృష్ణకాంత్‍- హైదరాబాద్‍

అవీ..ఇవీ
సామెత కథలు, జాతీయాల వివరణ, పురాణ పురుషుల పరిచయం, మహర్షుల చరిత్ర, వస్తుగుణ దీపిక, మాసం- విశేషం, పిల్లల పాటలు వంటి శీర్షికలు బాగుంటున్నాయి. తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం.

– మరికొందరు పాఠకులు

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top