
సదాశివ లింగం
తురీయ సంధ్యాకాలం, లింగోద్భవ కాలం, పంచభూత లింగాలు నెలకొన్న క్షేత్రాల ప్రాశస్త్యం గురించి వివరిస్తూ తెలుగు పత్రిక మార్చి 2024 సంచికలో అందించిన ముఖచిత్ర కథనం బాగుంది. శివలింగం త్రిమూర్తులతో పాటు శక్తి దేవతకు ప్రతీకగా ఎలా ఉంటుందో, అలాగే వేదాలు నాలుగూ నాలుగు ముఖాలుగా లింగంలో ఎలా ఉంటాయో అనే వివరాలు చాలా కొత్తగా, తెలియని విషయాలు తెలుసుకునేలా ఉన్నాయి.
– కె.ఎల్.హరిప్రసాద్, పి.నారాయణరావు, కమల్, ఆర్.రవికాంతరావు మరికొందరు ఆన్లైన్ పాఠకులు
మనలోనే దేవుడు
భగవద్గీతలో ‘దైవాసుర సంపద్విభాగ యోగం’లో గల దైవ, అసుర లక్షణాల గురించి వివరణ బాగుంది. మంచి, చెడు అనే భావాలకు ప్రతీక అయిన దేవత, రాక్షస లక్షణాలు.. వీటిలో ఎవరిలో ఏ లక్షణాలు ఎక్కువ ఉంటే వారు ఆ లక్షణాలు గల వారిగా తయారవుతారంటూ అందించిన ఆధ్యాత్మిక వికాసం శీర్షిక బాగుంది.
– జనార్ధన్- హైదరాబాద్, ఆర్.వంశీ- తిరుపతి
మాస విశేషాలు
‘మాసం-విశేషం’ శీర్షికన ఆయా తిథులను అనుసరించి వచ్చే పండుగలు, పర్వాల గురించి అందిస్తున్న వివరాలు చాలా బాగుంటున్నాయి.
– కె.ప్రతిభ, విజయవాడ
Review ఉత్తరాయణం.