
జంటపర్వ విశేషాలు
చైత్ర మాసంలో వచ్చే ఉగాది, శ్రీరామ నవమి పండుగల గురించి ఏప్రిల్ 2024 తెలుగుపత్రికలో అందించిన ముఖచిత్ర కథనం ఆకట్టుకుంది. వసంత మాస ఆరంభంలో వచ్చే ఈ పండుగల విశేషాలు, విశిష్టత గురించి చాలా కొత్త విషయాలు తెలిశాయి. అయోధ్య రామాలయం గురించి క్లుప్తంగానైనా.. అందించిన వివరాలు చాలా బాగున్నాయి.
– ఆర్.సంతోష్‌కుమార్, పీ.మోహన్, రావి వరప్రసాద్, నర్సింహరాజు మరికొందరు ఆన్లైన్ పాఠకులు
‘ఫలా’లేవి?
క్రోధి నామ సంవత్సరం సందర్భంగా ఏప్రిల్ సంచికలో కొత్త ఏడాది నవగ్రహ ఫలాలు అందించి ఉంటే బాగుండేది. అలాగే మాస ఫలాలు కూడా రెగ్యులర్‌గా ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం.
– కె.కృష్ణమోహన్-తిరుపతి, ఆర్.ఎస్.సుశీల-హైదరాబాద్
మాస విశేషాలు
తెలుగు పత్రిక ఏప్రిల్ 2024 సంచికలో ఆధ్యాత్మిక వికాసం శీర్షిక కింద, రాముడిని రాజుగా ఎన్నుకోవడానికి దశరథుడు అనుసరించిన ప్రజాభిప్రాయ సేకరణ విశేషాలు ఆశ్చర్యం కలిగించాయి. నాటి రాజనీతి, రాజధర్మం కేవలం పుస్తకాల్లో చదువుకోవడానికే మిగిలాయని అనిపిస్తోంది. నేటి పాలకులూ వీటిని ఆచరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
– టి.రంగరాజు- విజయవాడ, వినయ్-చిత్తూరు
Review ఉత్తరాయణం.