‘ప్రత్యేకం’ బాగుంది..
మన తెలుగు పత్రిక గత రెండు సంచికల నుంచి ఇస్తున్న ‘ప్రత్యేకం’ బాగుంటోంది. బాలల గురించి, తెలుగింటి వంటల గురించి ఇచ్చిన ప్రత్యేక ఇష్యూస్ మళ్లీ మళ్లీ చదివించాయి. ప్రతి సంచిక భద్రపరుచుకునేలా మెటీరియల్ అందిస్తున్నారు. నిజంగా ఇటువంటి ప్రయత్నం అభినంద నీయం. ముఖ్యంగా నేటితరం పిల్లలకు, విదేశాల్లో ఉండే తెలుగు సంతతికి ఉపయోగపడే రీతిలో, ప్రయోజనం కలిగించే రీతిలో అందించిన తెలుగు వర్ణమాల, ఇతర వివరాలు నిజంగా వండర్. స్వయంగా ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా తగిన విధంగా ఇవ్వడం ఎంతైనా సంతోషించదగిన విషయం. మునుముందు కూడా ఇటువంటి ప్రయత్నాలను కొనసాగించాలని మనవి.
– కేఎస్ విశేష్- సికింద్రాబాద్, ఆర్.రాజు, పి.లావణ్య, కె.హిమవంత్,
మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
మన పత్రిక..
‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రిక డిసెంబరు సంచికలో తెలుగింటి వంటల గురించి ఇచ్చిన వివరాలు బాగున్నాయి. విదేశాల్లో ఉండే తెలుగు వారికి మన తెలుగు వంటల్లోని రుచిని చూపించారు. ఆయా వంటల్లో ‘తెలుగుదనం’ ప్రతిఫలించింది. భాష, సంస్క•తి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశేషాలపై అందిస్తున్న వివరాలు బాగుంటున్నాయి. ఎక్కడ ఉన్న తెలుగు వారైనా ఇటువంటి ప్రయత్నాలకు అండగా నిలవాలి. మరిన్ని మంచి శీర్షికలు అందించడానికి ప్రయత్నిం చండి. మన నేల విశిష్టతను సగర్వంగా చాటుతున్న తెలుగు పత్రిక యాజమాన్యానికి అభినందనలు.
– రాహుల్ టీ- టెక్సాస్, హిమ ఆర్- అట్లాంటా, తెలుగు సంఘం- సిడ్నీ, కె.వినయ్, రవికాంత్, మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
ఇలాగే ఉండాలి..
ఆధ్యాత్మికం.. విజ్ఞానదాయక అంశాలతో వెలువడుతున్న తెలుగు పత్రిక అంతర్జాతీయ మాసపత్రిక ఎంతగానో అలరిస్తోంది. మాసం విశేషాలను తిథులతో సహా అందిస్తున్న తీరు బాగుంది. మనం మరిచిపోతున్న మన భాష, సంస్క•తి, సంప్రదాయాలను నేటి తరానికి బహు మతిగా అందిస్తున్నందుకు అభినందనలు. ఈ పత్రికలో అందిస్తున్న ప్రతి శీర్షిక విలువైనదే. ప్రతి శీర్షిక విలువలను నేర్పేదే. ఇదే శైలిని మునుముందు కూడా కొనసాగించండి. ఈ కాలంలో ఇంతటి విలువైన సమాచారంతో వెలువడుతున్న పత్రిక మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు.
– టి.కృష్ణారెడ్డి- హైదరాబాద్, రాగిణి- తిరుపతి
మరిన్ని ప్రయత్నాలు..
మన సంస్క•తీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఎంతో విలువైన శీర్షికలను అందిస్తున్నందుకు అభినందనలు. అలాగే, వివిధ అంశాలపై నిష్ణాతులైన వారి చేత కాలమ్స్ రాయిస్తే ఇంకా బాగుంటుంది. ఇటువంటి కాలమ్స్ ద్వారా తెలియని విషయాలను తెలుసుకునే వీలు కలుగుతుంది. ఇవి ఎందరికో ఉపయోగపడతాయి. అటువంటి ప్రయత్నాలను చేయగలరని ఆశిస్తున్నాం.
– నాగేందర్, హైదరాబాద్, రవికుమార్ యాదవ్, ఆన్‍లైన్ పాఠకుడు
Review ఉత్తరాయణ.