భారత బాలికకు అంతర్జాతీయ అవార్డు
యూఏఈకి చెందిన పదహారేళ్ల భారతీయ బాలికకు అంతర్జాతీయ బాలల శాంతి పురస్కారం లభించింది. వాతావరణ సమన్యాయం, పర్యావరణ క్షీణతపై చేసిన పోరాటానికి గాను పర్యావరణ కార్యకర్త కెహకాషన్ బసును ఈ అవార్డు వరించింది. నెదర్లాండ్స్లోని హేగ్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో బంగ్లాదేశ్‍కు చెందిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు.
పర్యావరణ సంబంధిత వ్యాధులతో ప్రతి ఏటా ఐదేళ్ల లోపు ఉన్న 30లక్షల మంది చిన్నారులు మరణిస్తున్నారని, పర్యావరణ సమస్యలతో చాలామంది బాలలు ఇబ్బందులు పడుతున్నారని యానస్ అన్నారు. ఈ తరుణంలో పర్యావరణ సమస్యలపై పోరాడే కెహకాషన్ బసు వంటివారి అవసరం ఎంతైనా ఉందన్నారు. చిన్నారులు ఆరోగ్యంగా, సురక్షితంగా ఎదిగేందుకు చక్కటి పర్యావరణం అవసరమని.. ఇది వారి హక్కు అని తెలిపారు. ఈ హక్కు కోసం కెహకాషన్ బసు పోరాటం చేయడం అభినందనీయమని ప్రశంసించిన యానస్.. బాలల స్థిరమైన భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని బసు చాటిచెప్పిందన్నారు.
మరోవైపు ఈ పురస్కారం కోసం 49 దేశాల నుంచి 120 నామినేషన్లు రాగా.. అందులో గ్రీన్‍హ•ప్ వ్యవస్థాపకురాలైన బసు ఎంపిక కావడం విశేషం. ఆమ్‍స్టర్‍డామ్‍కు చెందిన గ్లోబల్ చిల్డ్రన్స్ ఎయిడ్ గ్రూప్ ఈ అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని 2005 నుంచి నిర్వహిస్తోంది.
శభాష్ ట్రంప్
ఆది నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనదైన ముద్ర వేసిన డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో అమెరికన్ల అభిమానాన్ని చూరగొన్నారు. అమెరికా భవిష్యత్తు అధ్యక్షుల కోసం బోయింగ్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని క్యాన్సిల్ చేయించారు. బోయింగ్ సంస్థ అత్యంత ఆధునిక సదుపాయాలతో 747 ఎయిర్‍ఫోర్స్ వన్ విమానాల తయారీకి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విమానాలను 2024 కల్లా పూర్తిచేసి అందించాలన్నది ఒప్పందంలో భాగం. అయితే ఈ విమానాల తయారీకి అయ్యే ఖర్చు 25.7 డాలర్లుగా భావించారు. కానీ ఇప్పుడది నాలుగు బిలియన్ డాలర్లకు పెరిగిపోవడంతో ట్రంప్ ఆ ఆర్డర్‍ని రద్దు చేయించారు. అయితే ప్రస్తుతం వాడుకలో ఉన్న 747-200 డబుల్ డెక్కర్ ఎయిర్‍ఫోర్స్ వన్ విమానం 1990లో రోనాల్డ్ రీగన్ అధ్యక్షుడిగా
ఉన్నప్పుడు చేయించారు. ఆ విమానం పాతదైనందున కొత్త విమానం తయారుచేయడానికి బోయింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అమెరికన్ ఎయిర్‍ఫోర్స్. ఈ విషయంపై ట్రంప్ వ్యాఖ్యానిస్తూ, నాలుగు బిలియన్ డాలర్లంటే చాలా ఎక్కువని, తాము అంతగా లాభపడాలని అనుకోవట్లేదని అన్నారు.
పాతనోట్ల మార్పిడికి గడువు పెంచండి: ప్రవాసాంధ్రులు
పాతనోట్ల మార్పిడిపై ఆరు నెలల గడువు ఇవ్వాలని ప్రవాసాంధ్రులు భారత ప్రభుత్వాన్ని కోరారు. సొంత దేశానికి వచ్చేందుకు గాను.. తమ వద్ద ఇంకా పాతనోటు్ల ఉన్నాయని వారు తెలిపారు. ఈ మేరకు జీఓపీఐఓ (ది గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియా-ఆరిజిన్) సంస్థ భారత ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాసింది. భారతదేశం నుంచి బ్లాక్‍మనీని పూర్తిగా నిర్మూలించాలని ప్రధాని నరేద్రమోది తీసుకున్న నిర్ణయంపై వారు హర్షం వ్యక్తం చేశారు. అవినీతి రహిత భారత్‍కు తమవంతు సహకారం ఉంటుందని వెల్లడించారు. ఇంతటి సాహసోపేత నిర్ణయం తీసుకున్న మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. నోట్ల రద్దును స్వాగతించిన ఎన్నారైలు తమవద్దనున్న పెద్దనోట్లను డిపాజిట్ చేయడానికి గడువును ఆరు నెలలు పొడిగించాలని కేంద్రాన్ని కోరారు. మరోవైపు పాత రూ.500, 1000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం సాహసోపేత చర్య అని వర్ణించిన సంస్థ.. నల్లధనం నిర్మూళనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపింది. ఇదిలాఉంటే భవిష్యత్‍లో భారత పర్యటనకు
ఉపయోగపడతాయని చాలా మంది ప్రవాసులు పాత నోట్లను తమ వద్ద ఉంచుకున్నారని జీఓపీఐఓ సంస్థ తెలిపింది.
టంప్ ట్విట్ల మొదలు
తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్‍వెన్‍తో ట్రంప్ ఫోన్‍లో మాట్లాడటం పెద్ద వివాదానికే దారితీసింది. ఆ ఒక్క ఫోన్ కాల్‍తో అమెరికా, చైనాల మధ్య ట్వీట్ల యుద్ధం నడిచింది. ఈ నేపథ్యంలో చైనా తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస ట్వీట్లతో చైనాకు చుక్కలు చూపించారు. చైనా ద్రవ్య విధానంపై, దక్షిణ చైనా సముద్రంలో చైనా నిర్మించిన మిలటరీ కాంప్లెక్స్ గురించి, చైనా తమ కరెన్సీ విలువను తగ్గించటం గురించి ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాక చైనాకు ఎగుమతి అవుతున్న అమెరికన్ ఉత్పత్తులపై ఆ దేశం అధికంగా పన్నులు వేస్తుందని మండిపడ్డారు. ప్రస్తుతం చాలా తక్కువ చైనా వస్తువులపైనే అమెరికా పన్నుల వేస్తోందని, దానిని 45 శాతానికి పెంచాలని గతంలో ట్రంప్ ప్రకటించారు. అదే సమయంలో తైవాన్ అధ్యక్షురాలితో ఫోన్ సంభాషణను చైనా పత్రికలు విమర్శించటంతో ట్వీట్ల యుద్ధానికి తెరలేచింది.
ట్రంప్ పాలకవర్గంలో మరో భారత సంతతి వ్యక్తి ప్రీత్ బరారా
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన అడ్మినిస్ట్రేషన్‍లో ఇండియన్ అమెరికన్లకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా న్యూయార్క్ దక్షిణ జిల్లాకు చెందిన అమెరికా అటార్నీ ప్రీత్ బరారాను తన హయాంలోనూ కొనసాగించేందుకు ట్రంప్ గ్రీన్‍సిగ్నల్ ఇచ్చారు. తద్వారా మూడో భారత సంతతి అమెరికన్‍ను ఆయన తన అధికార యంత్రాంగంలోకి తీసుకున్నట్లయింది. అధ్యక్షుడు ఒరాక్ ఒబామా ప్రీత్ బరారాను అమెరికా అటార్నీగా నియమించారు. ఇన్‍సైడర్ ట్రేడింగ్, సెక్యూరిటీస్ స్కాంలు వంటి కేసుల్లో కఠినంగా వ్యవహరించి పేరు ప్రఖ్యాతులు సాధించిన బరారా ట్రంప్‍ను కలిశారు. ఈ సందర్భంగా ట్రంప్ తనను పదవిలో కొనసాగమని కోరారని, అందుకు తాను సమ్మతి తెలిపానని బరారా అన్నారు. ట్రంప్ న్యూయార్క్ వాసి, గత ఏడేళ్లుగా తమ కార్యాలయం అందిస్తున్న సేవలు ఆయనకు తెలుసనని, అమెరికా అటార్నీగా గత ఏడేళ్లలో నిర్భయంగా, స్వతంత్రంగా, ఎవరి పట్ల పక్షపాతం చూపకూండా తాము సేవలు అందిచామని తెలిపారు. త్వరలో అమెరికా పగ్గాలు చేపట్టబోతున్న ట్రంప్ అధికార యంత్రాంగంలో చేరిన మూడో ఇండియన్ అమెరికన్ బరారా. ఇప్పటికే సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హెలీ, మెడికేర్ సర్వీసెస్‍కు సీమా వర్మ ట్రంప్ యంత్రాంగంలోనూ కొనసాగేందుకు గ్రీన్ సిగ్నల్ లభించిన సంగతి తెలిసిందే.
గిన్నీస్ రికార్డు స•ష్టించిన శ్రీ చిన్నయ్ జయంతి వేడుకలు
భారత ఆధ్మాతిక గురువు శ్రీ చిన్నయ్ జయంతిని పురస్కరించుకుని యూఎస్‍లో ఏర్పాటు చేసిన బర్త్ డే కేక్ గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. చిన్నయ్ కుమార్ ఘెష్‍గా ప్రసిద్ధి చెందిన శ్రీ చిన్నయ్ 85వ జయంతి సందర్భంగా యూఎస్‍లో పెద్ద బర్త్ డే కేక్‍ను సిద్ధం చేసి, దానిపై 72,585 క్యాండిళ్లను వెలిగించి రికార్డును స •ష్టించారు. న్యూయార్క్లోని శ్రీ చిన్నయ్ సెంటర్‍లో 100 మంది బర్త్ డే కేక్ తయారీలో పాల్గొన్నారు. 80.5 అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పుతో ఈ కేక్‍ను తయారు చేశారు. గతంలో కాలిఫోర్నియాలో మైక్స్ హార్డ్ లెమెనాడే నేత•త్వంలో 50,151 క్యాండిళ్లతో నెలకొల్పిన రికార్డును తాజా ఫీట్‍తో అధిగమించారు.
యూకే కొత్త వీసా రూల్స్..
అమెరికాకి వస్తున్న విదేశీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో వీసా నిబంధనను యూకే ప్రభుత్వం కఠినతరం చేసింది. యూరోపియన్ యూనియన్‍కు చెందిన వారికి ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఈ కొత్త నిబంధనలు మన దేశానికి చెందిన ఐటీ నిపుణులకు శరాఘాతంగా మారనున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం నవంబర్ 24 తర్వాత టైర్-2 ఐటీసీ (ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్) కేటగిరీ కింద యూకే వీసాకు అప్లై చేసుకునే వారికి కనీస ప్రారంభ వేతనం 30 వేల పౌండ్లు ఉండాలి. ఇప్పటివరకు ఇది 20,800 ఫౌండ్లుగా ఉంది. ఈ ఐటీసీ రూట్ ద్వారా యూకేలో అడుగుపెడుతున్న వారిలో భారతీయ ఐటీ నిపుణులే అధికంగా ఉన్నారని యూకే మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ తెలిపింది. అంతేకాదు భారతీయ సాప్ట్వేర్ నిపుణుల్లో 90 శాతం మంది ఐసీఈ ద్వారానే వచ్చారని ఈ ఏడాది ప్రారంభంలో ఎంఏసీ గుర్తించింది. దాంతో వెంటనే వీసాకు సంబంధించిన మార్పులను యూకే ప్రభుత్వం ప్రకటించింది. తమ దేశంలో విదేశీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడానికే యూకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అమెరికా ఫైనాన్స్ కమిటీలో భారతీయ అమెరికన్
భారత సంతతికి చెందిన మరో వ్యక్తిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భావి అధికార యంత్రాంగంలోకి తీసుకున్నారు. ప్రముఖ ఇండియన్ అమెరికన్ పారిశ్రామికవేత్త అయిన శలభ్ షల్లీ కుమార్‍ను ట్రాన్సిషన్ ఫైనాన్స్ కమిటీలో నియమించారు. షల్లీ కుమార్ అమెరికాలో రిపబ్లికన్ హిందూ కొయిలేషన్ అనే సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఉన్నారు.
Review .