గురుసేవ ఎలా చేయాలి? సేవ అనేది చాలా పవిత్రమైనది. ఇష్టముంటే చేయడం లేదా మానటం సేవ అనిపించుకోదు. ‘ఈ శరీరం గురువుది. నా తనువు, మనసు, బుద్ధి గురువు ఆధీనంలోనే ఉన్నాయి. నేను స్వతంత్రుడను కాను’ అనే భావంతో గురుసేవ చేసే వారు ధన్యులు. గురుశిష్య సంబంధాలకు అద్దంపట్టే ఉదాహరణలు మన పురాణేతిహాసాల నిండా అనేకం ఉన్నాయి.
హితాహితాలు ఎరిగిన వాడు గురువు.
గురువు ఏది చెప్పాడో అదే హితాన్ని కలిగిస్తుంది.
గురువు పట్ల వినయం, నమత్ర, ఓర్పు, సహనం కలిగి ఉండాలి.
తెలియని విషయాలను వినయంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
గురువుకు ప్రత్యేకించి ఉపదేశ విధానమంటూ ఉండదు.
గురువు పలికే ప్రతి మాటను, సాధారణంగా చెప్పే విషయాలను శ్రద్ధగా విని, అందులోని సారాన్ని గ్రహించాలి.
గురువు ఏం చెబుతాడా? విందామని చకోర పక్షిలా ఎదురుచూస్తూ అంకితభావంతో గురుసేవ చేస్తూ ఉంటే గురువు తప్పక ప్రసన్నుడవుతాడు.
గురువుకు ఆగ్రహం కలిగితే హరుడు కూడా ఏమీ చేయలేడని నానుడి.
గురువు పట్ల మనం చూసే నమ్రతే హితాన్ని కలిగిస్తుంది.
భగవంతుడు ఎలా ఉంటాడు? అనే ఆరాటం సహజంగానే అందరిలోనూ ఉంటుంది.
భగవంతుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకుంటే ఆయన రూపం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు.
నిజానికి ఆలయాలు, మందిరాలు భగవంతుని సుగుణ రూపాన్ని విగ్రహ రూపంలో దర్శింపచేసి ఆరాధించడానికి ఉపకరిస్తాయి.
వాస్తవానికి భగవంతుడు మన హృదయాల్లోనే ఉంటాడు. ఉన్నాడు.
హృదయం పరిశుద్ధంగా, మనసు నిర్మలంగా ఉంటే దయాగుణం, ధర్మగుణం, హితకర్మాచరణ, భూతదయ, ఇతరులపై ప్రేమ భావం సహజంగానే కలుగుతాయి.
పైన చెప్పిన సుగుణాలన్నీ దైవ స్వరూపమే. అవన్నీ దైవ గుణాలే.
భగవంతునికి ఒక రూపం ఎలా ఉంటుంది?
మంచి భావనకు ఏ రూపం ఉంటుంది?
భగవంతునిది కూడా అదే రూపం.
ఎవరు ఏ గుణాలు కలిగి ఉంటారో వారందరూ భగవత్ స్వరూపులే.
ఈ సత్యాన్ని మనకు విడమరిచి చెప్పగలిగేది ఒక్క గురువు మాత్రమే.
అందరికీ రథసప్తమి
శుభాకాంక్షలు
Review గురువే సర్వస్వం.