‘సలార్‌’ సరసన మరో హీరోయిన్‌?

ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సలార్‌ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌గా శ్రుతిహాసన్‌ ఎంపికైంది. తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్‌ పాత్రకు స్కోప్‌ ఉందట. అయితే, ప్రత్యేక గీతం కోసం మాత్రమే ఈ హీరోయిన్‌ అవసరమట. ఇప్పటికే ఈ పాత్ర కోసం శ్రీనిధి శెట్టి, శ్రద్ధాకపూర్‌ పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే, మరో హీరోయిన్‌ పాత్రకు ప్రాధాన్యముందని, అందుకే మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారని అనుకుంటున్నారు. మాస్‌, యాక్షన్‌, అడ్వంచర్‌గా రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

Review ‘సలార్‌’ సరసన మరో హీరోయిన్‌?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top