సినిమాను అలాగే తీయాలి

‘ఈ మధ్య సినిమాల్లో వాణిజ్య విలువలు పెరిగిపోతున్నాయని, కమర్షియల్‍ అంశాల చుట్టూనే సినిమాలు తిరుగుతున్నాయని అంటున్నారు. అయితే, ఇందులో తప్పేముంది? ఓ కథను అలా వాణిజ్యాంశాలు జోడించి చూపిస్తేనే ప్రేక్షకులకు నచ్చుతుంది. తెలుగులోనే కాదు. దాదాపు అన్ని చిత్రసీమల్లోనూ ఇదే జరుగుతుంది. ఏ సినిమాకైనా అదనపు హంగులు అద్దాల్సిందే. సినిమా అనేది రంగుల ప్రపంచం. తెర వెలిగిపోతూ ఉండాలి. ప్రేక్షకుడి ఊహల్ని దాటుకుంటూ కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి. ఇది సినిమాల నిర్మాణంలో ప్రాథమిక సూత్రం. అయితే, బలమైన కథ, శక్తిమంతమైన పాత్రలు లేనప్పుడు మాత్రం ఈ అదనపు హంగులు ఎందుకూ కొరగావు’ అంటూ చెప్పుకొచ్చింది అనుష్క. ఇటీవలే ‘భాగమతి’గా కనిపించిన ఈ భామ.. సినిమాల్లో వాణిజ్యాంశాలపై అడిగినప్పుడు పై విధంగా స్పందించింది.

Review సినిమాను అలాగే తీయాలి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top