పవన్ కాఫీ షాప్

మామూలుగా పవన్‍కల్యాణ్‍ ఎప్పుడు సినిమాల్లో నటిస్తాడో.. ఎప్పుడు పుస్తకాల్లో తలదూర్చి సినిమాలకు దూరంగా ఉంటాడో లేక ఫాంహౌస్‍ లోనే ఎక్కువ గడుపుతాడో ఎవరికీ తెలియదు. సినిమా సినిమాకు బాగా గ్యాప్‍ తీసుకునే పవన్‍ ఎందుకో రూట్‍ మార్చాడు. సర్దార్‍ గబ్బర్‍సింగ్‍, కాటమరాయుడు తరువాత వెను వెంటనే మరో సినిమాను మొదలెట్టేశాడు. అదీ తన ప్రియమిత్రుడైన త్రివిక్రమ్‍ దర్శకత్వంలో.. గతంలో వీరిద్దరి కాంబినేషన్‍లో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ వంటి హిట్‍ సినిమాలు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాపై అంతటా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో పవన్‍ సరసన కీర్తి సురేష్‍, అనుఇమ్మానియేల్‍ నటించనున్నారు. కాఫీ షాప్‍లో పవన్‍, అను సరదాగా గడిపే సన్నివేశాల చిత్రీకరణలో ఈ సినిమా షూటింగ్‍ మొదలైంది. అక్టోబరులో విడుదల చేయాలనే లక్ష్యంతో సినిమాను రూపుదిద్దుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్‍ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక, తమిళ నటి ఖుష్బూ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. పవన్‍ గెటప్‍, పోష్‍ లుక్‍ అభిమానులను అలరిస్తున్నాయి. ప్రేమకథ అయి ఉంటుందని చిత్ర పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి పవన్‍కల్యాణ్‍ అభిమానులకు ఈ వార్త మంచి కిక్కు ఇచ్చేదే..

Review పవన్ కాఫీ షాప్.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top