తెలుగు ‘పాట’వం మా రేడు నీవని..

భక్త కన్నప్ప’.. ఈ తెలుగు సినిమా చూడని వారుండరంటే అతిశయోక్తి కాదు. బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, వాణిశ్రీ జంటగా 1976లో రూపుదిద్దుకున్న ఈ తెలుగు భక్తిరస ప్రధాన చిత్రం అప్పట్లో సూపర్‌డూపర్‌ హిట్‌. గోపీకృష్ణ పతాకంపై కృష్ణంరాజు సోదరుడు యూవీ సూర్యనారాయణరాజు ఈ సినిమాను నిర్మించారు. రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, బాలయ్య ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
ప్రధానంగా ఈ సినిమాలోని ‘శివ శివ శంకర.. భక్త వశంకర’ అనే పాట ఇప్పటికీ ఎప్పటికీ వినిపించే గొప్ప భక్తిగీతం.
ఇక, ఈ సినిమాలో మహా శివ భక్తుడైన కన్నప్ప కూడా తెలుగు వాడే. శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాలకు చెందిన ఈ బోయ వేటగాడు తన భక్తితో శివుడిని కట్టిపడేస్తాడు. ఇతని అసలు పేరు తిన్నడు. శివుడి విగ్రహంలోని కళ్ల నుంచి రక్తం కారుతుండటంతో వాటిని పెకలించి తన కళ్లను అమర్చుతాడు. తన కళ్లను శివుడికి ఇచ్చాడు కాబట్టే అతడికి కన్నప్ప అనే పేరు స్థిరపడిరది.
అత్యంత ప్రజాదరణ పొందిన ‘శివ శివ శంకర’ అనే పాటను రామకృష్ణ పాడగా, ఆదినారాయణరావు, సత్యం స్వరాలు సమకూర్చారు.
ఈ పాటలోని పదాలు చాలా సరళంగా, పెద్దగా చదువుకోని కన్నప్ప నోటి నుంచి వచ్చే అత్యంత సహజ వాడుక భాషలో ఉంటాయి. నిరక్షరాస్యుడనైన తాను, వేదాలు, పురాణాలు తెలియని తాను నిన్ను ఎలా
పూజించాలని శివుడికి వేడుకుంటున్నట్టుగా పాట సాగుతుంది. ఆరుద్ర, డాక్టర్‌ సి.నారాయణరెడ్డి ఈ చిత్రంలోని పాటలు రాశారు.
ఇక, పాటలోకి వెళ్తే..

శివ శివ శంకర భక్త వశంకర
శంభో హర హర నమో నమో
శివ శివ శంకర భక్తవ శంకర
శంభో హర హర నమో నమో

పున్నెము పాపము ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను
పున్నెము పాపము ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను
ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ లీల చేయాలి నీ సేవలు

శివ శివ శంకర భక్త వశంకర
శంభో హర హర నమో నమో

మా రేడు నీవని ఏరేరి తేనా
మారేడు దళములు నీ పూజకు
మా రేడు నీవని ఏరేరి తేనా
మారేడు దళములు నీ పూజకు

గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని
గంగను తేనా నీ సేవకు

Review తెలుగు ‘పాట’వం మా రేడు నీవని...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top