అలసత్వం వద్దు.. శ్రద్ధే ముద్దు
‘‘ఎల్లప్పుడూ ప్రశాంతంగా, నెమ్మదిగా ఉండు. చేసే పనిని చిత్తశుద్ధితో, శ్రద్ధతో చెయ్యి’’ అని బోధించారు షిర్డీ సాయిబాబా. అదే సమయంలో తొందరపాటు పనికిరాదని కూడా హితవు చెప్పారు. అలాగే, చేయాల్సిన పనిని వాయిదా వేయక సకాలంలో చేయాలని కూడా ఉపదేశించారు.
ఇవన్నీ ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ ఆచరించదగిన వ్యక్తిత్వ సూత్రాలు. మనిషి ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో కొన్ని సంవత్సరాల క్రితమే బాబా స్వయంగా ఆచరించి చూపిన ఆదర్శమూర్తి. పెద్దలను గౌరవించడం, వారి సలహాలను ఆచరించడం, ఎప్పుడు చేయాల్సిన పనులను అప్పుడే చేయడం, చేసే పనిలో అలసత్వం చూపకపోవడం వంటి ఎన్నో సద్బుద్ధులను బాబా ప్రోత్సహించారు.
ఇతరులు ఇచ్చే మంచి సలహాను పాటించడంలో అలసత్వాన్ని చూపిన వాడు, ఏ విషయంలోనూ మరొకరి సహాయం నాకు అక్కర్లేదన్న అహంకారం ఉన్న వాడు ఏ పనినీ సమర్ధవంతంగా చేయలేడు. అతను చేసే పనిలో విజయాన్ని సాధించలేడు.
సముద్రం చూడండి. అది రత్నగర్భ. అంటే తన గర్భంలో అమూల్యమైన రత్నాలను దాచుకుని ఉంటుంది. ఎప్పుడూ నీటితో నిండుగా ఉంటుంది. నదులన్నీ వెళ్లి సముద్రంలోనే కలుస్తాయి. అంత గొప్పదైన సముద్రం కూడా నిరంతరం చంద్రుని సాన్నిధ్యాన్ని కోరుకుంటుంది. చంద్రుని ఆధారంగానే దాని కదలికలు ఉంటాయి. మనకు ఎంత ఐశ్వర్యం ఉన్నా.. తెలివైన వారు, బుద్ధిమంతులు, సమర్థుల సాంగత్యం కోరుకుంటే మాత్రమే మన ఔన్నత్యం మరింత ఇనుమడిస్తుంది. మనకు ఎంత సిరి సంపదలు ఉన్నాయనేది మన ఔన్నత్యానికి ఎన్నటికీ కొలమానం కాబోదు. సంస్కారమే మన ఔన్నత్యానికి వన్నె తెస్తుంది.
భీష్ముడు ధర్మరాజుకు ఒక సందర్భంలో ఇలా బోధిస్తాడు-
‘‘ఒకరి సహాయం నాకు అవసరం లేదు అనుకునే వాడు, అలసత్వాన్ని వదలని వాడు, కార్యాచరణలో తొందరపడే వాడు ఎప్పుడూ అపజయాల పాలవుతాడు. ఎన్నటికీ సుఖపడలేడు’’.
అలసత్వం అనేది మనిషిలోని మంచి లక్షణాలను మింగేస్తుంది. ఈ రోజు కాదు రేపు.. రేపు కాదు ఎల్లుండి.. అనుకొంటూ వాయిదా వేసుకునే పనులు చివరకు కొండలా పేరుకుపోవడమే కాదు మనలోని మంచితనాన్ని, సౌశీల్యాన్ని హరించివేస్తాయి. సంస్కారం నశించిపోతుంది.
జీవితంలో ఏ మంచి పని చేయాలన్నా, సంతోషంగా జీవించాలన్నా తొందరపాటు కూడదు. మనకు తెలియని విషయాల గురించి ఇతరులను అడిగి తెలుసుకోవడానికి సంకోచించకూడదు. ఈ విషయంలో అలసత్వం అసలు పనికిరాదు. అలాగే, తనకు తెలిసినదే గొప్ప, ఇక తెలుసుకోవాల్సిందేమీ లేదనే గర్వం, మిడిసిపాటు కూడా పనికిరావు.
జీవితంలో మంచిచెడుల గురించి చెప్పేందుకు వెనుకటి కాలంలో ప్రతి ఇంట్లో పెద్దలు ఉండేవారు. ఇప్పుడు ఎవరికి వారివే కలి‘విడి’ బతుకులు అయిపోయాయి. అటువంటి
Review అలసత్వం వద్దు.. శ్రద్ధే ముద్దు.