కృతజ్ఞత, నమస్కారం

మన భరతఖండం పుణ్యభూమి. అత్యుత్తమ సంస్క•తీ సంప్రదాయాలకు, ఉన్నతమైన ఆచార వ్యవహారాలకు, అద్వితీయమైన ఆధ్యాత్మిక భావనలకు పుట్టినిల్లు. ఇక్కడి నేలపై ఉద్భవించిన ప్రతీ భావనా భగవంతునికి దగ్గర చేసేదే. ప్రతి మనిషిని భగవంతుడిని చేసేదే. అంతటి విశాల, విశిష్ట, ఉన్నత భావాల గని భారతావని. మన పూర్వీకులు, రుషోత్తములు ఎన్నో శోధనలు, సాధనలు చేసి గొప్ప ఆధ్యాత్మిక, భక్తి భావనలను మనకు వారసత్వంగా అందించారు. అవన్నీ భగవంతుడు కేంద్రంగా రూపుదిద్దుకున్న శ్రేష్ఠమైన భావనలే. అందుకే ఇక్కడ పుట్టిన ప్రతి భావన భగవదర్పితమే. కృతజ్ఞత అనేది ఈ భావనలలో ప్రధానమైనది. ఈ సకల చరాచర సృష్టిని, అందులో ఉన్నతమైన మానవుడిని సృష్టించిన భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా యోగులు, రుషులు ఎన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లి•చారు. అవన్నీ భగవంతుడిని కీర్తించేవే. ఎన్ని చెల్లించినా, దేవుని రుణాన్ని ఎలా తీర్చుకోగలం? అయినా, ఆ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం.. అది నమస్కారం రూపంలో!. గుండెల నిండుగా భక్తి భావనను నింపుకొని, హృదయానికి దగ్గరగా చేతుల్ని తీసుకుని నిలువెల్లా కృతజ్ఞతాభావంతో పులకిస్తూ భగవంతునికి అర్పించేదే నమస్కారం. అది హృదయంలో నుంచి పుట్టిన దివ్య భావన. గొప్ప సంస్కారయుతమైన ఆరాధన. అందుకే ఈ భువిపై కృతజ్ఞత, నమస్కారం.. ఈ రెండింటికి మించిన సంస్కారాలు లేనే లేవు. వాటికి మించిన ధర్మం మనిషికి మరొకటి లేదు. మనకు మానవజన్మ అనే మహోన్నతమైన అవకాశాన్ని ఇచ్చిన భగవంతుని పట్ల కృతజ్ఞత చూపడం అనే సత్సంప్రదాయం పూర్వ కాలం నుంచీ కొనసాగుతోంది. కృతజ్ఞతను మించి సంస్కారాన్ని కనబర్చుకోవడానికి భగవంతుడు మనకిచ్చిన మరో అద్వితీయ అవకాశం- నమస్కారం. అందుకే ఈ రెండింటిని మనం మన నిత్య జీవితంలో తగినంతగా ఉపయోగిస్తుండాలి. ఇవి భగవంతునికే కాదు.. సాటి మనుషుల పట్ల కూడా మనం తరచుగా కనబర్చాల్సిన, వ్యక్తీకరించుకోవాల్సిన ధర్మాలు. వీటిని ఆచరించడమే సత్సంప్రదాయం. వీటిని కాపాడుకోవడమే మన ధర్మం.

Review కృతజ్ఞత, నమస్కారం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top