
వెనకటికి ఒకాయన దారి అడిగితే అవతలి వ్యక్తి ఇచ్చిన సమాధానమిది.
కొందరు మాట్లాడితే హాస్యం, చమత్కారం కలగలిసి ‘జోకు’లు విరబూస్తాయి.
మనసారా నవ్వుకోవడం ఒక యోగం
నవ్వలేకపోవడం.. జీవితంలో నవ్వే లేకపోవడంతో నిజంగా ఒక రోగమే..
అందుకే బాధలు, బరువులు కాసేపు పక్కన పెట్టేసి మనస్ఫూర్తిగా నవ్వుకుందాం.
కష్టాలు, కన్నీళ్లకు టానిక్ నవ్వే. నవ్వు ఒకింతయూ లేని రోజు రోజే కాదు.
కాబట్టి.. నవ్వులు రువ్వండి.
మే 2, వరల్డ్ లాఫర్ డే సందర్భంగా అందరికీ చిరునవ్వుల శుభాకాంక్షలు
అమ్మ ప్రేమను ఎంతని చెప్పగలం?
అమ్మ ప్రేమను ఏమని వర్ణించగలం?
ప్రపంచంలో ఉన్న అన్ని భాషలూ కలిపి రాసినా కూడా
అమ్మ ప్రేమను, త్యాగనిరతిని వర్ణించలేం.
అమ్మ మనసు సముద్రమంత లోతు
అమ్మ సహనంలో భూదేవికి సమానం
అమ్మ బిడ్డలపై చూపే ప్రేమ ఆకాశమంత
అమ్మ ఆప్యాయతకు కొలతల్లేవు
అమ్మ అనురాగం అజరామరం
ముల్లోకాలు, పంచభూతాలు, అష్టదిక్కులు..
ఇవేవీ అమ్మ ప్రేమకు కొలమానం కాబోవు.
అటువంటి అమ్మకు మే 9, 2021,
మాతృమూర్తుల దినోత్సవం
సందర్భంగా వందనం.
‘ధ్యానమే కాదు.. నువ్వు చేసే ఏ పనినీ ఒక పనిగా చేయకు. ప్రతీ పనినీ ఒక ధ్యానంగా చెయ్యి’ ‘మనిషికి నిజమైన ఆనందం లభించేది అతని ఆలోచనల్లోనే..’
‘ఒక దీపం వేల దీపాలను వెలిగించినట్టుగా, మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణం కావాలి’ ‘కాలాన్ని వృథా చేయడం అంటే నిన్ను నువ్వు కోల్పోవడమే..’
పుట్టిన వెంటనే తల్లిని కోల్పోయి.. పినతల్లి పెంపకంలో పెరిగి.. 15 ఏళ్లకే పెళ్లాడి.. 29 ఏళ్లకే రాజరికాన్ని వదిలి.. 35 ఏళ్ల వయసులో తనను తాను కనుగొన్న గౌతమ బుద్ధుడు ఈ లోకానికి వెలుగుబాట చూపాడు. ప్రపంచంలో ప్రజల కష్టాలకు కారణాలను కనుగొని.. వాటిని పోగొట్టే సత్యమార్గాన్ని, సిద్ధాంతాలను బోధించాడు.
వైశాఖ శుద్ధ పౌర్ఱమి ‘బుద్ధ పౌర్ణమి’ సందర్భంగా ప్రత్యేక కథనం చదవండి.
Review ‘బార్బర్ షాపుకి ఎలా వెళ్లాలండీ?’ ‘బాగా జుత్తు పెంచుకుని వెళ్లాలండీ..’.