ఈ కాలంలో భోగభాగ్యాలు ఉండటం గొప్ప కాదు. ఆరోగ్యంగా ఉండటమే మహా భాగ్యం.
అందుకే మన పెద్దలు ఏనాడో చెప్పారు ఆరోగ్యమే మహా భాగ్యమని..
భావితరాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నెన్నో నియమాలు, పద్ధతులు ఏర్పరిచారు.
అటువంటి వాటిలో ఉత్తమోత్తమైనది- యోగా.
అందుకే ఇది యోగభాగ్యాల కాలం.
పతంజలి మహర్షి ఈ లోకానికి ఒక అపురూపమైన కానుకగా అందించిన అద్భుతమైన ఆరోగ్య మంత్రమిది.
యోగాను ఆచరించి, సాధికారికంగా బోధించింది ఆయనే.
పతంజలి మహర్షి ఉద్బోధించిన అష్టాంగ యోగం ఒక రాజమార్గం. అందుకే దీనిని ‘రాజయోగ’మని కూడా అంటారు.
అష్టాంగ యోగా మనిషిని పరిపూర్ణుడిని చేస్తుంది.
ఇది శారీరక, భౌతిక ఆరోగ్యం నుంచి మనిషి సమాజంలో ఎలా నడుచుకోవాలో, తనను తాను ఎలా తీర్చిదిద్దుకోవాలో కూడా నేర్పుతుంది.
నేడు ప్రపంచ దేశాలన్నీ యోగాను ఆచరిస్తున్నాయి. ఆరోగ్యానికి దీనికి మించిన ప్రత్యామ్నాయం లేదని అంటున్నాయి.
యోగా చాలా పురాతనమైనది.. కానీ చాలా నిత్యనూతనమైనది.
యోగా అతి ప్రాచీనమైనది.. కానీ చాలా అమూల్యమైనది.
లోకాలకు, కాలాలకు అతీతంగా ఆరోగ్య సాధనంగా ఆదరణ పొందుతోంది యోగా.
యోగా.. మన భారతీయ సంస్క•తిలో, జీవన విధానంలో అంతర్భాగమైన చైతన్య గంగ.
రుషుల కాలం నుంచీ నేటి నాగరిక యుగం వరకు విశ్వరూపం దాల్చి అంతర్జాతీయ వైభవాన్ని సంతరించుకుంది భారతీయ యోగ శాస్త్రం.
ఆసనాలు, ధ్యానం, ప్రాణాయామం.. పద్ధతి ఏదైనా మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయడమే యోగా లక్ష్యం.
శారీరకంగా, మానసికంగా మనిషిని అజేయశక్తిగా మలిచేది యోగా.
నేటి ఉరుకుల పరుగుల జీవనం పెంచుతున్న ఒత్తిళ్ల నుంచి తేలికగా బయటపడేసే సాధనం యోగా మాత్రమే.
ఆధునిక జీవనశైలితో ముంచుకొస్తున్న జబ్బులు, కరోనా వంటి మహమ్మారుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి యోగాను మించిన ఆరోగ్య సాధనం లేదు.
జూన్ 21:
అంతర్జాతీయ యోగా దినోత్సవ
శుభాకాంక్షలతో…
Review యోగభాగ్యాలు.