విజయ సంకేతం

యస్యా: పరతం నాస్తి సైషా దుర్గా ప్రకీర్తితా: ఈ సృష్టిలో దుర్గాదేవిని మించిన శక్తి మరేదీ లేదని పై శ్లోకానికి భావం. అందుకు కాబట్టే ఆ శక్తిని ‘దుర్గ’ అన్నారు. విశ్వధాత్రి.. ఈ సృష్టి శక్తి దుర్గాదేవి. శక్త్యారాధన అంటే మాతృదేవి ఆరాధనమే. ఈ సృష్టికి మూలం ఆది పరాశక్తే. సృష్టి, స్థితి, లయాలన్నీ ఆ దేవి ఆధీనాలు.
శివుడైనా సరే పక్కన శక్తి (అమ్మ వారు) ఉంటేనే ఈ సృష్టిని నడిపించగలడు. శక్తి పక్కన లేకుంటే ఏమీ చేయజాలడు.

త్రిమూర్తులు సైతం దేవీ ఆరాధకులే. ఇన్ని కారణాల రీత్యానే` హైందవ ధర్మంలో శక్తి ఉపాసనకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించిన తల్లి కాబట్టి ఆమెకు దుర్గాదేవి అనే పేరు వచ్చింది. దుర్గ` మహా శక్తియుక్త దేవత. శరన్నవరాత్రుల్లో` ‘నవ’ అనే శబ్దానికి కొత్త, తొమ్మిది అనే అర్థాలకు ప్రసిద్ధి. శరదృతువులలో ఈ నవరాత్రులు వస్తాయి కాబట్టి వీటినే శరన్నవరాత్రులు అని కూడా అంటారు.
శరత్కాలంలో వచ్చే దేవీ నవరాత్రి ఉత్సవాలలో దుర్గాపూజ ప్రశస్తమైనది. ఈ పూజాదికాల పర్వానికే ‘దసరా’ అని పేరు. దీనినే ‘విజయదశమి’ అని కూడా అంటారు. దసరా విజయానికి సంకేతం. ధర్మం, అర్థం, కామం.. ఈ మూడు త్రివర్గాలను ప్రసాదించే దేవి సత్త్వరజస్తమ: స్వరూపిణి.

ఆమె` మహా సరస్వతి, మహాలక్షిÊ, మహాకాళి అనే ముగ్గురమ్మలకు మూలమైన అమ్మ. అందుకే` భక్త పోతన ఆమెను ‘అమ్మలగన్నయమ్మ’ అని కీర్తించాడు. దేవీ అవతారం ముఖ్య కర్తవ్యం` ఈ భువిపై అసురీ (రాక్షస) శక్తుల్ని సంహరించి దైవీశక్తులను పాదుగొల్పడమే.

ఇతిహాసాలలో, పురాణాలలో, చరిత్రలో విజయదశమి ప్రాశస్త్యం గురించి గొప్పగా ఉంది. మరీ ముఖ్యంగా విజయానికి సంకేతంగా ఈ పర్వదినాన్ని నిర్వహించుకుంటారు. రాముడు రావణాసురుడిపై యుద్ధానికి వెళ్లే ముందు, పాండవులు కౌరవులపై రణశంఖం పూరించడానికి ముందు దుర్గాదేవినే పూజించి విజయం సాధించారు. ఆ దేవిని ఆరాధించి మనమూ విజయాలు సాధిద్దాం.

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

Review విజయ సంకేతం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top