తీయతీయని పాయసం

ఏ దైవానికి ఏ నైవేద్యం నివేదించాలనే విషయంలో ఎప్పుడూ సందిగ్ధమే. అయితే భక్తి, శ్రద్ధతో నివేదించే ఏ పదార్థమైనా భగవంతుడికి ఇష్టమే. అయితే ప్రత్యేకించి కొన్ని దైవాలకు కొన్ని నైవేద్యాలను ప్రత్యేకంగా సమర్పించాలి. ఈ క్రమంలో మహా శివరాత్రి సందర్భంగా శివుడికి ఇష్టమైన నైవేద్యాలమేమిటో, వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
సాధారణంగా శివుడికి పాలతో తయారుచేసిన పదార్థాలు, తీపి పదార్థాలు అంటే ఇష్టమని అంటారు. కొందరు పెరుగుతో చేసిన పదార్థాలను కూడా నివేదిస్తుంటారు. ప్రత్యేకించి శివుడికి దద్ధోజనం, పాయసం అంటే అమితమైన ప్రీతి అని చెబుతారు. ఇంకా ఈయనకు ఎండు ఖర్జూరం, కొబ్బరికాయ, కిస్మిస్‍ పండ్లు, ద్రాక్ష పండ్లు, పులిహోర వంటివీ నైవేద్యంగా సమర్పిస్తుంటారు.

దద్దోజనం
కావాల్సిన పదార్థాలు: బియ్యం- ఒకటిన్నర కప్పు, మినప్పప్పు- రెండు చెంచాలు, శనగపప్పు- రెండు చెంచాలు, పెరుగు- 500 గ్రాములు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ, ఉప్పు, నూనె, అల్లం.. ఇవన్నీ తగినంత

తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని చాలా మెతత్తగా ఉడికించుకోవాలి. ఉడికించిన అన్నాన్ని తాంబూలానికి తీసుకోవాలి. అన్నంలో పెరుగును బాగా కలపాలి. తగినంత ఉప్పు వేయాలి.
పొయ్యి మీద కడాయి పెట్టుకుని నూనె పోయాలి. కొద్దిగా వేడి అయిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర వేయాలి. అనంతరం రెండు చెంచాల మినపప్పు, రెండు చెంచాల శనగనప్పు వేయాలి. ఐదు పచ్చిమిర్చి వేసి, 3 ఎండుమిర్చి వేయాలి. అవి వేగిన తరువాత ఇంగువ వేసి కలపాలి. చివరిలో కొత్తిమీర, కరివేపాకు వేయాలి. అందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేయాలి. మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మిరియాలు మనకు కారం మరియు ఘాటుగా దద్దోజనం ఉండటానికి ఉపయోగపడతాయి. ఇలా అన్నిటినీ వేసిన తరువాత దానిని కలిపిన అన్నం – పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలపాలి. అంతే రుచికరమై దద్దోజనం సిద్ధం. ఇది ఆలయాల్లో ప్రసాదంగా పంచే దద్జోజనంలానే ఉంటుంది.

పాయసం (బియ్యం)
కావాల్సిన పదార్థాలు: బియ్యం- పావుకప్పు, పాలు- 2 కప్పులు, యాలకులు- 2, కిస్మిస్‍- 25 గ్రాములు, కుంకుమపువ్వు- కొద్దిగా, చక్కెర- తగినంతగా.
తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని పావుగంట పాటు నానబెట్టుకుని పొడిగా ఆరబెట్టాలి. తరువాత ఈ బియ్యాన్ని మిక్సీలో బరకగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పాత్రలో పాలు పోసి అవి కాగిన తరువాత బియ్యపు రవ్వను, యాలకుల పొడిని వేసుకుని రవ్వ మెత్తబడే వరకు సన్నని మంటపై ఉడికించుకోవాలి. వేడి పాలలో కుంకుమపువ్వును నానబెట్టుకుని పాయసంలో కలుపుకోవాలి. చివరగా చక్కెర వేసుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే బియ్యం పాయసం సిద్ధం.

Review తీయతీయని పాయసం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top