జయ జయ శంకర

ఆయన విద్వద్వరేణ్యుడు, మహాపండితుడు, గొప్ప తత్వవేత్త, సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం చూపిన మహాయోగి, గొప్ప మత సంస్కర్త, సంఘసంస్కర్త అన్నిటికీ మించి మహాజ్ఞాని…. ఆయనే సాక్షాత్తూ శంకరుని అంశతో జన్మించిన శంకరాచార్యులు. ఆది శంక రులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. పూవు పుట్టగానే పరిమళిస్తుందన డానికి అసలైన ఉదాహరణ ఆయన జీవితం. భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో మేరునగ ధీరుడైన ఆయన తరువాత మళ్లీ అంతటి వారు జన్మించారనడానికి వీలు కానంతటి మహా దార్శనికుడాయన.

దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే
స ఏవ శంకరాచార్యః సాక్షాత్‍ కైవల్య నాయకః
దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. (శివరహస్యము నుంచి)
కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా
శ్రౌత, స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు. (కూర్మపురాణం నుంచి)

జననం

కేరళలోని కాలడి అన్న గ్రామంలో నివసించే శివగురువు, ఆర్యాంబ అనే దంపతులకు సంతానం కలగలేదు. శివ భక్తులైన వారిద్దరూ తమ ఇష్టదైవమైన వ•షాచలేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో సేవిం చారు.. వారి భక్తికి మెచ్చిన శివుడు ఓ వ•ద్ధుని రూపంలో శివగురుడికి కలలో కనిపించి. ‘‘నీకు నూరు సంవత్సరాలు జీవించే పదిమంది సామాన్యులైన పుత్రులు కావాలా? లేక పండితుడు, జ్ఞాని అయిన ఒకే ఒక్క కుమారుడు కావాలా? అని ప్రశ్నించాడు. దానికి బదులుగా శివ గురుడు ‘‘నేను అజ్ఞానిని. దీనిలో ఏది సరైనదో అదే ప్రసాదించు అని బదులిచ్చాడు. ఆ పర మేశ్వర కటాక్షం వల్ల ఆర్యాంబ దంపతు లకు వైశాఖ శుక్ల పక్ష పంచమి నాడు కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో పరమగురువు, మహాజ్ఞాని అయిన శంకరాచార్యులు జన్మించారు.

బాల్యం

శంకరుల బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీక రించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఎనిమిదేళ్లకే తర్క, వేదాంత, మీమాంశ శాస్త్రాలతో సహా సకల శాస్త్రాలూ కంఠోపాఠం చేసి ఏకసంథాగ్రాహిగా పేరొందారు. బాలబ్రహ్మ చారిగా శంకరులు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విర మించడం కోసం ఉంచుకొన్న ఉసిరి కాయను ఆమె శంకరులకు దానం చేసింది. దానికి చలించి పోయిన శంకరులు, ఆశువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. శంకర విరచిత కనకధారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీదేవి ఆ ఇంట బంగారు ఉసిరి కాయలను వర్షింపజేసింది. ఇలాంటిదే మరొక సంఘటన జరిగింది. ఒకరోజు శంకరుల తల్లి ఆర్యమాంబ పూర్ణానది నుండి నీళ్ళు తెచ్చుకుం టుండగా స్ప•హతప్పి పడిపోయింది. ఆ సంఘ టన చూసి తల్లడిల్లిన శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. నదీ ప్రవాహం ఆవిధంగా తన దిశను మార్చుకోవటం చూసిన గ్రామ ప్రజలు శంకరుల ప్రతిభకు ఆశ్చర్యచకితులయ్యారు.

సన్యాస స్వీకారం

భౌతిక ప్రపంచం కన్నా సన్యాస దీక్ష పట్ల ఉన్న మక్కువ శంకరులను చిన్నతనంలోనే సర్వ సంగపరిత్యాగిగా మారేలా చేసింది. వేదాధ్య యనం పూర్తి అయిన తరువాత ఇక తాను సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమయిందని భావించిన శంకరులు అందుకు తల్లి ఆర్యాంబ అనుమతి కోరారు. కానీ శంకరులు సన్యాసం తీసుకోవడం ఇష్టం లేని ఆర్యాంబ అందుకు అంగీకరించలేదు. కాగా ఒకరోజు శంక రులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి ఆయన్ను పట్టుకుంది. సన్యాసం తీసుకోవ డానికి కనీసం ఇప్పుడైనా అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా మరణిస్తానని తల్లిని వేడుకున్నారు. ఈ పరిస్థితికి ఎంతో శోకించిన ఆర్యాంబ చివరకు సన్యాస దీక్షకు అంగీకరించింది. ఆతుర సన్యా సంగా పిలిచే ఈ సన్యాస దీక్ష తీసుకుంటూ, మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను వదిలేసింది.

అనంతరం గురువు కోసం అన్వేషణ చేయా లన్న ఆలోచనతో అందుకు అనుమతి ఇవ్వ వలసిందిగా తల్లి ఆర్యాంబను ప్రార్థిం చారు శంకరులు. ఉదయం, రాత్రి సంధ్యా సమయం ఇలా ఏ సమయంలోనైనా, నన్ను తలచుకోగానే, నీవద్దకు వస్తాను. ఆఖరు గడియల్లో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాననీ తల్లికి మాట ఇచ్చి కాలడి విడిచి గురువును అన్వేషిస్తూ బయలుదేరారు.

గోవింద భగవత్పాదుల దర్శనం

తల్లి అంగీకారం తీసుకుని కాలడి విడిచి, గురువు కొరకు అన్వేషిస్తూ నర్మదా నది వద్దకు వెళ్ళారు శంకరులు. అక్కడ గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదుల దర్శనం లభించింది. వ్యాసమహర్షి కుమారుడైన శుకుని శిష్యులు గౌడపాదులు. గౌడపాదుల శిష్యులు గోవింద భగ వత్పాదులు. అప్పుడు శంకరులు గోవింద భగ వత్పాదులకు నమస్కారం అని స్తోత్రం చెయ్యగా ఆయన ‘ఎవరు నువ్వు?’ అని అడిగారు. అప్పుడు శంకరులు దశశ్లోకి స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు.
‘‘న భూమిర్నతోయం న తేజో నవాయుర్మఖం నేంద్రియం వా న తేషాం సమూహః
అనైకాంతి కత్వా త్సుషుష్త్యైక సిద్ధిస్తదేకోవ శిష్ట శ్శివ: కేవలోహం
నేను నింగిని కాదు, భూమిని కాదు, నీటిని కాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని. ఇంద్రియాలు కాని వేరే చిత్తం గాని లేనివాడిని. నేను శివుడను. విభజన లేని జ్ఞాన సారాన్ని. అని’’ పలికారు.
ఆటువంటి అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరులను, గోవిందభగవత్పాపాదులు జ్ఞాన సమాధి నుండి చూసి ఈ విధంగా అన్నారు. ‘‘స ప్రాహ శంకర స శంకర ఏవ సాక్షాత్‍‘ (సాక్షాత్తు భూమికి దిగి వచ్చిన పరమశివుడే ఈ శంకరులు) అని’’
అనంతరం శంకరులు గోవిందపాదులకు పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం నేటికీ పరంపరంగా వస్తోంది. గురుసేవ తోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు ఈ విధంగా ప్రపంచానికి వెల్లడి చేశారు. గోవిందపాదులు శంక రులకు బ్రహ్మజ్ఞానాన్ని, ఉప నిషత్తుల సారాన్ని బోధించారు. గోవిందపాదుల వద్ద విద్యా భ్యాసం పూర్తయిన తరువాత గురువు ఆజ్ఞతో బ్రహ్మసూత్రా లకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయ మైన వారణాసి చేరు కున్నారు శంకరులు.
గుర్వాజ్ఞతో వారాణసి చేరుకొని పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానమాచరించి, విశ్వేశ్వరుని సన్నిధిలో కొంతకాలం గడిపారు. వారణాసిలో శంకరులకు వేదసూక్ష్మాలు బాగా అవగతమయ్యాయి. అక్కడే సదానందుడు అనే బ్రహ్మచారి శంకరులకు ప్రథమ శిష్యుడయ్యాడు.

మనీషా పంచకం

ఒకరోజు శంకరులు మాధ్యాహ్నికం (మధ్యాహ్న కాలక•త్యాలు) తీర్చుకోవడానికి గంగా నది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో నాలుగు శునకాలతో ఒక చండాలుడు అడ్డుపడినాడు. అప్పుడు శంక రులు, ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ చండాలుడు ఈ విధంగా అడిగాడు.
‘‘అన్నమయాత్‍ అన్నమయం అథవా చైతన్య మేవచైతన్యాత్‍
ద్విజవర దూరీకతం వాజ్చసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛతి
సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం ఛండాలుడిలోనైనా, బ్రాహ్మణుడిలో నైనా ఒకేవిధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా, లేక లోపలనున్న ఆత్మనా? ఆవిధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కాని అద్వైతం కాదు’’ అన్నాడు.
ఆ మాటలువిన్న శంకరులు ఆ చండాలుని మాటల్లోని అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో ఇలా వచ్చాడని తెలుసుకుని ఆ మహా శివుడిని ‘మనీషా పంచకం’ అనే ఐదు శ్లోకాలతో స్తుతించారు.

ప్రస్థానత్రయం

అలా శివుని అను గ్రహంతో గంగలో పుణ్య స్నానం ఆచరించి, కాశీ నుండి బదరికి బయలు దేరారు శంకరులు. బదరీలో ఉన్న పండితుల సాంగత్యంతో, పండితగోష్ఠులతో పాల్గొంటూ బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాశారు. వారణాసిలో ఉన్న పుడే ఉపనిషత్తులకు, భగవ ద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాశారు. దీనినే ప్రస్థానత్రయం అంటారు. అనంతరం బదరి నుండి కాశీకి తిరిగి వెళ్ళి, ఆ భాష్యాల సార మైన అద్వై తాన్ని శిష్యులకు బోధిం చడం ప్రారంభించారు. అనేక ప్రదేశాలకు వెళ్లి అనేక మతాలు, శాఖలకు చెందిన వారితో చర్చలు జరిపారు. భారతదేశ మంతా పర్యటించి తన తర్కంతో, విద్వత్తుతో వాదించి దాదాపు డెభ్బై రెండు మతాల వారి వాదనలను ఖండించి ఆయా మతాల ప్రతినిధులను మూగబోయేలా చేశారు.

వ్యాసమహర్షి వరం

ఒకరోజు శంకరులు గంగా నది ఒడ్డున ప్రవ చనం చేసి వెళ్తుండగా వేద వ్యాసుడు ఒక వ•ద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్క డకు వచ్చి శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు రమ్మని కోరాడు.. 8 రోజుల చర్చ తరువాత, ఆ వచ్చింది సాక్షాత్తూ వ్యాసుడేనని శంకరుల శిష్యుడైన పద్మపాదుడు గ్రహించి, అ విషయం శంకరులకు చెబుతాడు. అప్పుడు శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా, వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది నీవు మాత్రమేనని శంకరులను ప్రశంసించాడు. అనంతరం అక్కడి నుంచి నిష్క్రమిస్తున్న వేద వ్యాసునితో శంకరులు ’నేను చెయ్యవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించ’మని వ్యాసుని కోరగా, వ్యాసుడు ‘లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులనేకులను ఎదుర్కో వలసిన అవసరం ఉంది. లేకపోతే, నీ కారణంగా రూపుదిద్దుకుని, ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యా త్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకో వరాన్నివ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకిచ్చిన 8 సంవత్సరాల ఆయుర్ధాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని క•ప చేత నీకు మరో 16 ఏళ్ళు ఆయుష్షు లభించుగాక‘ అని దీవించాడు.

శంకరాచార్యుల శిష్యులు

శంకరులకు అనేకులు శిష్యులుగా ఉన్నారు. ఆయన ప్రజ్ఞాపాఠవాలకు కొందరు, చర్చలద్వారా ఓడింపబడిన వారు మరికొందరు ఇలా అనేకులు ఆయన శిష్యులుగా ఉండేవారు. పద్మపాదుడు, హస్తామలకాచార్యులు, తోటకాచార్యులు, సురే శ్వరాచార్యులు, భట్టిపాదుడు వారిలో ముఖ్యులు. తన 15వ ఏట, శంకరులు ప్రయా గలో ఉన్న కుమారిల భట్టును కలవాలని నిర్ణయించుకొని బయలుదేరారు. శంకర భగవత్పాదుల దర్శనంతో తన సర్వపాపాలు హరిం చాయని అన్న కుమారిల భట్టుతో తన భాష్యాలకు వార్తికలు రచింమని కోరారు. భట్టు అందుకు నిరాకరించి, మాహిష్మ తిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుని తర్కంలో ఓడించి, శిష్యునిగా చేసుకుని, ఆతనిచేత వార్తికలు వ్రాయించమని శంకరులను కోరాడు.

మండన మిశ్రునితో తర్క గోష్ఠి

కుమారిల భట్టు కోరిక మేరకు మాహిష్మతిలో మండన మిశ్రుని గ•హానికి చేరుకున్నారు శంక రులు. ఆ సమయంలో మండన మిశ్రుడు తన తపోశక్తితో వ్యాసభగవానుడిని, జైమినిమహా మునిని ఆహ్వానించి, వారికి అర్ఘ్యపాద్యాలు ఇస్తు న్నాడు. శంకరులు ఇంటికి రావడం గమనించి, తన ఇంటిలో సన్యాసులకు ప్రవేశం లేదని, అందు వలన స్వాగతం పలకనని చెప్పాడు. అయితే, మహర్షుల ఆదేశంతో శంకరులను లోపలికి ఆహ్వా నించాడు. ఇద్దరూ తరువాతి రోజున చర్చ జరపాలని నిర్ణయించుకున్నారు. న్యాయనిర్ణే తలుగా వ్యాసుడు, జైమినిలను ఉండ మని అభ్యర్థించగా, మండనమిశ్రుని భార్య అయిన ఉభయభారతి సాక్షాత్తూ సరస్వతీ స్వరూపమనీ, ఆమెను న్యాయనిర్ణేతగా ఉంచి గోష్ఠి జరపమనీ వారు చెప్పారు. ఉభయభారతి మధ్యవర్తిగా ఉండటానికి అంగీకరించి, వాళ్ల ఇద్దరి మెడల లోనూ రెండు పూలమాలలు ఉంచి, వాదన సమ యంలో ఎవరి మెడలో పూలమాల వడలిపోతే వాళ్లు ఓడిపోయినట్లు అని చెప్పింది. వాళ్లిద్దరూ వాదన ప్రారంభించిన తర్వాత కొంతసేపటికి మండనమిశ్రుని మెడలోని మాల వడలిపోయింది. అయితే ఓటమిని అంగీకరించని ఉభయభారతి భర్తలో భార్య సగం కనుక తనను కూడా ఓడిస్తే కాని తన భర్త ఓడినట్లు కాదని చెప్పింది. శంక రులు అందుకు అంగీకరించారు. వారిద్దరికీ మధ్య జరిగిన చర్చలో ఉభయభారతి ఎన్నో చిక్కు ప్రశ్న లను శరపరంపరగా సంధించగా, శంకరులు అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పారు. ఆమె చివరిగా మన్మధ కళలెన్ని వాటి స్వరూపార్ధాలేమిటి, శుక్ల పక్షాలందు స్త్రీ పురుషులలో జరిగే మార్పులేమిటి అని అడిగింది. బ్రహ్మచారియైన శంకరులు వాటిని గురించి తనకు తెలియదని జవాబులు చెప్పేం దుకు కొంత కాలం గడువు ఇమ్మని అడిగారు.

అనంతరం శంకరులు వందమంది భార్యలు కల అమరకుడు అనే రాజు చనిపోవుట గమనించి శిష్యులతో తన శరీరమును కాపాడమని చెప్పి రాజు శరీరంలో ప్రవేశించి ఉభయ భారతి ఉటం కించిన కళల సారాంశాన్ని గ్రహించి తిరిగి తన శరీరంలో ప్రవేశించి ఉభయభారతికి సరైన సమా ధానాలిచ్చి ఆమెను చర్చలో ఓడించారు. అప్పుడు శంకరులు మండన మిశ్రుడికి సన్యాసాన్ని ఇచ్చి, తన శిష్యునిగా స్వీకరించి, సురేశ్వరాచార్యుడుగా ప్రసిద్ధుడవు కమ్మని ఆశీర్వదించారు.
తరువాత శిష్యులతో కలిసి శంకరులు మహా రాష్ట్ర దేశంలోని పుణ్యక్షేత్రాలను, శ్రీశైలం వంటి ఇతర క్షేత్రాలను సందర్శించారు. శ్రీశైలంలో ‘శివా నందలహరి‘ స్తోత్రాన్ని రచించారు. మాధవీయ శంకర విజయం ప్రకారం ఒక కాపాలికుడు శంకరులను సంహరింపబోయినపుడు శంకరుల శిష్యుడు పద్మపాదుడు దేవుని ప్రార్థించాడు. అపుడు శ్రీనృసింహుడు శంకరులను రక్షించాడు. ఆ సంద ర్భంలోనే శంకరులు శ్రీలక్ష్మీ న•సింహ స్తోత్రంతో దేవుని స్తుతించారు. ఈ స్తోత్రాన్నే కరావలంబ స్తోత్రం అని కూడా అంటారు. తరువాత శంకరులు గోకర్ణంలో హరిశంకర మందిరాన్ని, కొల్లూరులోని మూకాంబిక మందిరాన్ని దర్శించారు. కొల్లూరులో మూగవాడిగా ఉన్న ఒక యువకుడు హస్తామలకాచార్యుడనే పేరుతో శంకరుల శిష్యుడైనాడు. అనంతరం శ•ంగేరీలో తోటకా చార్యుడు ఆయనకు శిష్యుడైనాడు.

అద్వైత మత స్థాపన

శంకరులు జన్మించేనాటికి ఆనాటి సమా జంలో బహుదేవతారాధన విస్త •తంగా కొనసాగుతోంది. శైవం, వైష్ణవం, జైనం, బౌద్ధం ఇలా ఎన్నో మతాలు,వాటి ఉప శాఖలు లెక్కకు మిక్కిలిగా వర్థిల్లుతున్నాయి. ఆయా మతాలు, శాఖలు పరస్పరం విరుద్ధంగా చెప్పే విషయా లతో అసలు ఆధ్యాత్మిక మార్గం అంటే ఏమిటో, ఆత్మ పరమాత్మ తత్వాల సారాంశం ఏమిటో , ఏ మతం మంచిదో, ఏ శాఖ చెప్పిన విధానాలను పాటించాలో తెలీని అయోమయ పరిస్థితిలో పడ్డారు ఆనాటి సామాన్య ప్రజానీకం. ఆ సమయంలో దశోపనిషత్తుల సారాంశాన్ని రంగరించి అద్వైత మతాన్ని స్థాపించారు శంకరా చార్యులు. మోక్షమార్గాలన్నిటిలోనూ జ్ఞానమార్గం అత్యంత పవిత్రం, ఉత్తమం అయినదని బోధించారు. స్మార్త, వైష్ణవ, సౌర, శాక్తేయ, గాణా పాత్య, శైవ మతాల వారితో వాదించి తన పాండిత్య ప్రతిభతో ఓడించారు. ఏ మతాన్ని నిరసించకుండా వారి ఆచారాలను, విధానాలను సంస్కరించి షణ్మత స్థాపకులయ్యారు. ఆయా మతాలన్నిటినీ సమన్వయం చేసి అద్వైతంలో విలీనం చేశారు. మతం పేర జరిగే హేయమైన ఉపాసనను, మూఢ విశ్వాసాలను, బలులను శంకరాచార్యులు నిరసించారు. కర్మకాండలను వ్యతిరేకించారు. జ్ఞానమార్గం అన్ని మార్గాల కంటే శ్రేష్టమని, జ్ఞానం ద్వారా పొందిన మోక్షం అక్షయ మని ఆదిశంకరులు తెలిపారు. శుద్ధజ్ఞానమే ఆత్మ స్వరూపం అని సప్రామాణికంగానూ , సహేతుకం గానూ నిరూపించారు శంకరులు. శంకరులు రూపొందించిన నిర్గుణ బ్రహ్మసిద్ధాంతం ఉప నిషత్తులలో ఉన్నదే అనడం నిర్వివాదాంశం.

శంకరమఠాల స్థాపన

బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరులు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించారనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని, మఠామ్నాయాలని పిలు స్తారు. ఏ రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో కాశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా భారత దేశమంతా అనేక సార్లు కాలినడకన పర్యటించి తన బోధామ•తాన్ని అందరకూ పంచిపెట్టారు.అయితే బలులను కర్మ కాండలను నిరసించిన శంకరులు విగ్రహారాధనను మాత్రం సమర్థించారు. అధమ స్థాయిలో ఉన్న మనిషి ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగు పెట్టాలంటే విగ్రహారాధన తప్పనిసరని బోధించారు. అందుకే ఎన్నో ఆలయాలను పునరుద్ధరించారు. కొత్త ఆలయాల నిర్మాణానికి క•షిచేశారు. అంతేకాదు దేశంలోని నాలుగు చెరగులా నాలుగు శక్తిపీఠాలను స్థాపించి వాటిలో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టింపచేశారు. వీటిలో కర్నాటకలోని శ•ంగేరీ మఠం అత్యంత ప్రధానమైనది. అలాగే పూరీ, ద్వారక, బదరీనాథ్‍లలో పీఠాలు స్థాపించారు. ఈ నాలుగు పీఠాలతో శంకర భగవత్పాదులు భారతదేశ ఆధ్యాతిక, సనాతన ధర్మపరిపాలనా వ్యవస్థ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేలా సంస్కరణలు చేపట్టి తద్వారా భారతీయ సనాతన ధర్మం చిరకాలం వర్థిల్లేలా దీవించారు. చతుర్ధా మాలు నిరంతరాయంగా నిర్వహించబడేందుకు శంకరులు మఠామ్నాయము, మహాశాసనము అనే నిర్వహణ పద్ధతులను ప్రవేశపెట్టారు. మఠామ్నా యము, మహాశాసనములు నేటి ఆధునిక కంపె నీలు తయారుచేసుకొనే, నిర్వహణ స్వరూపమైన, మెమొరాండం ఆఫ్‍ అసోసియేషన్‍, ఆర్టికల్స్ ఆఫ్‍ అసోసియేషన్‍ అనే రెండు ప్రధాన పత్రాల వంటివి. ఒకటి సంస్థ యొక్క అంతర్గత నిర్వహణకు సంబంధించినది కాగా రెండవది సంస్థకు బయటి ప్రపంచంతో సంబంధాన్ని వివరించేది. మనం ఇప్పుడు పాటిస్తున్న పద్ధతులను శంకరులు ఆనాడే మఠాల నిర్వహణ కోసం ప్రవేశపెట్టారు.

యోగపట్టము

శంకరులు మఠ నిర్వహణ కొరకు నియమింప బడే సన్యాసుల నామాంతరం కోసం యోగ పట్టము అనే విధానాన్ని ప్రవేశపెట్టారు. హిందూ ధర్మం ప్రకారం సన్యాసం తీసుకొన్న వ్యక్తి పాత పేరును విసర్జించి సన్యాసాన్ని సూచించే కొత్త పేరును తీసుకొంటాడు. అటువంటి ప్రత్యేక నామాన్ని యోగపట్టము అంటారు. అందుకోసం శంకరులు పది రకాల నామాలను నిర్దేశించారు. అవి. తీర్ధ, ఆశ్రమ, వన, గిరి, అరణ్య, పర్వత, సాగర, సరస్వతి, భారతి, పురి అనేవి. హిందూ సన్యాసుల పేర్ల చివర ఇలాంటివి కనిపిస్తాయి. ఉదాహరణకు ఆనందతీర్ధ, విద్యారణ్య, విద్యా ప్రకాశానందగిరి, చంద్రశేఖరసరస్వతి, న•సింహ భారతి, తోతాపురి అనే పేర్లు సుప్రసిద్ధాలు. శంక రులు నాలుగు మఠాల స్థాపనకు ప్రమాణంగా దిక్కులను, వేదాలను, సంప్రదాయాలను అనుస రించారు.

మఠ నిర్వహణలో శంకరుల వ్యవస్థానైపుణ్యము

మఠామ్నాయము అని పిలువబడే మఠ నిర్వ హణ వ్యవస్థలో కొన్ని విశేష విధానాలను శంక రులు ఏర్పరిచారు. శంకరులు ఈ పీఠాలకు నారాయణుని, సిద్ధేశ్వరుని (శివుడు) అధి దేవ తలుగా నిర్ణయించాడు. తద్వారా తాము హిందూ ధర్మంలోని ఏ ఒక్క పంథానో మాత్రమే అనుస రించలేదు అని స్పష్టం చేశారు.
వివిధ యోగ పట్టములు ధరించిన సన్యాసు లకు వేర్వేరు బాధ్యతలను కేటాయించటం ద్వారా హిందూ ధర్మాన్ని అనుసరించే ప్రజల ధార్మిక అవసరాలకు, వారుండే వేర్వేరు భౌగోళిక ప్రాంతా లకు ధర్మాచార్యులు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు.
పర్యటన, భిక్ష అనే వ్యవస్థలు సన్యాసులు అన్ని ప్రాంతాలను చుట్టివచ్చేందుకు, వైయుక్తికంగా ఆర్థిక లంపటాలలో చిక్కుకొనకుండా సామాన్య ప్రజలపై ఆధార పడుతూ,‘తమ ధర్మాన్ని తామే పోషించాలి అనే స్ప•హ ప్రజలలో కలుగచేసేందుకే ఈ విధానాన్ని రూపొందించారు.
ధర్మాన్ని కాపాడుకోవడంలో తమకూ బాధ్యత ఉందని ప్రజలకు తెలియ చెప్పేందుకు మరియు ప్రజల మధ్య ఉంటూ వారిలో ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి తమ శక్తిని ఉపయోగించాలి అనే భావనను పీఠాధిపతులలో కలుగ చేయడానికి యోగ పట్ట విధానాన్ని రూపొందించారు.

శంకరుల రచనలు

ఉపనిషత్తులలోని విషయాల ఆధారంగా అద్వైత వేదాంతాన్ని నిరూపించడం శంకరుల రచనలలో ముఖ్య విషయం. శంకరులు తన ‘గురు స్తోత్రం‘ ఆరంభంలో చెప్పిన ‘గురుర్బ్రహ్మ గురు ర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః, గురుఃసాక్షాత్‍ పరంబ్రహ్మా, తస్మై శ్రీ గురవే నమః‘ అనే స్తోత్రం ప్రార్థనా శ్లోకంగా చాలా ప్రసిద్ధమైనది.
శంకరులు పండితుల కోసం శంకర భాష్యాలు, సామాన్యుల కోసం సాధనా పంచకం, ఆత్మబోధ లాంటి అజరామరమైన రచనలను అందించారు. పామరులకు కూడా వేదాంతం తేలిగ్గా అర్థ మయ్యేందుకు వారు సులువుగా పాడుకోగలిగేలా భజగోవిందం లాంటివి రచించారు.
ఇక భక్తి సాహిత్యం విషయానికి వస్తే శంకరులు అనేకమైన చిన్న, పెద్ద స్తోత్రాలను, శ్లోకాలను, కీర్తనలను రచించారు. తేలికైన భాషలో గుండెలోతుల్లోకి చొచ్చుకుపోయేలా ఆయన రచించిన సౌందర్యలహరి, శివానందలహరి, కనక ధారాస్తోత్రం, మహిషాసుర మర్దినీ స్తోత్రం తదితర స్తోత్రాలను నేటికీ ప్రతిభక్తుడూ ఎంతో ఆర్తిగా పాడుకుంటున్నారు. ఇంతేకాదు, శుద్ధవేదాంతుల కోసం నిర్వాణ షట్కమ్‍. కౌపీన పంచకం, సాధనా పంచకం ప్రశ్నోత్తరి మణిమాల, నిర్వాణ మంజరి, సార తత్త్వోప దేశం, వివేక చూడామణి, వేదాంత డిండిమ, ఆత్మషట్కమ్‍, ఆత్మబోధ తదితరాలనూ అందిం చారు. అనంతమైన వారి రచనలలో కేవలం కొన్నే ఇప్పుడు లభిస్తున్నాయి.
ఈ జగత్తుకే ఒక మార్గం చూపి, అందరినీ ఒక్కతాటిపై నడిచేలా చేసిన ఈ జగద్గురువు జీవించింది కేవలం ముప్పై’ రెండు సంవత్సరాలే. ఆ మహనీయుడు భౌతికంగా మనకు దూరమై కొన్ని వందల సంవత్సరాలు గడిచినప్పటికీ వైశాఖ శుద్ధ పంచమినాడు శంకర జయంతి జరుపు కోవడం ఆనాడు సామూహిక ఉపనయనాలు నిర్వహించడం నేటికీ ఆచరణలో ఉంది.

Review జయ జయ శంకర.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top