వరలక్ష్మి విధిని ధిక్కరించగల శక్తిమంతురాలు. తలరాతలు మార్చగల సమర్థురాలు. ‘బ్రహ్మదేవుడు ఇతడిని పేదవాడిగా పుట్టించాడు. పేదరికంలోనే బతకాలని శాసించాడు.
ఆ రాతను నువ్వు కాలిగోటితో తుడిచేయగలవు తల్లీ!’
అంటూ కనకధారాస్తవంలో లక్ష్మీదేవిని
కొనియాడతారు ఆదిశంకరులు.
ఆ వాక్యాలు అక్షర సత్యాలు.
కాబట్టే పరమ దరిద్రుడి పూరిగుడిసె మీద బంగారు ఉసిరికాయల
వర్షం కురిపించిందా పరదేవత.
నల్లధనమై నేలమాళిగలో మగ్గి పొమ్మనో.. దొంగసొత్తుగా విదేశా లకు తరలిపొమ్మనో షరతులు పెడితే మాత్రం భాగ్యలక్ష్మి అసలు ఒప్పుకోదు. కళ్లెర్రజేసి కటకటాలకు పంపుతుంది.
‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’ అనే భావనలోనే లక్ష్మి నివాసం ఉంటుంది.
మంచి మనసే శ్రీలక్ష్మికి హృదయస్థానం. నలుగురి హితం కోరుకున్న చారుమతి శ్రీలక్ష్మీదేవి అను గ్రహానికి పాత్రురాలైంది. ఆమెలోని సద్గుణాలనే మనమూ అనుస రించాలి.
ఆగస్టు 21, 2026 వరలక్ష్మీ వ్రతం సందర్భంగా స్వచ్ఛమైన హృదయాలతో ఆ సిరిదేవత అనుగ్రహం కోసం ప్రార్థిద్దాం.
మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని వ్రతాలు, నోములు ఆచరిస్తాం. వ్రతం అంటే నియమం. సాధకుడిని మానసికంగా దీక్షకు సన్నద్ధం చేసే సాధనం. పురాణాలు అందుకోసం వివిధ రకాల వ్రతాలను నిర్దేశించాయి. వాటిని మనసా వాచా కర్మణా ఆచరించినప్పుడే ఆయా వ్రతాల ఫలితాలు అందుతాయని పెద్దలు చెబుతారు. అటువంటి వ్రతాల్లో అత్యుత్తమమైనది- వరలక్ష్మీ వ్రతం.
పరమాత్మ ప్రతి అవతారం ఒక లక్ష్యసాధనకు ఉద్దేశించినదే. ఆ లక్ష్యమే వేదమయిగా వరాహ అవతారానికి దారి చూపింది. సీతగా రావణ సంహారానికి వారధి వేసింది. అలా ఆ లక్ష్య సిద్ధిధాత్రే వరలక్ష్మీదేవిగా ఇల నెలవైన పుణ్య శ్రావణ మాసంలో భక్తులకు లక్ష్యసిద్ధిని కలిగించే
శుభ సమయం.
పసుపు పచ్చని గడపలతో, ఆకుపచ్చని తోరణాలతో, గలగలమనే గాజుల సవ్వడులతో, ఘల్లుఘల్లుమని అడుగులు వేసే పేరంటాళ్ల రాకపోకలతో కళకళలాడే మాసమే శ్రావణ మాసం. అటువంటి ఈ శుభవేళ సౌభాగ్యలక్ష్మిని ఆహ్వానించడానికి అమ్మవారి ప్రతిమతో పాటు తమను తాము లక్ష్మిలా లక్షణంగా అలంకరించుకోని మహిళలు ఉండరంటే అతిశయోక్తి కాదు. కుటుంబ శ్రేయస్సు కోసం, సకల శుభాల కోసం రోజంతా ఉపవాసం ఉంటూ మోముపై చెదరని చిరునవ్వుతో, అమ్మ ప్రతిమపై మీరని ధ్యానంతో వచ్చిన ప్రతి స్త్రీలోనూ అమ్మను దర్శించుకునే అపురూప సందర్భమే వరలక్ష్మీ వ్రతం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే
శుక్రవారం ఆచరించే ఈ వ్రతం లక్ష్మీ నారాయణులు ఇద్దరికీ ప్రీతిపాత్రం.
శ్రావణ శుక్రవారం వేళ పరదేవత వరలక్ష్మి ఘల్లుఘల్లుమని అడుగు లేస్తూ గడప గడపలో అడుగుపెడు తుంది.
‘స్వాగతం తల్లీ!’ అని మనం సాద రంగా ఆహ్వానించడమే తరువాయి.. పూజాపీఠాన్ని అలంకరించి, షోడశోప చారాలు అందుకుంటుంది.
అష్టోత్తర శతనామాలు ఆలకించి, భక్ష్యభోజ్య నైవేద్యాలు ఆరగిస్తుంది.
తాంబూలం స్వీకరించి తిరుగు ప్రయాణానికి సిద్ధం అవుతుంది.
కానీ, మనం వెళ్లనివ్వకూడదు.
‘మా నట్టింట పద్మాసనం వేసుకుని కూర్చోవమ్మా!’ అంటూ ఆ పద్మావతిని ప్రార్థించాలి. శాశ్వతంగా మన కుటుంబ సభ్యురాలిని చేసుకోవాలి.
అప్పుడే మన ఇల్లు లక్ష్మీ నివాసం.
అదే వరలక్ష్మీ కటాక్షం.
లక్ష్మీదేవి అభిమానవతి. తనకు గౌరవం లభించని చోట ఒక్క క్షణమైనా ఉండదు. అది తన మెట్టునిల్లు వైకుంఠమైనా సరే.
ఓ సందర్భంలో భృగు మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని వ్రతాలు, నోములు ఆచరిస్తాం. వ్రతం అంటే నియమం. సాధకుడిని మానసికంగా దీక్షకు సన్నద్ధం చేసే సాధనం. పురాణాలు అందుకోసం వివిధ రకాల వ్రతాలను నిర్దేశించాయి. వాటిని మనసా వాచా కర్మణా ఆచరించినప్పుడే ఆయా వ్రతాల ఫలితాలు అందుతాయని పెద్దలు చెబుతారు. అటువంటి వ్రతాల్లో అత్యుత్తమమైనది- వరలక్ష్మీ వ్రతం.
పరమాత్మ ప్రతి అవతారం ఒక లక్ష్యసాధనకు ఉద్దేశించినదే. ఆ లక్ష్యమే వేదమయిగా వరాహ అవతారానికి దారి చూపింది. సీతగా రావణ సంహారానికి వారధి వేసింది. అలా ఆ లక్ష్య సిద్ధిధాత్రే వరలక్ష్మీదేవిగా ఇల నెలవైన పుణ్య శ్రావణ మాసంలో భక్తులకు లక్ష్యసిద్ధిని కలిగించే
శుభ సమయం.
పసుపు పచ్చని గడపలతో, ఆకుపచ్చని తోరణాలతో, గలగలమనే గాజుల సవ్వడులతో, ఘల్లుఘల్లుమని అడుగులు వేసే పేరంటాళ్ల రాకపోకలతో కళకళలాడే మాసమే శ్రావణ మాసం. అటువంటి ఈ శుభవేళ సౌభాగ్యలక్ష్మిని ఆహ్వానించడానికి అమ్మవారి ప్రతిమతో పాటు తమను తాము లక్ష్మిలా లక్షణంగా అలంకరించుకోని మహిళలు ఉండరంటే అతిశయోక్తి కాదు. కుటుంబ శ్రేయస్సు కోసం, సకల శుభాల కోసం రోజంతా ఉపవాసం ఉంటూ మోముపై చెదరని చిరునవ్వుతో, అమ్మ ప్రతిమపై మీరని ధ్యానంతో వచ్చిన ప్రతి స్త్రీలోనూ అమ్మను దర్శించుకునే అపురూప సందర్భమే వరలక్ష్మీ వ్రతం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే
శుక్రవారం ఆచరించే ఈ వ్రతం లక్ష్మీ నారాయణులు ఇద్దరికీ ప్రీతిపాత్రం.
శ్రావణ శుక్రవారం వేళ పరదేవత వరలక్ష్మి ఘల్లుఘల్లుమని అడుగు లేస్తూ గడప గడపలో అడుగుపెడు తుంది.
‘స్వాగతం తల్లీ!’ అని మనం సాద రంగా ఆహ్వానించడమే తరువాయి.. పూజాపీఠాన్ని అలంకరించి, షోడశోప చారాలు అందుకుంటుంది.
అష్టోత్తర శతనామాలు ఆలకించి, భక్ష్యభోజ్య నైవేద్యాలు ఆరగిస్తుంది.
తాంబూలం స్వీకరించి తిరుగు ప్రయాణానికి సిద్ధం అవుతుంది.
కానీ, మనం వెళ్లనివ్వకూడదు.
‘మా నట్టింట పద్మాసనం వేసుకుని కూర్చోవమ్మా!’ అంటూ ఆ పద్మావతిని ప్రార్థించాలి. శాశ్వతంగా మన కుటుంబ సభ్యురాలిని చేసుకోవాలి.
అప్పుడే మన ఇల్లు లక్ష్మీ నివాసం.
అదే వరలక్ష్మీ కటాక్షం.
లక్ష్మీదేవి అభిమానవతి. తనకు గౌరవం లభించని చోట ఒక్క క్షణమైనా ఉండదు. అది తన మెట్టునిల్లు వైకుంఠమైనా సరే.
ఓ సందర్భంలో భృగు మహర్షి.. తన నిజ నివాసమైన విష్ణుమూర్తి హృదయ స్థానాన్ని కాలితో తన్నడంతో ఆమె మనసు చివుక్కుమంది.
కన్నీళ్లు పెట్టుకుంటూ కొల్హాపురానికి బయల్దేరింది.
దీంతో సిరిలేని వైకుంఠం చిన్నబోయింది.
లక్ష్మిని కోల్పోయిన నారాయణుడు తేజస్సును కోల్పోయాడు.
శ్రీ అంటే సంపదే కాదు.. భాగ్యం, విజయం, వైభవం, తేజస్సు కూడా!.
భారతీయ సంప్రదాయం శ్రీమహాలక్ష్మిని అష్టలక్ష్మిగా ఆరాధిస్తుంది.
అష్టలక్ష్మి రూపాలైన ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మిగా.. వరలక్ష్మీదేవి భక్తులను అనుగ్రహిస్తుంది.
తార్కికంగా ఆలోచిస్తే ఈ లక్ష్మీరూపాల ఉపాసన ద్వారానే మానవులు చతుర్విధ పురుషార్థాలైన ధర్మ అర్థ కామ మోక్షాలను సాధించగలరు.
ఈ ఎనిమిది రూపాలూ లక్ష్మీతత్వానికి ఎనిమిది కోణాలు.
లక్ష్మీ కటాక్షాన్ని సాధించడానికి ఈ ఎనిమిది రూపాలూ ఎనిమిది సోపానాలు కూడా.
ఆదిలక్ష్మి- సంకల్ప బలానికి ప్రతీక. విశ్వకుబేరుడి పయనమైనా ఒక్క రూపాయితోనే మొదలవుతుంది. లక్ష్యాన్ని సాధించగలననే ఆ మనోబలంలో ‘ఆదిలక్ష్మి’ కొలువై ఉంటుంది. ఆదిలక్ష్మి భౌతిక సంపదకు చిహ్నంగా భావించే ఆధ్యాత్మిక సంపదకు తొలిమెట్టు.
అవరోధాలను అధిగమించి కలలను నిజం చేసుకోవడానికి సాధకుడు సాగించే ప్రయాణంలో ‘ధైర్యలక్ష్మి’ అండగా నిలుస్తుంది. అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యే ప్రపంచంలో సవాళ్లను తట్టుకునే ధైర్యాన్నిచ్చే తల్లి ధైర్యలక్ష్మి.
అలా అని ఆ ఒక్కటే సరిపోదు. విజయసాధనకు నైపుణ్యమూ కావాలి. ఆ మేధస్సును ‘విద్యాలక్ష్మి’ అందిస్తుంది. మన తప్పటడుగులను సరిచేసి జ్ఞానవంతులను చేసే తల్లే విద్యాలక్ష్మి.
బలమైన శరీరంలోనే బలమైన మనసు ఉంటుంది. అంతటి సత్తువ ఆహారంతోనే వస్తుంది. అలా ‘ధాన్యలక్ష్మి’ భోజనం రూపంలో శారీరక దృఢత్వాన్ని ఇస్తుంది.
శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధన సంపత్తితో మనం సాగించే పోరాటం మనల్ని గెలుపు వైపు నడిస్తుంది. అది ‘విజయలక్ష్మి’ ప్రసాదం. నిస్వార్థ లోకోపకార ప్రయత్నాన్ని నెరవేర్చే చుక్కాని విజయలక్ష్మి.
ఆ అర్హతతో మనదైన రంగంలో, మనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాం. దానికి అధి దేవత ‘గజలక్ష్మి’. ఆమెను సామ్రాజ్యలక్ష్మిగానూ పిలుస్తారు. ధర్మపాలనకు, పరిరక్షణకు కొండంత అండగా గజలక్ష్మి నిలుస్తుంది.
ఆ వెనువెంటనే ‘ధనలక్ష్మి’ కరుణిస్తుంది. తన భక్తుల నిత్య అవసరా లకు ధనలక్ష్మి ఆలం బనగా నిలుస్తుంది.
దీని తరువాత దశ.. విస్తరణ. ఒక ఎకరం నుంచి పది ఎకరాలకూ, ఒక లక్ష నుంచి వెయ్యి లక్ష లకూ, ఒక పట్టా నుంచి రెండు పట్టాలకూ.. ఒక వ్యక్తి నుంచి ఒక కుటుంబానికి.. పిల్లాపాపల్లాంటి కీర్తి వైభోగాన్ని కటాక్షించేది- ‘సంతానలక్ష్మి’. ఈమే మనకు బంధు బలగాలను సమకూరుస్తుంది. పసిపిల్లల రక్షణ, సంరక్షణలకు సంతానలక్ష్మి సహకరిస్తుంది.
అలా ఎనిమిది దశల్లో మనం జీవిత లక్ష్యాన్ని సాధిస్తాం.
అష్టలక్ష్ముల్లోని పై లక్షణాలన్నీ ప్రతీ స్త్రీలోనూ ఉండేవే. అవసరాన్ని బట్టి ఆయా పాత్రల్లో ఇమిడిపోవడం మహిళలకు సునాయాసం.
చారుమతి సహనంతో, సమయస్ఫూర్తితో ప్రవర్తించిన తీరు వరలక్ష్మీదేవిని ముగ్ధురాలిని చేసింది. ఆమెలోని సంపూర్ణత్వాన్ని గమనించిన దేవి కోరకుండానే కొంగుబంగారమై నిలిచింది.
సూర్యస్య రశ్మియో యదృత:
ఊర్మయో అంబుధోరివ
సర్వైశ్వర్య ప్రభావేన
కమలా శ్రీపతే తథా!
శ్రీహరి, శ్రీలక్ష్మి.. వీరిద్దరిదీ సూర్యుడికీ, కిరణాలకూ ఉన్న సంబంధం. సముద్రానికీ, అలలకూ ఉన్న అనుబంధం.
మనం వ్యవహారంలో సత్యనారాయణస్వామి వ్రతం చేసుకుంటున్నాం అంటాం కానీ, రమా సమేతుడిగానే ఆయన పూజలు అందుకుంటాడు.
శ్రావణంలో మనం జరుపుకునేది వరలక్ష్మీ వ్రతమే అయినా.. శ్రీమన్నారాయణుడితో కలిసే ఆ నారాయణి కలశంలో కొలువుదీరుతుంది.
ఆ మాటకొస్తే మహావిష్ణువు మాత్రం శ్రీలక్ష్మిని విడిచిపెట్టి ఉండగలడా?
అందులోనూ ఆమెకు ‘చంచల’ అని పేరు.
ఎవరినీ ఎల్లకాలమూ ఆశ్రయించి ఉండదనే శ్రుతి వాక్యమూ ఉంది.
ఆ భయంతోనే తన సిరుల దేవతకు తన గుండెల్లో చోటిచ్చి కమలాక్షిని కట్టడి చేశాడనీ అంటారు.
పురాణాలు మహావిష్ణువును ‘నిత్య శ్రీ’ అని వర్ణించాయి.
అంటే ఆ శ్రీపతి శిష్ట రక్షణకైనా, దుష్ట శిక్షణకైనా శ్రీమతితో కలిసి వెళ్లాల్సిందే.
గజేంద్రుడిని రక్షించడానికి ‘సిరికిన్ జెప్పక..’ బయల్దేరిన మాట నిజమే అయినా, ఆ తొందరలోనూ ఇల్లాలి కొంగును శ్రీహరి వదిలిపెట్టలేదు.
అది చూసి, ‘మరీ ఇంత ప్రేమా! శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు’ అని ముక్కున వేలేసుకున్నారట ముక్కోటి దేవతలు.
ఆ ఇద్దరి అన్యోన్యతా ఓ దాంపత్య పాఠం.
సత్యకాలానికి ముందు నుంచీ వాళ్లు నిత్య ప్రేమికులే.
కాబట్టే అమ్మవారిని ‘ఈశానం జగతోస్య వేంకటపతేర్విష్ణో: పరాం ప్రేయసీం’ అని కొనియాడుతుంది వేంకటేశ్వర ప్రపత్తి.
శ్రీహరిని పతిగా పొందిన ఆ సీమంతురాలైన శ్రీలక్ష్మి సున్నిత మనస్కురాలు.
లక్ష్మీ కటాక్షాన్ని పొందాలంటే ముందుగా లక్ష్మి స్వభావాన్ని అర్థం చేసుకోవాలి.
ఆమె ఇష్టాయిష్టాలను గ్రహించాలి.
మహా భారతంలోని శాంతిపర్వంలో ధర్మరాజు- ‘మహాలక్ష్మి ఎక్కడెక్కడ కొలువై ఉంటుంది పితామహా!’ అని అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుడిని అడుగుతాడు.
‘పచ్చని పొలంలో, పారే నీటిలో, పసుపు పూసిన గడపలో, స్వచ్ఛమైన చిరునవ్వులో, అతిథి అభ్యాగతులతో కళకళలాడే నివాసాల్లో, పరిశుభ్రతలో, సత్యంలో, దానంలో, ధర్మంలో..’ అని లోతుగా వివరిస్తాడు భీష్ముడు.
ఇంకా, ‘నిత్యసత్యులు, శౌచనిరతులు, అమలమతులు..’ అంటూ అమ్మకు నచ్చే సద్గుణాలనూ వివరిస్తాడు.
శ్రీలక్ష్మి శాంతిప్రియ.
తాను కొలువైన చోట అనందాలు వెల్లివిరియాలని కోరుకుంటుంది.
ఆమె లక్ష్యానికి అధిదేవత కూడా!.
దీపలక్ష్మిగా అజ్ఞాన తిమిరాన్ని ఛేదించి, జ్ఞాన సాధనకు మార్గం సుగమం చేస్తుంది.
కాబట్టే చీకటికి ప్రతీక అయిన గుడ్లగూబను ఏరికోరి తన వాహనంగా ఎంచుకుంది.
అమ్మకు పచ్చదనమంటే ప్రాణం. అందుకే వనలక్ష్మిగా, వృక్షలక్ష్మిగా భక్తులు ఆమెను ఆరాధిస్తారు. ‘ప్రకృత్యై నమ:’ అంటూ శాస్త్రం సైతం ఆమెకు చేతులు జోడిస్తుంది. నాలుగు మొక్కలున్న చోటికి బొట్టు పెట్టి పిలవకపోయినా వెళ్లిపోతుందట ఆ శ్రీమహాలక్ష్మి.
సిరిలక్ష్మికి గృహలక్ష్మి అంటే మహా మక్కువ.
ఇల్లాలి చిరునవ్వులోనూ తానుంటానని స్కాంద పురాణంలో ప్రకటించింది.
అంతేనా.. ఆప్యాయంగా మాట్లాడేవారూ, పెద్దల్ని సేవించే వారూ తన అభిమానానికి పాత్రులు అవుతారని వెల్లడించింది.
వినయ సంపన్నులను చూస్తే అమ్మవారికి మహా ముచ్చట. ‘నా బిడ్డ బంగారం’ అని మురిసిపోతుంది.
తమకున్నది పంచుకుంటూ ఇతరుల ముఖాల్లో ఆనందాన్ని వెతుక్కునే వారినీ వెన్నంటే ఉంటుంది మహాలక్ష్మి.
శ్రీరంగంలో వెలసిన అమ్మవారి పేరు రంగనాయకి. ఒకసారి అమ్మవారి వజ్రాల ముక్కెర కనిపించకుండా పోయింది.
బోసిపోతున్న ఆ నాసికం వైపు చూసి భయపడిపోయారు అర్చకులు.
అంతలోనే అశరీరవాణి.. తంజావురు ప్రభువుల అన్నదాన సత్రంలో ఆ నగ ఉందని చెప్పింది.
వెంటనే ఆలయ అధికారులు అక్కడకు బయల్దేరి వెళ్లారు.
తంజావూరు పాలకుడు విజయరాఘవుడిని కలిసి జరిగినదంతా చెప్పారు.
ఆయన అనుమతితో అణువణువూ గాలించారు.
మొత్తానికి, ఓ పొయ్యి పక్కన కుప్పగా పోసిన బూడిదలో దొరికిందా వజ్రాభరణం.
తీరా విచారిస్తే.. రోజూ వచ్చే వంటలమ్మ అనారోగ్యం వల్ల కొద్దికాలంగా గైర్హాజరు అవుతోందని, ఆమె స్థానంలో వంటపనికి వస్తున్న ఓ ముసలి ముత్తయిదువ ఆ ముక్కెర పెట్టుకునేదనీ అక్కడి సిబ్బంది తెలిపారు.
అంటే, ప్రభువుల నిత్యాన్నదాన మహత్కార్యం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకూడదనే ఉద్దేశంతోనే అమ్మవారు ముదుసలి వంటగత్తె రూపంలో శ్రీరంగం నుంచి వచ్చి వండి వార్చారన్న మాట!.
అలా అన్నలక్ష్మిగా పేదల ఆకలి తీర్చింది.
అన్నట్టు.. మనం తిని మరో నలుగురి కోసం విస్తరి వేయగలిగితే.. ఆ విస్తరి కూడా లక్ష్మీ స్వరూపమే!.
పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, పూలు.. ఇవి లక్ష్మీ నివాసాలని పురాణాలు ముక్తకంఠంతో చెబుతున్నాయి.
అశాంతినీ, అసంతృప్తినీ లక్ష్మీదేవి ఇష్టపడదు.
వ్యాజ్యాలూ, వివాదాలూ తనకు గిట్టవు.
వ్యసనపరుల నీడనైనా భరించలేదు.
క్రూర స్వభావులనూ, కఠినాత్ములనూ ఆమడ దూరంలో ఉంచుతుంది.
సోమరులను ప్రేమించదు.
స్వార్థపరులను ప్రోత్సహించదు.
అతి నిద్రాపరులను ఆదరించదు ఆయా లోపాలను సరిదిద్దడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది.
అవసరమైతే, తన అక్క జ్యేష్ఠాదేవిని పురమాయించి అటువంటి వారికి కాస్త కఠినంగానే బతుకు పాఠాలు నేర్పుతుంది.
అలా అని లక్ష్మికి కోపతాపాలు తెలియవు.
ఆమె మది నిండా మాతృత్వ మమకారమే.
బిడ్డలను మంచి వైపు మళ్లించి, మళ్లీ సిరిసంపదలను ప్రసాదించడానికే ఆమె ఈ ప్రయత్నమంతా!.
అలక్ష్యం, అజ్ఞానం, అహంకారం, అత్యాశ.. ఇవి దరిద్ర లక్ష్మికి స్వాగత ద్వారాలు.
శ్రీ సూక్తంలో ‘అమ్మా! మా జీవితాల్లోంచి అలక్ష్మిని తొలగించు. మా ఇంటి నుంచి ఆ పెద్దమ్మ (జ్యేష్ఠాదేవి)ను బయటకు పంపించు’ అని ప్రార్థిస్తుంది వేదం.
పూర్వం జంబాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. అతను మహా బలవంతుడు. అనేక యుద్ధాల్లో దేవతలను చిత్తుగా ఓడించాడు. దీంతో ముక్కోటి దేవతలూ దత్త స్వరూపంలో లక్ష్మీ సమేతంగా కొలువుదీరిన నారాయణుడిని ఆశ్రయించారు. తమను కాపాడాలని వేడుకున్నారు. హరి వారికి అభయమిచ్చి పంపించాడు. ఆ అసురుడిని యుద్ధానికి ఉసిగొల్పి, తన వద్దకు రప్పించాలని సలహా ఇచ్చాడు.
విష్ణుమూర్తి ‘అనఘుడు’ (లోపరహితుడు) అయినపప్పుడు, లక్ష్మీదేవి మాత్రం ‘అనఘ’ కాకుండాపోతుందా?
అసుర సంహారం కోసం ఆమె అనఘాదేవిగా అవతరించింది.
దేవతలను తరుముతూ వచ్చిన జంబాసురుడు అనఘాదేవిని కాముక దృష్టితో చూశాడు.
ఆమెను బలవంతంగా ఒక బుట్టలో కూర్చోబెట్టి, నెత్తిన మోసుకుని బయల్దేరాడు.
సిరి నెత్తికెక్కగానే ఎంతటి వారిలోనైనా బలం, తేజస్సు క్షీణించిపోతాయి. జంబుడి విషయంలోనూ అదే జరిగింది.
అతడిలోని మునుపటి శక్తి మాయమైపోయింది.
నెత్తిన ఉన్న భూలక్ష్మి బరువును మోయలేక గంపను కిందకు దించేశాడు.
అదే అవకాశంగా, ఆ రాక్షసుడిని ఒక్క దెబ్బకు నేలకూల్చారు దేవతలు.
మహా సంపన్నులమని అహంకరించే వారూ, వ్యసనాలతో పెద్దల ఆస్తులను కరిగించే వారూ ఆమె దృష్టిలో జంబాసురులే.
లక్ష్మీదేవి అలాంటి వ్యక్తిత్వ లోపాలను తీవ్రంగా పరిగణిస్తుంది.
శ్రీ సూక్తం వర్ణించిన ఆరు లక్ష్మీ స్వరూపాల్లో అత్యున్నతమైనది వరలక్ష్మి రూపం.
అనేక పురాణాల్లో వరలక్ష్మీ వ్రతం గురించి ప్రస్తావన కనిపిస్తుంది.
సాక్షాత్తూ పరమశివుడే పార్వతీదేవికి ఆ ప్రాశస్త్యాన్ని వివరించిన ఘట్టాలూ ఉన్నాయి.
వరలక్ష్మీ వ్రత కథ ప్రకారం.. చారుమతి అనే ఇల్లాలికి శ్రీమహాలక్ష్మి కలలో కనిపించి, తనను అర్చించే విధానాన్ని గురించి బోధిస్తుంది.
ఈ గృహిణి వేదాలను చదువుకోలేదు.
తపస్సులూ చేయలేదు.
అయితేనేం, అతిథి సత్కారంలో అన్నపూర్ణమ్మ.
అత్తమామలను గౌరవించేది. భర్తను ప్రేమించేది. పిల్లల్ని రత్నాలూ, మాణిక్యాల్లా తీర్చిదిద్దేది.
ఇంటిని అద్దంలా ఉంచుకునేది.
నలుగురికీ చేతనైనంత సాయం చేసేది.
అమ్మకు నచ్చే అతి గొప్ప గుణం.. భూతదయ.
అంతకుమించిన ఆధ్యాత్మిక సాధన లేదు కాబట్టే, చారుమతిని తన ప్రతినిధిగా ఎంచుకుంది.
‘నువ్వు నిలువెత్తు దయా స్వరూపానివి తల్లీ!’ అంటూ శ్రీలక్ష్మిని కీర్తిస్తారు వేదాంత దేశికులు తన ‘దయా స్తోత్రం’లో.
పూజాధికాల్లో మనం పారాయణం చేసే అష్టోత్తర శతనామాలు లక్ష్మీతత్వానికి శతాధిక కోణాలు.
విద్యాయై నమ:
ఆమె చదువులకు మూలం.
శ్రద్ధాయై నమ:
శ్రద్ధా గుణంలో ఆ తల్లి అంశ అంతర్లీనం.
శుచయే నమ:
శుభ్రత లక్ష్మీ స్వరూపం.
కరుణాయై నమ:
కారుణ్యం కరుణశ్రీ సహజ గుణం.
సత్యై నమ:
ఆమె సాక్షాత్తూ సత్య స్వరూపిణి.
శుభాయై నమ:
శుభాలు లక్ష్మీ కటాక్షాలు.
జయాయై నమ:
తను విజయ ప్రదాత.
వ్రతాలూ, నోముల సందర్భంగా మహిళలు చేసుకునే ముస్తాబులోనూ తానుంటానని వెల్లడించింది లక్ష్మీదేవి.
ఆ అలంకరణ సమయంలో ఆడపిల్లలు తమలో తాము లక్ష్మీదేవిని చూసుకుంటారట.
‘మమ రూపాసి దేవిత్వం.. న భేదోస్తి త్యయామయీ’.. అంటూ అమ్మవారి తరఫున ఆ విషయాన్ని వెల్లడిస్తుంది శుభాగమ పంచకం.
ఆధ్యాత్మిక సాధనలో
ఇది ‘సారూప్య
మార్గం’.
సకలాభీష్ట సిద్ధిరస్తు!
వరలక్ష్మీ వ్రతం ఆచరించే వారు ఇంట్లో ఈశాన్య మూలన మంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానిపై ముగ్గు వేసి, అరటి ఆకు పరిచి బియ్యం పోయాలి. ఆపై పంచపల్లవాలు పరిచి, ఒక స్వచ్ఛమైన నీటితో నిండిన కలశం ఉంచాలి. దానిపై మామిడి ఆకులను, కొబ్బరిని ఉంచాలి. ప్రాణం, శక్తి, చైతన్యం వంటివన్నీ నీటి ద్వారానే ప్రసారమవుతాయి. కాబట్టే వ్రతాచరణలో కలశ స్థాపనకు మన పెద్దలు అంత ప్రాధాన్యం ఇచ్చారు.
ఱ అమ్మవారిని శక్తిమేర అలంకరించి మంటపంలో ఉంచాలి.
ఱ ఆవునేతి దీపాలు, పదహారు లేదా తొమ్మిది తోరాల కంకణాలు, పరమాన్నం, పాయసం, పూర్ణాలు, బూరెలు, మొలకల వంటి నైవేద్యాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
ఱ హరిద్రా గణపతిని, అమ్మవారిని తమలపాకుపై ఉంచి కలశం వద్ద పూజకు సిద్ధం చేసుకోవాలి.
ఱ యథాశక్తి ధ్యానావహనాది షోడశోపచార పూజ చేసి వ్రతకథను పఠించాలి.
ఱ అమ్మవారి పూజ కోసం కనీసం మూడు తోరాలను సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, ఒకటి పూజ చేసే వారికి, మరొకటి ముత్తయిదువుకు. ఇలా సిద్ధం చేసుకున్న తోరాన్ని నవసూత్రం అని పిలుస్తారు. వీటిలో తొమ్మిది పోగులు, తొమ్మిది ముడులు లేదా పదహారు చొప్పున పోగులు, ముడులు ఉండవచ్చు. సంఖ్య ఏదైనా తోరగ్రంథి పూజ ఇహపర విజయాలను సాధ్యం చేస్తుందని భక్తుల నమ్మకం.
ఱ వరలక్ష్మీ దేవి చారుమతిని, ఆమె పరివారాన్ని అనుగ్రహించిన తీరు మనల్ని ఒకింత ఆశ్చర్యపరిచినా, చారుమతిలోని సద్గుణాలు మనం ఆమెను అనుసరించేలా చేయగలవు.
సిరి.. హరి
శ్రీ.. లక్ష్మి.. మహాలక్ష్మి..
దేవతలు ఆ తేజోరాశికి చేతులెత్తి మొక్కుతున్నారు.
అసురులు ఆ సౌందర్యరాశిని నోరెళ్లబెట్టి చూస్తున్నారు.
పద్మాక్షి, పద్మప్రియ, పద్మగంధి.. క్షీరసాగర మథనంలో పద్మాసన ముద్రలో సాక్షాత్కరించింది. దేవకాంతలు ఆ మంగళ స్వరూపిణికి మంగళ స్నానాలు చేయించారు. ఆ నిత్య సౌభాగ్యవతికి పసుపు కుంకుమలు సమర్పించారు. ఆ హిరణ్యవర్ణకు స్వర్ణాభరణాలు అలంకరించారు. ఆ చక్కదనాల చుక్కకు దిష్టిచుక్క పెట్టారు.
చుట్టూ ఉన్న వారిని చిరునవ్వుతోనే పలకరించి.. కలువల హారంతో స్వయంవరానికి బయల్దేరింది క్షీరాబ్ధి కన్యక.
అందరినీ గమనించుకుంటూ ముందుకు సాగుతోంది ఇందిర.
నాలుగు తలల వారొకరూ.. మూడు కళ్ల వారొకరూ.. నిప్పుల కొలిమి ఒకరూ.. నిలకడలేని స్వభావి ఇంకొకరూ.. ఇలా ఎవరిని చూసినా ఏదో లోపం. అంతలోనే సిరి దృష్టి హరి వైపు మళ్లింది. ఆయనది వంక పెట్టలేని వ్యక్త్తిత్వం. కామక్రోధాలకు అతీతమైన పరిపూర్ణత్వం. అంతే, అక్కడితో ఆమె అన్వేషణ ముగిసింది.
సాధు రక్షకుండు షడ్వర్గ రహితుండు
నాథుడయ్యెనేని నడప నోపు
నితడె భర్త యనుచు నింతి సరోజాక్షున్
పుష్ప దామకమున బూజసేసె..
క్షణమైనా ఆలస్యం చేయకుండా, చేతిలోని పూదండను పురుషోత్తముడి మెడలో అలంకరించింది.
పడతి ప్రతిపాదనకు కళ్లతోనే ఆమోదం తెలిపాడు అరవిందాక్షుడు.
హృదయపూర్వకంగా జీవితంలోకి ఆహ్వానించి హృదయంలో చోటి చ్చాడు.
అతడు నిరంతరుడు.. ఆమె నిత్యానపాయిని.
భృగు మహర్షి బ్రహ్మ మానసపుత్రుడు. ఆయన సతీమణి పేరు ఖ్యాతి. పరాశక్తి కటాక్షం కోసం ఆ మహర్షి కఠోరమైన సాధన చేశాడు. ఆ సంకల్పానికి మెచ్చి జగజ్జనని ప్రత్యక్షమైంది.
‘నీలోని వైభవ కళను పుత్రికగా మాకు ప్రసాదించు తల్లీ!’ అని వేడుకున్నాడు భృగు మహర్షి. అమ్మ అనుగ్రహించింది.
అలా, ఆ ఇంట భార్గవిగా జన్మించింది శ్రీలక్ష్మి. అదే సమయానికి నారాయణనుడు విశ్వశ్రేయస్సు కోసం తపోభూమికి బయల్దేరాడు. ఆ సంగతి తెలిసిన ఇంద్రుడు విఘ్నాలను సృష్టించి రమ్మంటూ అప్సరసలను పురమాయించాడు. అయినా, పురుషోత్తముడు చలించలేదు. విశ్వరూప దర్శనమిచ్చి తానేమిటో వారికి తెలియచెప్పాడు. ఆ విషయం భార్గవికి తెలిసింది. అప్పటి నుంచీ ఆ విరాట్‍మూర్తిని తన పెనిమిటిగా ఊహించుకుంది. స్వామి కోసం తపస్సు చేసింది. ఆమె సంకల్పానికి ముచ్చట పడిన విష్ణుమూర్తి.. ఆ లక్ష్మీ అంశను తన జీవన సహచరిగా స్వీకరించాడు.
అతడు నిరంతరుడైతే.. ఆమె నిత్యానపాయిని. ప్రతి అవతారంలోనూ ఆమె భర్తనే అనుసరిస్తుంటుంది. మత్స్యావతారంలో శ్రియగా, కూర్మావతారంలో కూర్మవతిగా, వరాహావతారంలో భూలక్ష్మిగా, నరసింహావతారంలో శ్రీలక్ష్మిగా, పరశురామావతారంలో రేవతిగా, రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా.. స్వామి కోసమే అవతరించింది. వామనావతారంలో కృష్ణాజినంగా మారి వటుడి రూపంలోని విష్ణువుతో పాటు బలి చక్రవర్తి సభకు వెళ్లింది.
ఎక్కడా, ఏ చిన్న ఎడబాటునూ తట్టుకోలేదామె. అయినా కొన్నిసార్లు వేరుపడక తప్పలేదు. అదీ లోక కల్యాణం కోసమే.
ఒకసారి శ్రీమహావిష్ణువు తనకు ప్రసాదించిన నిర్మాల్యహారాన్ని ఐరావతం మీద ఊరేగుతున్న దేవరాజు ఇంద్రుడికి అందించాడు దూర్వాస మహర్షి. ఇంద్రుడు ఆ దండను కళ్లకైనా అద్దుకోకుండా, ఐరావతం మెడలో వేశాడు. తెల్ల ఏనుగు.. తన సహజ ప్రవృత్తి కొద్దీ తొండంతో దాన్ని విసిరికొట్టింది. దీంతో మహర్షిలో కోపం కట్టలు తెంచుకుంది.
‘ఇంద్రా! అంతులేని సంపదలను చూసుకునే కదా నీకీ మిడిసిపాటు. ఆ ఐశ్వర్యాలకు మూలం సముద్రం పాలైపోతుంది’ అని శపించాడు.
ఆ కారణంగానే లక్ష్మీదేవి కొంతకాలం అనంత జలనిధిని ఆశ్రయించింది. సురాసురుల క్షీరసాగర మథనం సమయంలో మళ్లీ బయటికొచ్చింది. లోక కల్యాణ కారకుడైన శ్రీహరిని వరుడిగా ఎంచుకుంది.
ఆగస్టు 29: గాయత్రి జపం
త్రిసంధ్యం.. పఠేన్నిత్యం
ఓం భూర్భువస్య:
తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియో యో న: ప్రచోదయాత్
ఈ లోకంలో గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం మరొకటి లేదన్నది పురాణ వచనం. ఓంకార ధ్యానం ద్వారా లభించే ఫలాలు గాయత్రీ ధ్యానం ద్వారా లభిస్తాయి. తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రలేచి, ఉత్తరం లేదా తూర్పుముఖంగా కూర్చుని గాయత్రీ జపం చేయాలి. రోజూ మూడు వేల నుంచి నాలుగు వేలసార్లు గాయత్రీ మంత్రాన్ని జపిస్తే శ్రేష్ఠం. ఇన్నిసార్లు చేయలేకుంటే 1,008 సార్లు, అదీ కుదరకుంటే 108 సార్లు చేయాలి. సూర్యోదయ, మధ్యాహ్న, సూర్యాస్తమయాల్లో 36 సార్లు చొప్పున చేయాలి. రోజులో మూడుసార్లు ఆరాధిస్తారు కాబట్టే గాయత్రీదేవిని ‘త్రిసంధ్య’ అని కూడా పిలుస్తారు. రోజులోని ఈ మూడు సంధ్యా సమయాలు చాలా శక్తివంతమైనవి. ఎక్కువ శ్రమించకుండానే ఏకాగ్రత లభిస్తుంది. మనసు త్వరగా ఉన్నతమవుతుంది. హృదయం వేగంగా శుద్ధమై, సత్వగుణంతో నిండుతుంది.
గాయత్రీదేవి వేదాలకు మాతృమూర్తి. కనుక ఆమె మంత్ర జపం వేద పఠనం ఇచ్చినంత ఫలాన్నిస్తుంది. పాపాలను హరిస్తుంది. ఈ మంత్రాన్ని రోజుకు మూడుసార్లు పునరావృతం చేసినంతలో మోక్షం లభిస్తుంది. ఆరోగ్యం, అందం, బలం, తేజం, ఆకర్షణ, ప్రకాశాలను ప్రసాదిస్తుంది. ధర్మార్థకామమోక్షాలను ప్రసాదిస్తుంది. అజ్ఞానం, అవిద్యలను నాశనం చేస్తుంది. అష్టసిద్ధులనూ ప్రసాదిస్తుంది. మనిషిని శక్తిమంతంగా, ప్రతిభావంతంగా చేస్తుంది. చివరికి జనన మరణాల చక్రం నుంచి విముక్తినిస్తుంది. మనసులోని మలినాలు తొలగిపోవడానికి ఎక్కువసార్లు గాయత్రి మంత్రం జపించాలి. గాయత్రీ మంత్రాన్ని పదేపదే స్మరించే వారికి భగవత్ దర్శనం లభిస్తుంది.
గాయత్రి మంత్రం జపించే వారు సాత్విక ఆహారం తీసుకోవాలి. మోక్షాన్ని పొందడం కోసం చేసే మంత్ర జపానికి ఎలాంటి పరిమితులు లేవు. అశ్వత్థ వృక్షం కింద, గంగానది ఒడ్డున గాయత్రీ జపం చేస్తే మంత్రసిద్ధి వేగంగా కలుగుతుంది. పునశ్చరణ చేసేటప్పుడు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మౌన సాధన అత్యంత ప్రయోజనకరం. దీన్ని ఆచరించలేని వారు నెలలో ఒక వారం లేదా ఆదివారాల్లో మౌనాన్ని పాటించవచ్చు. సాధన చేసే వారు నిర్ణీత సంఖ్యను పూర్తి చేసే వరకూ ఆసనం నుంచి లేవకూడదు. భంగిమను మార్చకూడదు.
సృష్టి అంతా గాయత్రిపై ఆధారపడి ఉంది. ముగింపులో గాయత్రీ మంత్ర జపాన్ని పునరావృతం చేయడం వల్ల గాయత్రీ దర్శనం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గాయత్రీ మాత- స్వచ్ఛమైన బుద్ధి, సదాలోచన, సదవగాహనం, సత్ప్రవర్తనలను ప్రసాదిస్తుంది. అన్ని కార్యక్రమాల్లో ఆ తల్లి మార్గనిర్దేశం చేస్తుంది. జనన మరణ సంసార చక్రం నుంచి విముక్తి కలిగిస్తుంది.





























































































Review వరలక్ష్మ.