ప్రస్తుతం వరుస సినిమాలతో సెట్స్‌పై తీరిక లేకుండా గడుపుతున్నాడు అగ్రహీరో ప్రభాస్. ఆయన నటిస్తున్న ‘రాజాసాబ్’, ‘ఫౌజీ’ సినిమాలు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. వీటి వరుసలోనే ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సమాయత్తం అవుతున్నాడు. తెలుగులో ‘అర్జున్‌రెడ్డి’, బాలీవుడ్లో ‘ఏనిమల్’ వంటి చిత్రాలతో సంచలనం సృష్టించిన సందీప్‌రెడ్డి వంగా తాజాగా రూపొందించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తోంది. భూషణ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను సెప్టెంబరు నుంచి ప్రారంభిస్తున్నట్టు చిత్ర యూనిట్ ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇందులో ప్రభాస్ పోలీస్ పాత్రలో హల్చల్ చేయనున్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలను యూనిట్ త్వరలోనే ప్రకటించనుంది.























































































































































































































































Review స్పిరిట్’కు అంతా రెడీ!.