‘అవని’ తళుక్కు

మెగాస్టార్‍ చిరంజీవి, దర్శకుడు వశిష్ట కలయికలో రూపొందుతోన్న చిత్రం- ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్‍, వంశీ, ప్రమోద్‍ నిర్మించారు. త్రిష కథానాయిక. మే4న ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి త్రిష లుక్‍ను విడుదల చేశారు. అందులో త్రిష దీపాలతో నిండిన పళ్లెం పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. ఈ చిత్రంలో ఆమె ‘అవని’ అనే పాత్రలో కనిపించనున్నట్టు చిత్ర యూనిట్‍ తెలిపింది. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఈ సోషియో ఫాంటసీ చిత్రం ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత రానుంది. ఇందులో ఆషికా రంగనాథ్‍ మరో హీరోయిన్‍గా చేస్తుండగా, మౌనిరాయ్‍ ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. కునాల్‍ కపూర్‍ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా పాన్‍ ఇండియా స్థాయిలో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, భీమ్స్ ప్రత్యేక గీతానికి స్వరాలు సమకూర్చారు.

Review ‘అవని’ తళుక్కు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top