ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్‍లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం- ఫౌజీ. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇమాన్వి హీరోయిన్. మిథున్ చక్రవర్తి, అనుపమ్‍ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేసేందుకు చిత్రం బృందం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ లిరికల్ గీతానికి సంబంధించిన పనులు మొదలయ్యాయని, ఈ నెలలోనే ఇది బయటకు వచ్చే అవకాశముందని సమాచారం. మరోవైపు ఈ సినిమా 75 శాతానికిపైగా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మరో మూడు యాక్షన్ ఘట్టాలతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించాల్సి ఉందట! 2026 చివరిలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు విశాల్‍చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, సుదీప్ ఛటర్జీ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.






















































































































































































































































Review ‘ఫౌజీ’ తొలి పాట రెడీ!.