మహేశ్‍బాబు-రాజమౌళి కాంబినేషన్‍లో రూపొందుతున్న సినిమాపై సామాజిక మాధ్యమాల్లో అనేక చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కెన్యాలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటోందనేది తాజా ప్రచారం. ఇటీవల కెన్యా దేశపు కేబినెట్ సెక్రటరీని చిత్ర బృందం కలిసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ సినిమాను 120 దేశాల్లో విడుదల చేసే ప్లాన్‍లో చిత్ర బృందం ఉన్నట్టు స్వయంగా కెన్యా కేబినెట్ సెక్రటరీ ముదావాది ప్రకటించడం విశేషం. ఈ నేపథ్యంలో ఆ దేశపు మీడియాలో ఈ సినిమా రెండు భాగాలుగా రానుందనే కథనాలు వచ్చాయి. హాలీవుడ్ సినిమాలు కూడా ఒకేసారి 120 దేశాల్లో విడుదలైన రికార్డు లేదు. అదే జరిగితే మహేశ్‍బాబు సినిమా రికార్డు సృష్టించినట్టే. ప్రస్తుతానికి ఇంకా టైటిల్ పెట్టని ఈ చిత్రం ‘గ్లోబ్ ట్రాటర్’, ‘ఎస్‍ఎస్‍ఎంబీ29’ పేర్లతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నవంబర్‍లో ఈ సినిమా ఫస్ట్లుక్ విడుదల కానుంది.























































































































































































































































Review 120 దేశాల్లో విడుదలకు ప్లాన్.