బొప్పాయి లడ్డు.. ఎంతో బాగుండు

బొప్పాయి లడ్డూలు
కావాల్సినవి: బొప్పాయి: 1 మీడియం సైజ్‍ (బాగా పండినది)
కొబ్బరి తురుము: 2 కప్పులు
పంచదార: 2 టేబుల్‍ స్పూన్స్
పాలపొడి: 3 టేబుల్‍ స్పూన్స్
కొబ్బరిపాలు: 1 టేబుల్‍ స్పూన్‍
ఏలకుల పొడి: అర టీ స్పూన్‍
డైఫ్రూట్స్: అభిరుచిని బట్టి
తయారు చేసే విధానం:
ముందుగా ఒక బౌల్‍ తీసుకుని అందులో బొప్పాయిని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొబ్బరి తురుము, పంచదార, పాలపొడి వేసుకుని బాగా కలుపు కోవాలి. తరువాత కొబ్బరి పాలు, ఏలకుల పొడి వేసుకుని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న లడ్డూలు తయారు చేసు కోవాలి. అభిరుచిని బట్టి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తయారు చేసే ముందే ఆ మిశ్రమంలో కలుపుకోవచ్చు లేదా లడ్డూలు తయారు చేసిన తరువాత వాటిపై పెట్టుకోవచ్చు. అభిరుచిని బట్టి కొద్దిగా కొబ్బరి తురుమును ఒక బౌల్‍ లోకి వేసుకుని, ఆ లడ్డూలను అందులో దొర్లించి సర్వ్ చేసుకుంటే.. తిన డానికి భలేగా ఉంటాయి.
చికెన్‍ కార్న్ ఫ్రిట్టర్స్
కావాల్సినవి:
చికెన్‍: పావు కేజీ (పొడిపొడిగా విడిపోయేంత మెత్తగా ఉడికించుకోవాలి)
మొక్కజొన్న పిండి: అర కప్పు
బియ్యం పిండి: పావు కప్పు
స్వీట్‍ కార్న్: రెండున్నర కప్పులు (ఉడికించుకోవాలి)
చిక్కటి పాలు: అరకప్పు
గుడ్లు: నాలుగు (4)
కొత్తిమీర: 2 రెమ్మలు
నూనె: సరిపడా
తయారు చేసే విధానం:
ముందుగా ఒక బౌల్‍ తీసుకుని అందులో పాలు, మూడు గుడ్లు వేసుకుని బాగా కలుపు కోవాలి. తరువాత అందులో మొక్కజొన్న పిండి, బియ్యం పిండి, ఉడికించిన చికెన్‍ వేసు కుని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో స్వీట్‍కార్న్, ఉప్పు, కొత్తిమీ వేసు కుని బాగా కలుపుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న వడలుగా చేసుకుని ఓవెన్‍లో బేక్‍ చేసు కోవాలి. తరువాత మిగిలిన ఒక్క గుడ్డును ఒక బౌల్‍లో వేసుకుని ఒక్కో వడను అందులో ముంచి, పాన్‍పై నూనె వేసి,
ఆపిల్‍ కొబ్బరి బర్ఫీ
కావాల్సినవి: ఆపిల్స్: 3 (చిన్న చిన్న ముక్కలుగా తరిగి గుజ్జు చేసుకోవాలి)
కొబ్బరి తురుము: ఒకటిన్నర కప్పులు
నెయ్యి: 3 టేబుల్‍ స్పూన్లు
పాల పొడి: 1 కప్పు
పంచదార: ముప్పావు కప్పు
ఏలకుల పొడి: అర టీ స్పూన్‍
కుంకుమ పువ్వు: 4 రేకులు (1 టేబుల్‍ స్పూన్‍ పాలలో కలుపుకోవాలి)
బాదం ముక్కలు: 2 టేబుల్‍ స్పూన్లు
పిస్తా ముక్కలు: 2 టేబుల్‍ స్పూన్లు
ఎండు గులాబీ రేకులు: 1 టేబుల్‍ స్పూన్‍
త•యారు చేసే విధానం: ముందుగా స్టవ్‍ ఆన్‍ చేసుకుని.. పాన్‍లో కొబ్బరి తురుము, పంచదార వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. తరువాత నెయ్యి, ఆపిల్‍ గుజ్జు వేసు కుని కాసేపు గరిటెతో తిప్పాలి. తరువాత పాలపొడి, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు- పాల మిశ్రమం వేసుకుని గరిటతో తిప్పుతూ ఉండాలి. మిశ్రమం మొత్తం దగ్గర పడగానే ఒక ట్రేలోకి తీసుకుని మూడు నాలుగు గంటల పాటు ఫ్రిజ్‍లో పెట్టుకోవాలి. తరు వాత కావాల్సిన షేపులో ముక్కలు కట్‍ చేసు కుని బాదం, పిస్తా, ఎండు గులాబీ రేకులతో

Review బొప్పాయి లడ్డు.. ఎంతో బాగుండు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top