శక్తి కేంద్రాలు

యోగ సాంప్రదాయం ప్రకారం మానవ దేహంలో 114 చక్రాలు ఉన్నాయి. వాటిలో ఏడు చక్రాలు ఎంతో ప్రాధాన్యత కలిగినవి. చక్రాలు అంటే శక్తి కేంద్రాలు. మానవ శరీరంలోపల అదృశ్యంగా ఉండే శక్తి ప్రవాహాలు.

ఈ చక్రాలలో కేంద్రీకరించబడి ఉంటాయి. ఈ ఏడు చక్రాలను సరైన స్థితిలో ఉంచినప్పుడు శరీరం శక్తి ప్రవాహంగా, జీవితం అనా యాసంగా నడిచి పోతున్నట్లు అనుభూతిని పొందుతారు. శరీరంలో ఉండే శక్తిని ‘‘ప్రాణం’’ అని పిలుస్తారు.

ఈ శక్తి శరీరాన్ని క్రియాశీలకంగా, ఉత్సాహంగా, ఆరోగ్యకరంగా, జీవంతో తొణికిస లాడుతూ ఉండేట్లు ఉంచుతుంది.
ఎప్పుడైతే ఏడు చక్రాలు, ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం ద్వారా సరైన స్థితిలో ఉంచబడతాయో, అప్పుడు ప్రాణశక్తి ఈ చక్రాల ద్వారా పైకీ క్రిందకీ ఏ విధమైన అడ్డులేకుండా సునాయాసంగా సంచరించగలుగుతుంది.

1. మూలాధార చక్రం

మూలాధారచక్రం మన వెన్నెముక క్రింద చివర్లో ఉంటుంది. ఈ చక్రం విశ్వంతో మన అనుబంధాన్ని, ఆత్మస్థితిని నిలిపి ఉంచుకోవ టాన్ని సూచిస్తుంది. ఎప్పుడైతే మూలాధారచక్రం యోగక్రియల ద్వారా తెరుచుకుంటుందో అప్పుడు మనం క్షేమంగా, నిర్భయంగా, ఉన్నా మని అనుభూతి చెందుతాం. ఈ చక్రాన్ని ఉత్తే జితం చేసి, తెరుచుకునేట్టు చేయడానికి ‘వీరభద్రా సనం’ అభ్యాసం చేయాలి.

2. స్వాధిష్ఠాన చక్రం

ఈ చక్రం వెన్నెముకపై నడుముకు కొద్దిగా క్రింద భాగంలో ఉంటుంది. ఇది సృజనాత్మ కతకు, సుఖానుభూతికి (శారీరక మరియు మానసిక) కారణమయ్యే చక్రం.
ఈ చక్రం ఎప్పుడైతే తెరుచుకుంటుందో జీవితంలో అభివృద్ధి, కుశలత నిండివున్నట్టుగా అనుభూతి చెందుతాము. ఈ స్వాధిష్ఠానచక్రాన్ని సరైన స్థితిలో ఉంచటానికి, ఉత్తేజితం చేయ టానికి, సూర్యనమస్కారాలు ఎంతో ఉపయో గిస్తాయి.
3.మఱిపూరక చక్రం
ఈ చక్రం నడుము పై భాగంలో వెన్నెముకపై ఉంటుంది. ధృఢ సంకల్పానికి, ఆత్మశక్తికి ఈ చక్రం కారణం. ఇది మన దేహంలో ఉండే సూర్యుడు. ఈ చక్రం ద్వారా ప్రాణశక్తి మన దేహాన్నంతటికీ సరఫరా చేయబడుతుంది.
ఈ చక్రం వికసిస్తే మన ఆత్మశక్తి మీద నమ్మకం ఏర్పడుతుంది. ధనురాసనం, నావాసనం, ఈ రెండూ మన శరీరమధ్య భాగంలో ఉండే మణిపురంలో ఉండే అగ్ని ప్రజ్వలంగా ఉండేట్టు చేస్తాయి.

4. అనాహత చక్రం

ఈ చక్రం వెన్నెముకపై హృదయస్థానంలో ఉంటుంది. మన జీవితంలోని ప్రేమ, కరుణ, ఆనందం, సుఖానుభూతి ఈ చక్రం యొక్క విభూతులే. ఈ హృదయ స్థానంలో ఉండే అనాహతం కింద ఉండే, భౌతిక చక్రాలైన మూలాధార, స్వాధిష్ఠాన మణిపూరాలను పైన వుండే 3 చక్రాలతోను కలుపుతుంది. పై మూడు చక్రాలు ఆత్మస్థితికి సంబంధించినవి.
ఈ చక్రం సరైన స్థితిలో ఉన్నప్పుడు ప్రేమను పంచటానికీ, ప్రేమను అందుకోవటానికీ, మనం సిద్ధంగా ఉంటాం. ఈ చక్రాన్ని ఉత్తేజితం చేయటానికి, సరైనస్థితిలో ఉంచటానికి చమత్కా రాసనం, ఉష్ట్రాసనం అభ్యసించాలి.

5. విశుద్ధి చక్రం

ఈ చక్రం మానవ శరీరంలో కంఠభాగంలో ఉంటుంది. ఆత్మ వ్యక్తీకరణకు ఇతరులతో, సమా చారం ఇచ్చిపుచ్చుకోవటానికీ ఈ చక్రం సరైన స్థితిలో ఉండటం అవసరం.
విశుద్ధి చక్రం తెరుచుకున్నప్పుడు మనం అత్యున్నత సత్యాలను ప్రవచిస్తాం. సర్వాం గాసనం, మత్స్యాసనం అభ్యసించటం ద్వారా ఈ చక్రాన్ని ఉత్తేజితం చేయవచ్చు.

6. ఆజ్ఞా చక్రం

రెండు కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం నిలిచి వుంటుంది. ఈ చక్రం అంత:స్ఫురణకు మన చైతన్యపరిధి విస్తరింటానికి కారణం. ఈ చక్రం సరైన స్థితిలో ఉన్నప్పుడు మనకు సహాయం అవసరమైనప్పుడు మన లోపలినుండే కావాల్సిన మార్గదర్శనం లభిస్తుంది. వృక్షాసనం చేయటం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే, ప్రాణాయామం ద్వారా ఈ చక్రం ఉత్తేజితం అవుతుంది.

7. సహస్రార చక్రం

ఈ చక్రాన్ని బ్రహ్మరంధ్రమని కూడా పిలుస్తారు. ఇది శిరస్సు పైభాగంలో మాడు దగ్గర ఉంటుంది. ఈ చక్రం ఆధ్యాత్మికతను, జ్ఞానోదయాఅందిస్తుంది. అత్యున్నత స్థాయి విజ్ఞానం, విశ్వ రహస్యాలు, భగవత్‍ విషయాలు ఈ చక్రానికి సంబంధించనవి. ఈ చక్రం తెరుచుకున్నప్పుడు ఆత్మబంధనాల నుండి విడివడుతుంది.
మన మెదడులోని రెండు భాగాలను సమత్వస్థితిలో ఉంచటానికీ, ఈ చక్రాన్ని ఉత్తేజితం చేయటానికి నాడీశోధన ప్రాణాయామం, శీర్షాసనం ఉపయోగిస్తాయి.
చక్రాలను ఉత్తేజితం చేసి అవి తెరుచుకునేలా చేయటం, మూలాధారం నుంచి సహస్రారం వరకు జరిగే ఒక అద్భుత యాత్ర. యోగక్రియలు, ఆసనాలు, ఆధ్యాత్మిక అభ్యాసాలు చేయటం ద్వారా మన ప్రాణశక్తిని మూలాధార చక్రం నుంచి ఆజ్ఞాచక్రం వరకు తీసుకువెళ్ళగలుగుతాం. ఆజ్ఞాచక్రం నుండి సహస్రారం వరకు ప్రాణశక్తిని కొనిపోవటం ఎంతో కష్టసాధ్యం. దీనికి సరైన మార్గదర్శకుల సహాయం కావాలి.

మనందరం, యోగసాంప్రదాయకులు చెప్పేలాగా పైకి వెళ్ళి పడటం ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుంది. ఆ శక్తివంతమైన సూక్ష్మవిశ్వంలో మనం, పైకి వెళ్తున్నకొద్దీ విజ్ఞానాన్ని పెంచుకుంటాం. చైతన్యం మరింత విస్త•తం అవుతుంది. చక్రాలను, కమలాలు అని కూడా పిలుస్తారు. కమలములు సూర్యుని యొక్క కిరణాల చేత ఏ విధంగా వికసిస్తాయో, అలాగే ప్రాణశక్తి ప్రవాహాలు, సరైన రీతిలో చక్రాల గుండా స్వేచ్ఛగా ప్రవహించినప్పుడు అవి తెరుచుకుంటాయి.

అలా చక్రాలు తెరుచుకోవటం వల్ల సూచించే విషయాలలో పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది. చక్రాలు తెరుచుకోవటం వల్ల కలిగే లాభాలు ఇవి

ఆద్యాత్మిక, అతీంద్రియ విషయాలలో తెలివి పెరుగుతుంది.
భావోద్వేగాలను, ఆధ్యాత్మిక, మానసిక, శారీరక ఇబ్బందులను స్వయంగా వదిలించుకో గలిగిన శక్తి పెరుగుతుంది.
బలహీన విషయాలను బలంగా మార్చుకో గలుగుతారు.
జీవితం పట్ల మరింత ఇష్టం పెరుగుతుంది.
మనసు పెట్టి పనిచేయగలుగుతారు.
విసుగు కలిగించే లౌకిక విషయాలలో కూడా జీవాన్ని నింపగలుగు తారు.
జీవితంలోని అనిశ్చితిని తేలికగా ఎదుర్కోగలుగుతారు. జీవితంలో కోరుకున్నదాన్ని పొందే శక్తి పెరుగుతుంది.
ముఖ్యంగా డబ్బు విషయాలలో మరింత పద్ధతిగా వ్యవహరించ గలుగుతారు.
ప్రేమను, ఆరోగ్యకరమైన అనుబంధాలను పెంచిపోషిస్తారు.
జీవితంపట్ల ప్రశంసాభావం బాగా పెరుగుతుంది. ఆత్మశక్తిని అవగాహన చేసుకుంటారు.
మీలోని ‘‘అసలు మనిషి’’ని ప్రతిబింబించే నిర్ణయాలు తీసుకుంటారు.
ఆత్మవిశ్వాసం, తనపట్ల తనకు బాగా ఇష్టం పెరుగుతాయి.
క్షమాగుణం పెరుగుతుంది.
స్వయంప్రేరణ ద్వారా కన్న కలలను సాకారం చేసుకుంటారు.
అంత:స్ఫురణ లేదా అంతర్‍దృష్టి పెరుగుతుంది. ఆంతరిక శాంతి ఆనందానుభవాన్ని కలుగచేస్తుంది. ఆత్మబలం పెరుగుతుంది.
మనసు, బుద్ధి రెండూ ప్రశాంతంగా కలసి పనిచేస్తాయి.

ఇద్దరు ప్రయాణించే దేవదూతలు

ఇద్దరు ప్రయాణించే దేవదూతలు రాత్రి ఒక ధనిక కుటుంబంతో గడపడానికి ఆగాయి. ఆ కుటుంబం చాలా అనాగరికంగా ఉంది. దేవదూతలు ఆ రాత్రి వారి అతిథి గృహంలో గడపడానికి వారు అంగీకరించలేదు. చలిగా ఉన్న క్రింది చిన్న గది మాత్రమే యిచ్చారు. దేవదూతలు నేలమీదనే పడుకున్నారు. దేవదూతల్లో పెద్దది అక్కడ ఉన్న గోడలో రంధ్రం కనపడితే దానిని బాగు చేసింది.
‘‘ఎందుకు రంధ్రాన్ని బాగు చేశావు?’’ అని చిన్న దేవదూత అడి గింది. ‘‘మనం అనుకున్నట్లుగా అన్నీ జరుగవు’’ అంది మరునాటి రాత్రి దేవదూతలు బాగా బీదవాని యింటికి వెళ్లాయి ఆ దంపతులు చాలా మర్యాదస్తులు. దేవదూతల్ని గౌరవించి భోజనం పెట్టి, వాటికి పడుకోవడానికి తమ పరుపుల్ని యిచ్చారు.
సూర్యోదయం అయింది. పేద దంపతులు శోకిస్తున్నారు. తమకు పాలు యిచ్చి తమను పోషిస్తూన్న ఒకే ఒక ఆవు చనిపోయింది. చిన్న దేవదూతకి కోపం వచ్చి పెద్ద దానితో ‘‘ఈ సంఘటన ఎలా జరగనిచ్చావు? నిన్నటి వ్యక్తి ధనికుడు. అతనికి అన్నీ ఉన్నాయి. ఇతనికి ఏమీ లేదు. అయినా మనతో అన్నీ పంచుకున్నాడు. నువ్వు అతని ఆవు చనిపోతూ ఉంటే ఊరుకున్నావు’’ అంది.
‘‘మనం అనుకున్నట్లుగా అన్నీ జరుగవు. మనం నిన్న ఆ చలి వేస్తూన్న గదిలో పడుకున్నప్పుడు ఆ గోడకి రంధ్రం ఉంది. ఆ ధనికుడు బంగారాన్ని ఆ రంధ్రంలో దాచాడు. అతడు చాలా పేరాశ గలవాడు. ఎవరికీ బిచ్చం పెట్టేవాడు కాడు. నేను ఆ రంధ్రాన్ని మూసివేశాను. అతనికి దాచుకున్న బంగారం దొరకదు. రాత్రి మనం యితని ఇంట్లో పడుకున్నాం. మృత్యుదేవత యితని భార్యని తీసుకుని పోవడానికి వచ్చింది. ఆమెకు బదులు మృత్యుదేవతకి నేను ఆవుని యిచ్చేశాను. కాబట్టి తెలిసిందా? మనం అనుకున్నట్లు ఏవీ జరుగవు. ఏది జరిగినా, దానికి ఏదో కారణం ఉంటుందని నువ్వు నమ్మాలి. నీకు యివి యిప్పుడే తెలియవు. కొంత కాలానికి తెలుస్తాయిలే’’ అంది పెద్ద దేవదూత.

Review శక్తి కేంద్రాలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top