‘అర్జున్‌రెడ్డి’ విజయంతో యువ హీరో విజయ్ దేవరకొండ యమా జోష్ మీద ఉన్నాడు. ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్‌రెడ్డి’ వంటి వెరైటీ కథాంశాలతో వరుస విజయాలు అందుకున్న విజయ్.. ఇప్పుడు చేతినిండా ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఇప్పటికే నాలుగు సినిమాలు విజయ్ ఖాతాలో ఉన్నాయి. ఇవి కాక చర్చల దశలో మరికొన్ని ఉన్నాయి. తాజాగా, విజయ్ దేవరకొండకు శేఖర్ కమ్ముల ఓ కథన వినిపించారట. ఇటీవల ‘ఫిదా’తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల వినిపించిన తాజా కథ విజయ్‌కు బాగా నచ్చేసిందట. అన్నీ కుదిరితే విజయ్ ఈ సినిమాను సొంతంగా నిర్మించే ఆలోచనలో ఉన్నాడట. శేఖర్ కమ్ముల అప్పుడెప్పుడో తీసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాలో హీరో గ్యాంగ్‌లో ఒకడిగా విజయ్ దేవరకొండ చిన్న పాత్ర వేశాడు. ఇప్పుడు తానే ప్రధాన పాత్రధారిగా శేఖర్ దర్శకత్వంలో నటించ నుండటం విశేషమే కదా!
అర్జున్‌రెడ్డి ‘ఫిదా’

Review అర్జున్‌రెడ్డి ‘ఫిదా’.