స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఇండస్ట్రీలో పదహారు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. వాటిలో కొన్ని అల్లు అర్జున్ మాటల్లోనే..
నన్ను నేను నిరంతరం గూగుల్‍లో వెతుక్కుంటున్నాను. గత సినిమాలు ఎలా చేశాను? నా లుక్స్ ఎలా ఉన్నాయి? వచ్చే సినిమాల్లో ఎలా ఉండా లనేది దీనిని బట్టి అంచనా వస్తుంది.
చేసే ప్రతి సినిమాకు ఎంతో కొంత ప్రత్యేకత ఉండాల్సిందే.
ఇకపై ఇతర భాషల్లో కూడా సినిమాలు చేయాలని నిర్ణయించు కున్నాను. ముఖ్యంగా బాలీవుడ్‍లో చేయాలనేది ఆశ.
సినిమా ఇండస్ట్రీలో బంధుప్రీతి లేదని చెప్పను. కానీ, ఎంతటి బంధుత్వంఉన్నా.. ఇండస్ట్రీలో మనల్ని నిలబెట్టేది మాత్రం ప్రతిభే. అది లేనప్పుడు ఎంతటి బలమైన బంధుత్వమైనా మనల్ని నిలబెట్ట లేదు.
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్, వేణు శ్రీరామ్ దర్శకత్వాల్లో వరుసగా సినిమాలు చేస్తున్నాను. మూడూ క్రేజీ ప్రాజెక్టులే..
Review నన్ను నేను గూగుల్‍లో వెతుక్కుంటున్నా..