హాలీవుడ్‍ డైరెక్టర్‍ చేతిలో ‘భక్తకన్నప్ప’

మంచు విష్ణు ‘భక్తకన్నప్ప’గా కనిపించ నున్నాడు. ఈ సినిమాకు సంబంధించి డ్రాఫ్ట్ స్క్రిప్ట్ మొత్తం సిద్ధమైంది. తనికెళ్ల భరణి దీనికి వెర్షన్‍ రాశారు. దానిని మంచు విష్ణు, హాలీవుడ్‍ రైటర్‍ కలిపి ఓ వెర్షన్‍ తయారు చేశారు. ఈ సినిమా కోసం బుర్రా సాయిమాధవ్‍ సంభాష ణలు రాస్తున్నారు. ఈ సినిమా నిర్మాణానికి డెబ్బయి నుంచి ఎనభై కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ సంవత్సరం చివరి నాటికి సినిమాకు క్లాప్‍ కొట్టనున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‍లో విశేషం ఏమిటంటే.. భక్తకన్నప్ప వంటి అచ్చ తెనుగు కథతో కూడిన సినిమాకు హాలీవుడ్‍ డైరెక్టర్‍ దర్శకత్వం వహించ నున్నారు. ఆయన ఎవరనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Review హాలీవుడ్‍ డైరెక్టర్‍ చేతిలో ‘భక్తకన్నప్ప’.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top