చరణ్‍-సుక్కు మళ్లీ జట్టు

మెగా పవర్‍స్టార్‍ రామ్‍చరణ్‍ ‘పెద్ది’ దాదాపు పూర్తి కావచ్చింది. జూన్‍ 4 విడుదల తేదీ. దీంతో అందరి చూపు రామ్‍చరణ్‍ తరువాత చిత్రంపై పడింది. ‘ఆర్‍సీ17’ వర్కింగ్‍ టైటిల్‍తో సెట్స్పైకి వెళ్లనున్న ఈ సినిమాకు సుకుమార్‍ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్ పనులు కొలిక్కి వచ్చాయని.. సుకుమార్‍ దీనికి తుది మెరుగులు దిద్దుతున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన ఆసక్తికరమైన కబురు బయటికొచ్చింది. ఈ కొత్త చిత్రాన్ని జూలైలో పట్టాలెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని నిర్మాతల్లో ఒకరైన చెర్రీ వెల్లడించారు. ‘రంగస్థలం’ విజయం తరువాత రామ్‍చరణ్‍-సుకుమార్‍ (సుక్కు) కాంబినేషన్‍లో రానున్న రెండో చిత్రం కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. పైగా ‘పుష్ప’ తరువాత సుకుమార్‍ నుంచి రానున్న చిత్రం కావడంతో మరింత క్రేజీ ప్రాజెక్టుగా మారింది. దీనికి తగ్గట్టుగానే ఈసారి సుకుమార్‍ తనదైన శైలిలో మరో శక్తిమంతమైన మాస్‍ యాక్షన్‍ కథను సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.

Review చరణ్‍-సుక్కు మళ్లీ జట్టు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top