వక్రతుండం ఓంకార ప్రతీక.
లంబోదరం బ్రహ్మాండ సూచిక.
గణపతి ఓంకార స్వరూపుడు.
సర్వగణములకు అధిపతి.
అందుకే ఆయనకు వినాయకుడనే పేరొచ్చింది.
కార్యసిద్ధి, అందుకు అనువైన బుద్ధి గణేశుని అధీనం.
కనుకనే ఆయన సిద్ధిబుద్ధి ప్రియుడు.
ఆయనకు వేరే నాయకుడు లేడు. కాబట్టి ఆయన వినాయకుడు.
త్రిమూర్తులను నడిపించే నాయకుడు కనుక విశిష్ట నాయకుడు.
గణపతి సగుణ, నిర్గుణ స్వరూపతత్త్వం.
త్రిమూర్తుల పూజలు కూడా అందుకునే దైవం.
అందుకే ఆయన ఆది దేవుడు.
గణపతిని సదాచారులు లక్ష్మీగణపతిగా, వైష్ణవులు విష్వక్సేనునిగా, వామాచారులు ఉచ్ఛిష్ఠ గణపతిగా, బౌద్ధులు గజాననునిగా భావించి పూజిస్తారు.
ఎవరెలా పూజించినా ఆయన సర్వలోకానికీ రక్షకుడు.
సర్వులకూ వినాయకుడు.
పూజల్లో అగ్రతాంబూలం విఘ్నేశ్వరుడిదే.
ఈయన అనుగ్రహం లభించిన తరువాతే ఇతర దేవతారాధన చేస్తారు.
గణపతి ఏకదంతం, వక్రతుండం, గజముఖం, చతుర్భుజాలతో, పాశాంకుశ, అభయ, వరదముద్రలు దాల్చి, వేలుబొజ్జ కలిగి, చేటల వంటి చెవులతో ప్రకాశిస్తాడు.
శ్వేతవస్త్రం ధరించి, రక్తచందన లేపన దేహంతో ఎర్రని పువ్వులతో పూజలందుకునే లంబోదరుడు, విఘ్న వినాయకుడు, సర్వజగత్కారణుడు గణపతి అని ఉపనిషత్తులు స్తుతిస్తున్నాయి.
అధర్వణ వేదంలోని గణపత్యుపనిషత్తు గణపతి తత్త్వాన్ని గురించి చెబుతూ- ‘‘గణపతి వాజ్ఞ్మయ స్వరూపుడు. చిన్మయుడు. సచ్చిదానందమూర్తి. జ్ఞానవిజ్ఞానమయుడు. విశ్వసృష్టి, స్థితిలయములకు కారకుడు. పంచమహాభూతాది స్వరూపునిగా, పరోపశ్యంతి, మధ్యమ, వైఖరి అనే చతుర్విధ వాగ్రూపుడు. త్రిగుణాతీతుడు. నిత్య, జ్ఞాన, క్రియా, శక్తి స్వరూపుడు.
మూలాధారంలో సర్వదా ప్రకాశించే వాడు’ అని అత్యద్భుతంగా వర్ణించింది.
గణపతిని ఎందరో ఎన్నో విధాలుగా కీర్తించారు.
ఆయా ప్రఖ్యాత శ్లోకాలను, వాటి అర్థ తాత్పర్యాలను మననం చేసుకుంటే గణేశతత్త్వం అవగతమవుతుంది.
దేవతా సమూహంలో విలక్షణ దైవం గణేశుడు.
స్వామి బుద్ధి కౌశలానికి బ్రహ్మాదులూ జేజేలు పలుకుతారు.
అందుకే ఆయనను ఇలా స్తుతిస్తారని రుగ్వేదం చెబుతోంది.
న రుతే త్వం క్రియతే కిం చనారే
ఓ గణేశా! నీవు లేక ఏ కార్యమూ ప్రారంభం కాదు.
గణేశ పురాణంలో వినాయకుని పూజాధిపత్యం గురించి అద్భుతంగా వర్ణించారు.
ఓంకార రూపీ భగవాన్ యో దేదాదౌ ప్రతిష్టిత: ।
యంసదా మునయోదేవా: స్మరంతీందిద్రాదయో హృది ।।
ఓంకార రూపీ భగవానుక్తరస్తు గణనాయక: ।
యథా సర్వేషు కార్యేషు పూజ్యతేసౌ వినాయక: ।।
ఓంకార స్వరూపుడైన భగవంతుడు వేదాల ప్రారంభంలో ప్రతిష్ఠితమైన వాడు. సర్వదా మునుల, ఇంద్రాది దేవతల హృదయంలో స్మరింపబడే దైవం, ఓంకార రూపుడైన గణనాయకునిగా స్మరింపబడే దైవం వినాయకుడు సమస్త కార్యాల ప్రారంభంలో పూజలందుకుంటాడు.
అందుకే వినాయకుడిని గోస్వామి తులసీదాసు ఇలా ప్రార్థిస్తారు-
ఓం సుమిరత సిధి హూఈ
గన నాయక కరిబర బదన ।
కరఉ అనుగ్రహ సోఇ
బుద్ధి రాసి సుభ గున సదన ।।
పరమశివుని ప్రమథ గణాలకు అధిపతి అయిన గజాననుడు తనను స్మరించిన వారికి కార్యసిద్ధిని ప్రసాదిస్తాడు.
ఆయన విజ్ఞానగని.
బుద్ధి ప్రదాత. సుగుణాల రాశి.
అట్టి శ్రీ వినాయకుడు సర్వులనూ అనుగ్రహించు గాక!.
గణపతి తత్త్వం అంత సులభంగా బోధపడదు.
ఆయన రూపాల మాదిరిగానే గుణాలు, గణాలు కూడా
వేనవేలు.
విఘ్నేశ్వురుని ప్రధానంగా ద్వాదశ నామాలతో పూజిస్తారు.
ఆ శ్లోకమిది..
వినాయకో విఘ్నరాజో
దైమాతుర గణాధిప
అప్యేవదంతో హేరంబో
లంబోదర గజాననా
వినాయకుడు, విఘ్నరాజు, ద్వైమాతురుడు, గణాధిపతి, ఏకదంతుడు, హేరంబుడు, లంబోదరుడు, వ్రాతపతి,
శ్రీ విఘ్నేశ్వర ధ్యానం
ఓంకార రూపం త్య్రహమితి చపరం యత్స్వరూపంతురీయం ।।
త్రైగుణ్యాతీత నీలం కలయతిమనస స్తేజసిస్థూర మూర్తిమ్ ।।
యోగీన్ద్రా బ్రహ్మరన్ద్రే సకల గుణమయం శ్రీహరేన్ద్రేణ సంగం ।।
గం గంగంగం గణేశంజముఖమభితో వ్యాపకం చిన్తీయన్తి ।।
ఓంకార స్వరూపుడు, ప్రణవ స్వరూపుడు, త్రిగుణాత్మకమైన ఈ అఖిలాండకోటి బ్రహ్మాండమైన ప్రకృతికి పరమైన వాడు, జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే అవస్థలను దాటిన తురీయరూపుడు, మనసును దేదీప్యమానంగా ప్రకాశింపచేసేవాడు, తేజ స్వరూపుడు, సింధూర వర్ణకాంతి గలవాడు, సకల గుణ గణాలు కలిగిన వాడు, గజముఖం గలవాడు, సర్వవ్యాపి అయిన గణపతిని ఏ యోగీంద్రులు సహస్రార కమలమునందు ధ్యానించెదరో అట్టి విఘ్నేశ్వరుడిని ధ్యానించెదను.
గణపతిని పూజిస్తే సమస్త విఘ్నాలు హరిస్తాయని చెబుతోన్న ‘గణపతి అథర్వశీర్షోపనిషత్తు’లో ఆయనను త్రిమూర్తి
స్వరూపంగా వర్ణించారు.
మహా విఘ్నాత్ ప్రముచ్యతే మహా దోషాత్ ప్రముచ్యతే
వినాయకుడిని పూజిస్తే మహా విఘ్నాలన్నీ తొలగిపోతాయి. మహా దోషాలన్నీ అంతమైపోతాయి.
మానవులే కాదు.. ్ర•హ్మాది దేవతలు తమ పనులు నిర్విఘ్నంగా పూర్తయ్యేందుకు గజవదనుడిని భజిస్తారని కింది శ్లోకం చెబుతోంది.
వాగీశాద్యా స్సుమనస: సర్వార్థానా ముపక్రమే ।
య: నత్వా కృతకృత్యా: స్యుస్తం నమామి గజాననమ్ ।
ప్రమదపతి, విఘ్ననాశి, శివసుతుడు, వరదమూర్తి.. ఇవి వినాయకుని ద్వాదశ (12- పన్నెండు) నామాలు.
వినాయక నామాల్లో ఏకదంతుడు అనేది ఒకటి. ఏకదంత నామంలో ఉండే మరో అంతరార్థాన్ని తెలిపే శ్లోకం ఇది..
ఏకశబ్దాత్మికా మయాతస్య: సర్వం సముద్భవం
భ్రాతి మోహదం పూర్ణం నానా ఖేలాత్మికం కిల
ఏక అంటే మాయ.
దంత అంటే నిజంగా ఉండేది.
సత్తాధారుడిగా, చాలకుడిగా గణపతి ఈ ప్రపంచాన్ని నడుపుతూ ఆనందిస్తుంటాడు.
మాయతో ప్రపంచాన్ని నడిపేవాడు చాలకుడు.
కృష్ణుడికి అష్టమి, రాముడికి నవమి, దుర్గాదేవికి దశమి.. ఇలా ఒక్కో దేవతకు ఒక్కో తిథి ప్రత్యేకం.
ఈ కోవలో వినాయకుడికి చవితి అత్యంత ప్రీతిపాత్రమైనది.
భాద్రపద శుక్ల చవితి నాడు మధ్యాహ్నం వినాయకుడు జన్మించాడు.
ఈ చవితి ఆదివారం కానీ, మంగళవారం కానీ వస్తే ఇంకా ప్రశస్తం.
గణపతికి చవితి అంటే ఎంత ఇష్టమో వరాహ పురాణంలో వివరించారు.
అందులో సలక దేవతలూ గణపతికి కింది విధంగా స్తుతిస్తారట.
నమోస్తుతే విఘ్నకర్త్రే
నమస్తే సర్పమేఖల
నమస్తే రుద్రవక్త్రోత్థ
ప్రలమ్బజఠరాశ్రిత
అంటే- ‘శివుడి ముఖం నుంచి వినాయకుడు పుట్టాడు. అలాంటి గజనాయకుడిని చవితి నాడే పూజించాలి’ అని పై శ్లోకానికి అర్థం.
మన కవుల భావుక వర్ణనల్లోనూ గణపతి గుణ, గణ, రూప లక్షణాలు అందంగా ఒదిగిపోయాయి.
అల్లసాని పెద్దన తన అభీష్టాలు సిద్ధింపచేసుకునేందుకు కొంచెం చతురతతో గణపతిని స్తుతించిన తీరు హృదయంగమైనది.
అంకము జేరి శైల తనయాస్తనద్గుము
లానువేళబాల్యాంకవి చేష్ట దొండమున నవ్వలిచన్
గబళింపబోయి, యా వంకకు చంబుగానకహి వల్లభహారము గాంచి వేమృణా ళాంకురశంకనంటెడు
గజాస్యుని గోల్తున భీష్ట సిద్ధికిన్
‘పరమశివుని అర్ధనారీశ్వర తత్త్వంలోని ఎడమ వైపున ఉన్న పార్వతిదేవి వద్ద గణపతి పాలును తాగుతున్నాడు. అలా తల్లి నుంచి ఒకపక్క చనుబాలు తాగుతూనే రెండో పక్క నుంచి (పిల్లలు ఒక చనుబాలు నుంచి పాలు తాగుతూ రెండో చనుబాలును చేతితో స్ప•శిస్తుంటారు. వినాయకుడూ అలాగే చేశాడని భావం) పాలు కుడిచేందుకు తన తొండాన్ని చాచాడు. ఆ వైపు స్తన్యము ఎంతకీ దొరకలేదు సరికదా, సర్పహారాలు కనిపించాయి. వాటిని లేత తామరతూడులనుకుని తొందరగా పట్టుకోబోయాడు. అలాంటి విఘ్నేశ్వరుడిని నేను నా కోరికలు సిద్ధించేందుకు సేవిస్తాను’ అని అల్లసాని వర్ణించాడు.
మహా కవయిత్రి మొల్ల శబ్దాలంకార మండితంగా గణపతి రూపాన్ని వర్ణించిన తీరు మహాద్భుతం.
చంద్రఖండకలాపు, జారువామనరూపు
గలితచంచల కర్ణుగమల వర్ణు
మోదకోజ్జ్వల బాహు, మూషకోత్తమవాహు
భద్రేభవదను, సద్భక్తసదను
సన్మునిస్తుతిపాత్రు, శైలసంభవపుత్రు
ననుదినామోదు విద్యాప్రసాదు
పరమదయాభ్యాస, బాశాంకుశోల్లాసు మరుతరఖ్యాతు, నాగోపవీతు
లోకవందిత గుణవంతు, నేకదంతు
సతుల హేరంబు, సత్కరుణావలంబు
విమల రవికోటి తేజు, శ్రీవిఘ్నరాజు
బ్రధిత వాక్ప్రౌడి సేవించి ప్రస్తుతించు ।।
(చంద్రరేఖ అలంకారంగా గలవాడు, అందమైన గుజ్జురూపం, కదిలే చెవులు, చేతిలో ఉండ్రాళ్లు కలవాడు, మూషికవాహనుడు, గజముఖుడు, సద్భక్తుల యెడ నిలిచేవాడు, పరమ మునుల స్తుతి అందుకునే వాడు, పార్వతీపుత్రుడు, విద్యలిచ్చే వాడు, అనుదినానందకరుడు, దయామయుడు, పాశాంకుశాలను ధరించి, నాగయజ్ఞోపవీతధారియై లోకాల మొక్కులు పొందే గుణవంతుడు, ఏకదంతుడు, కరుణామయుడు, కోటిసూర్య తేజుడు హేరంబుడు అయిన శ్రీవిఘ్నరాజును స్తుతిస్తాను అని పై పద్యానికి
హృద్యమైన భావం).
ఇక తెలుగిళ్లలో శ్రావ్యంగా వినిపించే పోతన గారి వినాయక స్తుతి ఇది. పఠించగానే భక్తి భావాన్ని కలిగిస్తుంది.
ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతాహృదయానురాగ సం
పాదికి దోషభేదికి బ్రసన్న వినోదికి విఘ్నవల్లికావి
చ్ఛేదికి మంజువాదికి గణేశ జగజ్జన నందవేదికిన్
మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్
పార్వతి హృదయానురాగాన్ని పొందిన వాడు, విఘ్నాలు పోగొట్టి, జగజ్జనుల మొక్కుగొని ఆనందాన్నిచ్చే వాడు, మూషికవాహనుడు, ఉండ్రాళ్లు తినేవాడు అయిన విఘ్న వినాయకుడికి నమస్కారం అని పై
పద్యానికి అర్థం.
శివకవులలో అగ్రగణ్యుడు నన్నెచోడుడు. కుమార సంభవంలో ఆయన వినాయకుడి ఏనుగు లక్షణాలను వర్షాకాలంతో పోల్చి వర్ణించిన తీరిదీ..
తను వసితాంబుదంబు, సితదంత యుగంబచిరాంశు,
లాత్మగర్జనమురు గర్జనంబు, గరసద్రుచిశక్రశరాసనంబునై ।
చనమదవారి వృష్టిహితసస్య సమృద్ధిగ నభ్రవేళనా
జను గణనాథు గోల్తుననిశంబునభీష్ట ఫలప్రదాతగాన్ ।।
‘నీలమేఘమే విఘ్నేశ్వరుని తనువు. మెరుపే తెల్లని దంతపు కోన. ఉరుమే గర్జన. ఇంద్రధనుస్సే తొండము కాంతి. వర్షాకాలం సస్య సమృద్ధిని కలిగించినట్టు గజముఖుడు మదజలమనే వర్షంతో భక్తులకు హితాన్ని కలిగిస్తాడు. అట్టి గణపతి నా అభీష్టాలను నెరవేర్చాలి’ అని భావం.
గణపతి మూల మంత్రమిది.
సర్వకార్యసిద్ధికి ఈ మంత్రజపం ఉపకరిస్తుంది.
ఓం గం గణపతయే నమ:
‘గణేశ’ శబ్దం వ్యుత్పత్తి ఇది..
గణానాం జీవజాతానం య:
యీశ: స్వామి స: గణేశ: ।
సమస్త జీవజాతికి ఈశుడు- స్వామి. అధిపతి గణేశుడు. ఆయనను పూజించడం వల్ల సమస్త విఘ్నాలు తొలగుతాయి అని అర్థం.
గణపతి వాహనం మూషికం. ఆయనకు అది ఎలా సమకూరిందో బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది.
వసుంధరా దదౌ తస్యై వాహనాయ చ మూషికమ్
అంటే- గణేశునికి మూషిక వాహనం వసుంధర (భూమి) నుంచి లభించింది అని అర్థం
గణేశ పంచాయతన పూజ
విఘ్నేశ్వర పూజల్లో అష్ట గణపతులు, షోడశ గణపతులు, 32 గణపతుల పూజలు ప్రాశస్త్యమైనవి. ఇవిగాక శ్రీ గణపతి పంచాయతన పూజ మరీ ప్రసిద్ధం. ఆదిశంకరాచార్యులు తంత్రశాస్త్రంలోని పంచపూజలను చక్కదిద్ది సామాన్యుల కోసం పంచాయతన పూజాతత్త్వాన్ని వాడుకలోకి తెచ్చారు. సృష్టికి మూల కారణాలైన పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనసుతో కలిపి మొత్తం 21 తత్త్వాలవుతాయి. ఈ తత్త్వాలకు సూర్యుడు, అంబిక, విష్ణువు, గణపతి, శివుడు పంచమూర్తులు. సృష్టికి అధి దేవతలైన ఈ ఐదుగురిని ఉపాసించడమే పంచాయతన పూజ. దీనికి రూపకల్పన చేసిన ఘనత ఆదిశంకరులదే.
పంచాయతన పూజలోని ఒక శ్లోకమిది..
దేవీ విష్ణుశ్చ సూర్యశ్చ గణేశశ్చ సదాశివి ।।
ఆరోగ్యాయచ భోగాయ నిర్విఘ్నాయ స్వకర్మాణామ్ ।।
తత్త్వజ్ఞానాయ మోక్షాయ పంచదేవాన్ ప్రపూజయేత్ ।।
కార్యములన్నీ నిర్విఘ్నంగా కొనసాగడానికి గణపతిని, ఆరోగ్యప్రాప్తికి సూర్యుడిని, సకలైశ్వర్య ప్రాప్తికి దేవిని, ఆత్మజ్ఞానానికి పరమశివుడిని, మోక్షం పొందడానికి విష్ణువును నిత్యం మానవులు పూజించాలి. హైందవ ధర్మంలో పంచాయతన పూజ విశేష వ్యాప్తిలో ఉంది
ఏకదంతం చతుర్బాహుం
గజవక్త్రం మహోదరమ్
యాజ్ఞవల్క్యస్మ•తిలో గణపతి శ్రేష్ఠతను ఇలా చెప్పారు..
ఏవం వినాయకం పూజ్యం
గ్రహాం శ్చైవ విధానత: ।
కర్మాణాం ఫలమాప్నోతి
శ్రియంచాప్యోత్స నుత్తమం ।।
ఫలమును ఆశ్రయించే వాడు విద్యుక్తంగా గణపతిని షోడశోపచారాలతో పూజించాలి. ఆ తరువాత నవగ్రహ పూజ నిర్వర్తించాలి.
ఒకసారి మదనుడనే రాక్షసుడు తపస్సు చేసి శివుడి ద్వారా వరాలు పొంది అపార శక్తిసామర్థ్యాలు పొందాడు. ఆ గర్వంతో దేవతలపై దండెత్తాడు. ఇంద్రుడిని తరిమికొట్టి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. దేవతలంతా చింతాక్రాంతులై సనత్కుమారుడిని ఆశ్రయించారు. రాక్షస సంహారం, ధర్మసంస్థాపన కోసం దేవతలకు సనత్కుమారుడు ఏకదంతుడిని ఉపాసించాలని చెబుతూ ఈ కింది శ్లోకాన్ని బోధించాడు.
ఏకదంతం చతుర్బాహుం
గజవక్త్రం మహోదరమ్ ।
సిద్ధి బుద్ధి సమాయుక్తం
మూషకారూఢమేవ చ ।।
నాభిశేషం సపాశం వై
పరశుం కమలం శుభమ్ ।
అభయం దధతం చైవ
ప్రసన్న వదనాంబుజుమ్ ।।
భక్తేభ్యో వరదం
నిత్యమభక్తానాం నిషైదనమ్ ।।
భావం: ఏకదంతం, చతుర్భుజాలు కలిగి, గజముఖంతో లంబోదరుడై, సిద్ధిబుద్ధి సహితుడై, మూషిక వాహనం కలిగి, నాభియందు ఆదిశేషుని ధరించి, చేతులలో పరశువు, పాశం, మనోహరమైన కమలం, అభయముద్ర ధరించి, ప్రసన్న వదనంతో భక్తులకు వరదాయకుడై, భక్తిహీనులను పరిమార్చే గజాననుడికి నమస్కారం.
దేవతలు పై స్తుతితో వినాయకుడిని పూజించి, రాక్షసులపై ఘన విజయం సాధించారట.
సమస్త లోక శంకరం ।
ముదాకరం యశస్కరం ।।
శ్రీ మహాగణేశ పంచరత్నంలోని శ్లోకాలు మహా శక్తివంతమైనవి. మహిమాన్వితమైనవి. వీటిని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు విరచించారు. ఆ ఐదు శ్లోకాలు, వాటికి గల భావం తెలుసుకుందాం..
ముదాకరాత్త మోదకం సదావిముక్తి సాధకం ।
కలాధరా వతంసకం విలాసి లోకరక్షకం ।।
అనాయకైక నాయక విశాశితే భదైత్యకం ।
నతా శుభా శునాశకం నమామి తం వినాయకమ్ ।।
ఆనందంతో భక్తులు సమర్పించిన మోదకాలను స్వీకరించి, భక్తులను మోక్షాన్ని ప్రసాదించి, చంద్రుడిని శిరోభూషణంగా ధరించి, లోకాలను సదా రక్షిస్తూ, నాయకుడు లేని వారికి నాయకుడై, రాక్షసులను సంహరించి, భక్తుల అశుభములను నాశనమొనరించే వినాయకుడికి సదా నమస్కరిస్తున్నాను.
నతేతరా తిభీకరం నవోదితార్క భాస్వరం –
సమత్సురారి నిర్జరం నతాధికా పదుద్ధరం ।।
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం ।
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ ।।
ఆ పరమేశ్వరుడికి నమస్కరించని వారికి అతి భయంకరమైన వాడు, అప్పుడే ఉదయించిన బాలసూర్యుని వలే ప్రకాశించే వాడు, వినయ విధేయతలతో, భక్తితో తనను ఆశ్రయించిన వారెవరైనా సరే.. వారిని ఆపదల నుంచి కాపాడు వాడైన ఆ దేవదేవుడైన సురేశ్వరుడికి, సకల సంపదలకు, నిధులకు అధిపతి అయిన నిధీశ్వరుడికి, ఈశ్వరునిచే గజముఖం కలిగిన వాడైన గజేశ్వరుడికి, సకల భూతగణాలకు అధిపతి అయిన గణేశ్వరుడికి, ఈశ్వరునికే ఈశ్వరుడైన ఆ మహేశ్వరుడికి, సకల వేదాంత శాస్త్రానుభవంతో బ్రహ్మజ్ఞానులందరూ ఏ గణపతిని బ్రహ్మ అనీ, పరబ్రహ్మ అనీ, చరాచర స్వరూపమనీ, పురుషతత్త్వమనీ, సృష్టికర్త అనీ, పరమేశ్వరుడనీ, పరాత్పరుడనీ కొనియాడుతున్నారో ఆ మహా గణపతిని హృదయపూర్వకంగా పూజించుచున్నాను.
సమస్త లోక శంకరం నిరస్త దైత్యకుంజరం ।
దరేతరోదరం వరం వరే భవక్త్ర మక్షరం ।।
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం ।
మనస్కరం నమస్క•తాం నమస్కరోమి భాస్వరమ్ ।।
సమస్త లోకాలకు సుఖాలను కలిగించే వాడు, ఏనుగుల వంటి రాక్షసుల్ని హతమార్చిన వాడు, సకల ప్రాణులు, అండపిండ బ్రహ్మాండాలన్నీ లయం చెందిన పెద్ద పొట్ట గలవాడు, పరబ్రహ్మ స్వరూపుడు, ఓంకార స్వరూపుడు, దయ కలిగిన వాడు, క్షమాగుణం కలిగిన వాడు, సంతోషాన్ని ఇచ్చేవాడు, కీర్తిని కలిగించే వాడు, నమస్కరించే వారికి మంచి మనసును ప్రసాదించే వాడు, సమస్త లోకాలకు, జీవులకు ప్రకాశవంతుడైన ఆ మహాగణపతి దేవునికి ఎల్లవేళలా నమస్కరించెదను.
అకించ నార్తిమార్జనం చిరంత నోక్తి భాజనం ।
పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ।।
ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణం ।
కపోల దాన వారణం భజే పురాణ వారణమ్ ।।
నిరుపేదల దారిద్య్ర బాధలను తొలగించేది (జ్ఞానశూన్యుని అజ్ఞానాన్ని పోగొట్టేది), బహుకాలంగా ఉన్న వేదవేదాంగాలకు పాత్రమైనదీ, ముక్కంటీశ్వరుని జ్యేష్ఠ కుమారుడు, దేవతలకు విరోధులైన రాక్షసుల గర్వాన్ని నమిలివేయునది, ప్రపంచం యొక్క ప్రళయ కాల నాశనము నందు భయంకరమైనట్టిది, అగ్ని, ఇంద్రుడు ఇత్యాది దేవతలకు శిరోభూషణం వంటిది, బుగ్గలలో మదోదకం ఉవ్విళ్లూరుచున్నట్టి అనిదియైన గజమును అనగా, విఘ్నేశ్వరుడిని సేవించుకొనుచున్నాను.
నింతాంతకాంత దంతకాంతి మంతకాంతాకాత్మజం ।
అచింత్యరూప మంతహీన మంతరాయ కృంతనం ।।
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం ।
తమేకదంత మేవతం విచింతయామి సంతతమ్ ।।
అధికమైన, కాంతివంతమైన దంతములు కలవాడు, ఆ పరమేశ్వరుడి కుమారుడైన సకల విఘ్నాలను నిర్విఘ్నంగా త్రుంచివేసే వాడు, చింతించడానికి వీలుకాని దివ్య మనోహర రూపంతో, తనను పూజించే భక్తుల హృదయ మధ్యంలో నివసించే సమస్త లోకపాలకుడైన ఆ ఏకదంతుడిని, సర్వకాల సర్వావస్థలా సదా నా హృదయ పద్మంలో నిలిపి ధ్యానించెదను.
గణపతి ఉపాసన..
విజయానికి సాధన
గణపతి సగుణ, నిర్గుణ స్వరూపతత్త్వం. త్రిమూర్తుల పూజలు కూడా అందుకొనే దైవం. అందుకే ఆయనను ఆది దేవునిగా పరిగణిస్తారు. పూజల్లో అగ్రతాంబూలం విఘ్నేశ్వరునిదే. ఈయన అనుగ్రహం లభించిన తరువాతే ఇతర దేవతారాధన చేస్తారు. గణపతి ఓంకార స్వరూపుడు. సర్వగణములకు అధిపతి. అందుకే ఆయనకు వినాయకుడని పేరు. అధర్వణ వేదంలోని గణపత్యుపనిషత్తు గణపతి తత్త్వాన్ని ఇలా బోధిస్తోంది. ‘‘గణపతి వాజ్ఞ్మయ స్వరూపుడు. చిన్మయుడు. సచ్చిదానందమూర్తి. జ్ఞానవిజ్ఞానమయుడు. విశ్వసృష్టి, స్థితి లయములకు కారకుడు. పంచమహాభూతాది స్వరూపునిగా, పరోపశ్యంతి, మధ్యమ, వైఖరి అనే చతుర్విధ వాగ్రూపుడు. త్రిగుణాతీతుడు. నిత్య, జ్ఞాన, క్రియా, శక్తి స్వరూపుడు. మూలాధారంలో సర్వదా ప్రకాశించేవాడు’’.
గణపతి ఏకదంతం, వక్రతుండం, గజముఖం, చతుర్భుజాలతో, పాశాంకుశ, అభయ, వరద ముద్రలు దాల్చి, వేలు••జ్జ కలిగి, చేటల వంటి చెవులతో ప్రకాశిస్తాడు. శ్వేతవస్త్రం ధరించి, రక్తచందన లేపన దేహంతో ఎర్రని పువ్వులతో పూజలందుకునే లంబోదరుడు, విఘ్నవినాయకుడు, సర్వజగత్కారణుడు గణపతి అని ఉపనిషత్తు స్తుతిస్తోంది. కార్యసిద్ధి, అందుకు అనువైన బుద్ధి గణేశుని ఆధీనం. కనుక ఆయన సిద్ధిబుద్ధి ప్రియుడు. ఆయనకు వేరే నాయకుడు లేడు. కాబట్టి ఆయన వినాయకుడు. త్రిమూర్తులను నడిపించే నాయకుడు కనుక విశిష్ఠ నాయకుడు. గణపతిని సదాచారులు లక్ష్మీగణపతిగా, వైష్ణవులు విష్వక్సేనునిగా, వామాచారులు ఉచ్ఛిష్ఠ గణపతిగా, బౌద్ధులు గజాననునిగా భావించి పూజిస్తుంటారు. ఎవరెలా పూజించినా ఆయన సర్వలోకానికీ రక్షకుడు. సర్వులకూ వినాయకుడు. గణపతిని ఎందరో ఎన్నో విధాలుగా కీర్తించారు. ఆయా ప్రఖ్యాత శ్లోకాలను, వాటి అర్థ తాత్పర్యాలను మననం చేసుకుంటే గణేశతత్త్వం అవగతమవుతుంది.
ఓం గం గణపతయే నమ
ఇది గణపతి మూల మం త్రం. సర్వకార్యసిద్ధికి ఈ మంత్ర జపం సహకరిస్తుంది.
‘గణేశ’ శబ్దం వ్యుత్పత్తి ఇది..
గణానాం జీవజాతానం య్ణ
యీశ్ణ స్వామి స్ణ గణేశ్ణ।
‘సమస్త జీవజాతికి ఈశుడు- స్వామి- అధిపతి గణేశుడు. ఆయనను పూజించటం వల్ల సమస్త విఘ్నాలు తొలగుతాయి’ అని అర్థం.
గణపతికి మూషిక వాహనం ఎలా సమకూరింది? బ్రహ్మవైవర్త పురాణంలో ‘వసుంధరా దదౌ తస్యై వాహనాయ చ మూషికమ్।’ అని ఉంది. అంటే- గణేశునికి మూషిక వాహనం వసుంధర (భూమి) నుంచి లభించింది అని అర్థం.
గణేశ పంచాయతన పూజ
వినాయక పూజల్లో అష్ట, షోడశ గణపతులు, 32 గణపతుల పూజలు ప్రాశస్త్యమైనవి. ఇవికాక శ్రీ గణపతి పంచాయతన పూజ మరీ ప్రసిద్ధం. ఆదిశంకరాచార్యులు తంత్రశాస్త్రంలోని పంచపూజ లను చక్కదిద్ది సామాన్యుల కోసం పంచాయతన పూజాతత్త్వాన్ని వాడుకలోకి తెచ్చారు. సృష్టికి మూల కారణాలైన పంచభూతాలు,
పంచతన్మాత్రలు, పం చజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనసు తో కలిపి మొత్తం 21 తత్త్వాలవుతాయి. ఈ తత్త్వా లకు సూర్యుడు, అంబిక, విష్ణువు, గణపతి, శివుడు పంచమూర్తులు. సృష్టికి అధిదేవతలైన ఈ ఐదు గురిని ఉపాసించటమే పంచాయతన పూజ. దీనికి రూపకల్పన చేసిన ఘనత జగద్గురు ఆదిశంకరా చార్యులదే.
పంచాయతన పూజలోని ఒక శ్లోకం-
దేవీ విష్ణుశ్చ సూర్యశ్చ గణేశశ్చ సదాశివి ।।
ఆరోగ్యాయచ భోగాయ నిర్విఘ్నాయ స్వకర్మాణామ్।।
తత్త్వజ్ఞానాయ మోక్షాయ పంచదేవాన్ ప్రపూజయేత్।।
కార్యములన్నీ నిర్విఘ్నంగా కొనసాగటానికి గణ పతిని, ఆరోగ్యప్రాప్తికి సూర్యుడిని, సకలైశ్వర్య ప్రాప్తికి దేవిని, ఆత్మజ్ఞానానికి పరమశివుడిని, మోక్షం పొందటానికి విష్ణువును నిత్యం మానవులు తమ క్షేమం కోసం పూజించాలి. హైందవ ధర్మంలో పంచాయతన పూజ విశేష వ్యాప్తిలో ఉంది.
శ్రీ విఘ్నేశ్వర ధ్యానం
ఓం ఓంకార రూపం త్య్రహమితి చపరం యత్స్వరూపంతురీయం ।।
త్రైగుణ్యాతీత నీలం కలయతిమనస స్తేజసిన్ధూర మూర్తిమ్ ।।
యోగీన్ద్రా బ్రహ్మరన్ద్రే సకల గుణమయం శ్రీహరేన్ద్రేణ సంగం ।
గం గంగంగం గణేశంజముఖమభితో వ్యాపకం చిన్తీయన్తి।।
ఓంకార స్వరూపుడు, ప్రణవ స్వరూపుడు, త్రిగు ణాత్మకమైన ఈ అఖిలాండకోటి బ్రహ్మాండమైన ప్రకృ తికి పరమైన వాడు, జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే అవస్థలను దాటిన తురీయరూపుడు, మనస్సును దేదీప్యమానంగా ప్రకాశింపచేసేవాడు, తేజస్వరూపుడు, సింధూర వర్ణ కాంతి గలవాడు, సకల గుణ గణాలు కలిగినవాడు, గజముఖం గలవాడు, సర్వవ్యాపి అయిన ఆ విఘ్నేశ్వరుడిని ఏ యోగీం ద్రులు సహస్రార కమలమునందు ధ్యానించెదరో అట్టి విఘ్నేశ్వరుడిని సదా ధ్యానించెదను.
గణపతిని పూజిస్తే సమస్త విఘ్నాలు హరి స్తాయని ‘గణపతి అథర్వశీర్షోపనిషత్తు’ ఉవాచ.
మహా విఘ్నాత్ ప్రముచ్యతే
మహా దోషాత్ ప్రముచ్యతే
వినాయకుడిని పూజిస్తే మహా విఘ్నాలన్నీ తొల గిపోతాయి. మహా దోషాలన్నీ అంతమైపోతాయి. మానవులే కాదు.. బ్రహ్మాది దేవతలు తమ పను లు నిర్విఘ్నంగా పూర్తయ్యేందుకు గజవదనుడిని భజిస్తారని కింది శ్లోకార్థం చెబుతోంది.
వాగీశాద్యా స్సుమనస్ణ సర్వార్థానా ముపక్రమే ।
య్ణ నత్వా కృతకృత్య్ణా స్యుస్తం నమామి గజాననమ్।।
శ్రీ గణపతి అథర్వ శీర్షోపనిషత్ గణపతిని త్రిమూర్తి స్వరూపమని స్తుతిస్తోంది.
ఓం నమస్తే గణపతయే।
త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి
త్తమేవ కేవలం కర్తాసి।
త్వమేన కేవలం ధర్తాసి।
త్వమేర కేవలం హర్తాసి।
త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి।
విశ్వరూపుడు..
సర్వలోక నాయకుడు
త్వం సాక్షాదాత్మా సి నిత్యమ్।।
(ఓంకార స్వరూపుడవైన ఓ గణపతీ! నమస్కారం. స్వామీ నీవే ‘తత్త్వమసి’ అనే మహా వా క్యానివి. ఓ గణపతీ! నీవే కర్తవు (బ్రహ్మ). నీవే ధర్తవు (విష్ణు). నీవే హర్తవు (శివుడు). సమస్త సృష్టివీ నీవే. ఆత్మస్వరూపుడవు కూడా నీవే స్వామీ!).
త్రిపురసంహారం అనంతరం సాక్షాత్తూ పరమశివుడే గణ పతిని ఇలా ఆశీర్వదించాడట.శైవైస్వదీయైరుత వైష్ణవశ్చ, శాక్తైశ్చసౌరైరపి సర్వకార్యే ।
శుభాశుభే లౌకిక వైదికేచ, త్వమర్చనీయ్ణ ప్రథమంప్రయత్నాత్।।
‘శైవం, వైష్ణవం, శాక్తం అనే మత సంప్రదాయా లకు చెందిన వారందరూ, లౌకిక, వైదికాది సమస్త శుభాశుభకార్యాలు, కర్మలు ప్రారంభించటానికి ముందు పప్రథమంగా నిన్ను భక్తిశ్రద్ధలతో పూజిం తురు గాక!).
యంబ్రహ్మ వేదాంత విదోవదంతి ।
పరం ప్రదానం పురుషం తదాంయే ।।
విశ్వోద్గమే కారణమీశ్వరం ।
వరతస్మై నమో విఘ్న నివారణాయ ।।
(సకల వేదాంత శాస్త్రానుభవంతో బ్రహ్మజ్ఞాను లంతా ఏ గణపతిని బ్రహ్మ అనీ, పరబ్రహ్మ అనీ, చరాచర ప్రపంచ స్వరూపమనీ, పరమేశ్వరుడనీ కొనియాడుతున్నారో ఆ మహా గణపతిని, మానవు ల జీవితంలో కలిగే విఘ్నాలను, అడ్డంకులను పోగొట్టు నిమిత్తం హృదయపూర్వకంగా నిన్ను పూజించుచున్నాను).
గణపతి సూక్తం ఇలా స్తుతిస్తోంది.
ఓం నిషుసీద గణపతే గణేషుత్వా మాహుర్వి ప్రథమం కవీనాం।।
న రుతేత్వ త్క్రియతే కించనారే మహామర్కం మఘవఙ్చత్రమర్చ ।।
ఓంకార స్వరూపుడవైన ఓ గణపతీ! నిన్ను పూజి స్తున్నాము. స్తోత్రం చేస్తున్నాం. మాపై దయతో మా మధ్య విరాజిల్లు. నీవు సర్వజ్ఞుడవు. క్రాంతదర్శి వి. శుభాశుభకర్మలు నీవు లేనిదే సాగవు. కావున సిద్ధిబుద్ధి సమేతమైన హే భగవాన్!
మా హృదయపూర్వకమైన ప్రార్థనలను మన్నించి భక్తులైన మమ్మల్ని ఆశీర్వదించు.
యాజ్ఞవల్క్యస్మ•తిలో గణపతి శ్రేష్ఠతను ఇలా చెప్పారు.
ఏవం వినాయకం పూజ్యం గ్రహాం శ్చైవ విధానత్ణ।
కర్మాణాం ఫలమాప్నోతి శ్రియంచాప్యోత్స నుత్తమం।।
ఫలమును ఆశ్రయించే వాడు విద్యుక్తంగా గణపతి ని షోడశోపచారాలతో పూజిం చాలి. ఆ తరువాత నవ గ్రహ పూజ నిర్వర్తించాలి.
ఒకసారి మదుడనే రాక్షసుడు తపస్సు చేసి శివుడి వరాలు పొంది అపార శక్తిసామర్థ్యాలు పొందాడు. ఆ గర్వంతో దేవతలపై దండెత్తాడు. ఇంద్రుడిని తరిమికొట్టి స్వర్గాన్ని ఆక్రమించుకొన్నాడు. దేవత లంతా చింతాక్రాంతులై సనత్కుమారుడిని ఆశ్ర యించారు. రాక్షస సంహారం, ధర్మసంస్థాపన కోసం దేవతలకు సనత్కుమారుడు ఏకదంతుని ఉపాసిం చాలని చెబుతూ ఈ కింది శ్లోకాన్ని బోధించాడు.
ఏకదంతం చతుర్బాహుం
గజవక్త్రం మహ•దరమ్ ।
సిద్ధిబుద్ధిసమాయుక్తం
మూషకారూఢమేవ చ ।।
నాభిశేషం సపాశం వై
పరశుం కమలం శుభమ్ ।
అభయం దధతం చైవ
ప్రసన్నవదనాంబుజమ్ ।।
భక్తేభ్యో వరదం
నిత్యమభక్తానాం నిషూదనమ్ ।।
భావం: ఏకదంతం, చతుర్భుజాలు కలిగి, గజ ముఖంతో లంబోదరుడై, సిద్ధిబుద్ధి సహితుడై, మూ షిక వాహనం కలిగి, నాభియందు ఆదిశేషుని ధరిం చి, చేతులలో పరశువు, పాశం, మనోహరమైన కమలం, అభయముద్ర ధరించి, ప్రసన్నవదనంతో భక్తులకు వరదాయకుడై, భక్తిహీనులను పరిమార్చే గజానునికి నమస్కారం.
దేవతలు ఈ స్తుతితో వినాయకుని పూజించి రాక్షసులపై ఘన విజయం సాధించారు.
Review అనాయకైక నాయకమ్। నమామి తం వినాయకమ్।।.