భాగ్యానికి ఆలవాలమైనదీ, క్షీంర సముద్ర రాజ తనయా, శ్రీరంగంలో వెలసిన దేవీ, దేవలోక స్త్రీలనందరినీ దాసీజనంగా చేసుకొన్నదీ, లోకానికి ఏకైక దీపంగా భాసిస్తున్నదీ, ఎవరి మృదుల కటాక్షంతో బ్రహ్మ, ఇంద్రుడు, గంగాధరుడు వైభవం సంతరించుకొన్నారో, మూడు లోకాలనూ తన కుటుంబంగా చేసుకొన్నదీ, తామర కొలనులో ఉద్భవించినదీ, మహా విష్ణువుకు ప్రియాతి ప్రియమైనదీ అయిన లక్ష్మీ.. నీకు నమస్కారం!
దీపావళి వేళ పూజలందుకునే ప్రధాన దైవం లక్ష్మీదేవే. ఆ విష్ణువు దేవేరిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. దీపావళి వేళ (అక్టోబర్ 31, 2024) ఆ క్షీరసముద్ర రాజతనయను ఎలా పూజించాలి? పూజా విధానం ఏమిటి?.. తెలుసుకుందాం.
దీపావళి శ్రీలక్ష్మీ పూజకు ఇలా సన్నద్ధం కావాలి..
– తూర్పునకు అభిముఖంగా కూర్చోవాలి
– కూర్చున్న దిశకు ముందు పీఠాన్ని ఉంచాలి. దానిపై కొత్త ఎరుపు వస్త్రాన్ని పరచాలి
– ఆ ఎరుపు వస్త్రంపై శ్రీలక్ష్మి చిత్రపటాన్ని ఉంచాలి
– పటానికి ఇరుపక్కలా దీపపు ప్రమిదలను ఉంచాలి
– శ్రీలక్ష్మి చిత్రపటానికి కుడివైపున అగరుబత్తీలు పెట్టాలి
– పళ్లెంలో కుంకుమ, పసుపు, గంధం, చిల్లర నాణేలు, తమలపాకులు, పూలు, వక్కలు ఉంచాలి
– అరటిపండ్లను ముందే సిద్ధంగా ఉంచుకోవాలి
– ప్రసాదాన్ని కూడా పీఠం వద్ద అమర్చుకోవాలి
– పసుపు, కుంకుమ, రెండు చుక్కలు నువ్వుల నూనెతో బియ్యం గింజలు కలిపి అక్షింతలుగా చేసి ఉంచుకోవాలి
– కుడివైపు పళ్లెంలో అక్షతలు, పూజకు పూలు సిద్ధం చేసుకోవాలి
– నీటితో నింపిన కలశపు చెంబు
– నీటితో నింపిన పంచపాత్ర, చెంచా
– చేతిని శుభ్రం చేసుకోవడానికి పేపర్ కర్చీఫ్‍లు
– గణపతి, శ్రీలక్ష్మీదేవి విగ్రహం, లక్ష్మీ బొమ్మ నాణేం కుడివైపు ఉంచాలి
– భర్తకు కుడివైపుగా భార్య కూర్చోవాలి
– తలస్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, తల్లిదండ్రులకు, గురుదేవులకు నమస్కరించి (లేదా వారి చిత్రపటాలకు) పూజను ప్రారంభించాలి
అవిఘ్నమస్తు
సుముఖశ్చైవ దంతస్య కపితో గజకర్ణఖ ।
లంబోదరస్య వికటో విఘ్ననాశో గణాధిప ।।
భూమర్కేతు గగాధక్ష బాలచంద్రో గజాననా ।
ద్వాదశైతాని నామాని యాహ్ పఠేత్‍శృణుయాదవి ।।
విద్యారంభే వివాహేచ ప్రవేస్ నిర్ఘమే తథా
సంగ్రామే సకశ్చైవ విఘ్నతస్య నజాయతే ।।
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థసాధికే ।
శరణ్యే త్య్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ।।
సర్వదా సర్వకార్యేషు నాస్తితేశం అమంగళమ్ ।
ఏశాం హృద్థిస్థో భగవాన్ మంగళాయతన్ హరి: ।।
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ ।
విద్యాబలం దైవబలం తదేవ పద్మావతి పతితంగ్రాహి యుగం స్మరమి ।।
లాభం అశ్టేసం జయాస్రేశం కూటాస్థేసం పరాజయ: ।
ఏషాం ఇందేవర శ్యామో హృదయేస్థో జనార్దన
వినాయకం గురుంఛామం బ్రహ్మవిష్ణుమహేశ్వరం
సరస్వతిమ్ ప్రణమాయ్యదౌ సర్వకార్యేర్థ సిద్ధయే ।।
అంగైశ్చ సహితా స్వర్వే కలాశంబ సమాశ్రితా: ।
అత్ర తిష్టంతు సావిత్రి గాయత్రి చ సరస్వతి
స్కందో గణపతి శ్చైవ శాంతి: పుష్టికరీతథా ।।
శ్లోకం:గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతీ ।
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్సన్నిధింకురు ।।
కావేరీ తుంగ్రభద్రాచ కృష్ణవేణీచ గౌతమీ ।
భాగీరథీతి విఖ్యాతా: పంచగంగా: ప్రకీర్తితా: ।।
అయాంతు శ్రీ మహాలక్ష్మీ దేవీ పూజార్థం దురితక్షయకారకా:
కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య, దేవం, ఆత్యానంచప్రోక్ష్య :
గణపతి పూజ
(గణపతి పూజకు ముందు పసుపుతో గణపతి ప్రతిమ (ముద్ద)ను తయారుచేసి దానికి గంధం, కుంకుమబొట్లు పెట్టి ఒక పళ్లెంలో తమలపాకును ఉంచి, దానిపై గణపతి ప్రతిమను ఉంచాలి)
ప్రాణప్రతిష్ఠ: (పువ్వులు, అక్షతలతో గణపతిని ప్రాణప్రతిష్ఠ చేయాలి)
శ్లోకం: ఓం అసునీతే పునరస్మాసు చక్షు: పుణ: ప్రాణప్రతిష్ఠ మిహ నో ధేమి భోగమ్
జ్యోక్పశ్యేమ సూర్చముచ్చరంత మనుమతే మృదయా న స్వ్వస్తి
అమృతంవై ప్రాణా అమృతమాన: ప్రాణానేవ యథాస్థాన ముపహ్వయతే
సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం
శ్రీ మహాగణాధిపం – ఆవాహయామి, స్వాపయామి, పూజయామి
ధ్యానం:
(ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ గణపతిపై అక్షతలు చల్లాలి)
శ్లోకం: ఓం గణానాంత్వా గణపతిగ్‍ంహవామహే
కవిం కవీనా ముపము శ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
అనశ్శ•ణ్వన్నూతభి స్సీదసాదనమ్
శ్లోకం: వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
ఓం తత్పురుషాయ విద్మహే
వక్రతుండాయ ధీమహి
తన్నోదన్తి: ప్రచోదయాత్
ఆవాహనం:మహాగణపతయే నమ:
ఆసనం సమర్పయామి
పాద్యం: శ్రీమహాగణాధిపతయే నమ:
పాదయో: పాద్యం సమర్పయా
దీపావళి శ్రీలక్ష్మీ పూజ ప్రారంభం
గురు ప్రార్థన:
ఓం సర్వేభ్యో గురుభ్యోనమ:
ఓం సర్వేభ్యో దేవేభ్యోనమ:
ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యోనమం:
ఓం మహాగణాధిపతయే నమ:
ఓం శ్రీగురుభ్యో నమ:
ఓం శ్రీ సరస్వత్వే నమ:
ఓం శ్రీ వేదాయ నమ:
శ్రీ వేదరూపాయ నమ:
శ్యామల దేవతాభ్యో నమ:
స్థాన దేవతాభ్యో నమ:
గ్రామదేవతాభ్యో నమ:
వాస్తు దేవతాభ్యో నమ:
శభి పురందరాభ్యో నమ:
ఉమామహేశ్వరాభ్యో నమ:
మాతా పిత్రభ్యో నమ:
పద్మావతీ నారాయణనాభ్యో నమ:
సర్వేభ్యో దేవోభ్యో నమ:
సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమ:
కర్మ ప్రధాన దేవతాభ్యో నమ:
ప్రాణాయామం
ఒక చెంచా నీటిని కుడిచేతిలో పోసుకుని ఈ కింది మంత్రాన్ని పఠించాలి.
ఓం ప్రణవశ్య పరబ్రహ్మ రుషి:
పరమాత్మ దేవతా ।।
దేవి గాయత్రి ఛంద: ప్రాణాయామే వినియోగ: ।।
(చేతిలోని నీటిని మీ ముందు ఉంచిన ప్లేటులో జారవిడవాలి. తిన్నగా కూర్చుని గుండె నిండా గాలిని పీల్చాలి. అలా పీల్చిన గాలిని మెల్లగా వదలాలి)
దీపావళి శ్రీలక్ష్మీదేవి పూజా విధానము
శ్రీ గురుప్రార్థన:
(ఈ కింది మంత్రం చెబుతూ నమస్కారం చేయాలి)
శ్లోకం: ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర:
గురుస్సాక్షా త్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమ:
(ఈ కింది మంత్రాన్ని చెబుతూ నమస్కారం చేయాలి)
అపవిత్ర: పవిత్రోవా। సర్వావస్థాంగతోపివా। యస్స్మరేత్పుండరీకాక్షం।
సబాహ్యాభ్యం తరశ్శుచి। పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమ:।।
(అనంతరం ఈ కింది మంత్రాన్ని పలుకుతూ దీపం వెలిగించాలి. ఆ తరువాత దీపం కుందులకు కుంకుమ, పసుపు, గంధం పూసి, అక్షతలు వేసి నమస్కారం చేయాలి)
శ్లోకం: భో దీప దేవి రూపస్త్యం కర్మసాక్షి హ్యవిష్న కృత్ ।
యావత్పూజం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ ।।
దీపారాధన ముహూర్త: సుముహూర్తోస్తు ।।
ఆచమనం:
ఒక పంచపాత్ర (గ్లాసు)లోకి మంచినీటిని తీసుకుని ఉద్ధరిణి (చెంచా)తో కుడిచేతిలో నీటిని పోసుకుని ఈ కింది నామాలు పలుకుతూ మూడుసార్లు లోనికి తీసుకుని నాలుగోసారి చేతులు కడుగుకుని నీటిని కిందికి వదలాలి.
ఓం కేశవాయ స్వాహా –
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా –
ఓం గోవిందాయ నమ:
(అనంతరం నమస్కారం చేసి కింది నామాలు చెప్పాలి)
ఓం గోవిందాయ నమ:, ఓం విష్ణవే నమ:, ఓం మధుసూదనాయ నమ:, ఓం త్రివిక్రమాయ నమ:, ఓం వామనాయ నమ:, ఓం శ్రీధరాయ నమ:, ఓం హృశీకేశాయ నమ:, ఓం అథోక్షజాయ నమ:, ఓం నారసింహాయ నమ:, ఓం అచ్యుతాయ నమ:, ఓం జనార్థనాయ నమ:, ఓం ఉపేంద్రాయ నమ:, ఓం హరయే శ్రీకృష్ణాయ నమ:, ఓం కృష్ణ పరబ్రహ్మణే నమ:, ఓం పద్మనాభాయ నమ:, ఓం దామోదరాయ నమ:, ఓం సంకర్షణాయ నమ:, ఓం వాసుదేవాయ నమ:, ఓం ప్రద్యుమ్నాయ నమ:, ఓం అనిరుద్ధాయ నమ:, ఓం పురుషోత్తమాయ నమ:
(కుడిచేతిలో కొద్దిగా నీటిని వేసుకుని ఈ కింది మంత్రం చెబుతూ ఆ నీటిని వెనుకకు చల్లాలి)
శ్లోకం: ఉత్తిష్ఠన్తు భూతపిశాచా:। ఏతేభూమి భారకా:।।
ఏతేషా మవిరోధేన:। బ్రహ్మ కర్మ సమారంభే:।।
ప్రాణాయామము
(ఈ కింది మంత్రాన్ని చెబుతూ కుడిచేతి బొటనవేలు, ఉంగరపు వేలుతో ముక్కు మూసుకోవాలి)
ఓం భూ:। ఓం భువ: ఓగ్‍ం సువ: ఓం మహ:। ఓం జన:। ఓం తప:। ఓగ్‍ం సత్యం। ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహీ। ధియోయోన:। ప్రచోదయాత్:। ఓమాపోజ్యోతీ రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్: ।।
సంకల్పం: (ఈ కింది సంకల్పాన్ని చెప్పిన తరువాత, కుడిచేతితో కొద్దిగా అక్షతలు తీసుకుని చెంచాతో గ్లాసులోని నీటిని ఎడమ చేతిలో పోసుకుంటూ కుడిచేతితో ఆ నీళ్లు, అక్షతలు పళ్లెంలో పడేలా వదలాలి)
మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం- శుభే శోభన ముహూర్తే శ్రీమహా విష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ: ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే (శ్రీశైలానికి మీరు ఏ దిక్కున ఉంటే ఆ దిక్కు పేరు చెప్పాలి) శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేనే శ్రీక్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే శరధతౌ ఆశ్వయుజ మాసే బహుళ చతుర్దశి పక్షే వాసరే శుభ నక్షత్రే శుభమయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ ….. గోత్ర (మీ గోత్రం పేరు చెప్పాలి) …… నామధేయ: (మీ పేరు చెప్పాలి)…. ధర్మపత్మీ (మీ భార్య పేరు చెప్పాలి) సమేత: మమ సకుటుంబస్య (మీ కుటుంబంలోని పిల్లలు, ఇతరుల పేర్లు చెప్పాలి) క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధర్థ్యం ధనకనక వస్తు వాహన సమృద్ధర్థ్యం సర్వాభీష్ట సిద్ధర్థ్యం మహాలక్ష్మీ ముద్ధివ్య మహాలక్ష్మీదేవి ప్రీత్యర్థం యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ।। అదౌ నిర్విఘన పరిసమాప్త్యర్థం శ్రీమహాగణాధిపతి పూజాం కరిష్యే ।।
(అక్షతలను నీళ్లతో పళ్లెంలో వదలాలి)
కలశారాధనం
(కలశానికి గంధం, కుంకుమబొట్లు పెట్టి, కలశంలో ఒక పుష్పం, కొద్దిగా అక్షతలు వేసి, కుడిచేతితో కలశాన్ని మూసి ఈ కింది మంత్రాలను చెప్పాలి)
శ్లోకం: కలసశ్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రిత:।
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మ•తా:।
కుక్షౌతు స్సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా।
రుగ్వేదోథ యజర్వేద స్సామవేదో హ్యధర్వణ:।।
ఆర్ఘ్యం: శ్రీ మహాగాణాధిపతయే నమ:
హస్తయో: ఆర్ఘ్యం సమర్పయామి
ఆచమనీయం:శ్రీమహాగణాధిపతయే నమ:
ముఖే ఆచమనీయం సమర్పయామి
ఫలోదకం:
(ఈ కింది మంత్రాన్ని చదువుతూ కొబ్బరినీటిని గణపతి, లక్ష్మీదేవి ప్రతిమలపై చల్లాలి)
శ్లోకం: యా: ఫలినీర్యా ఫల పుష్పాయాశ్చ పుష్పిణీ:
బృహస్పతి ప్రసూతాస్తావో ముంచస్త్యగ్‍ం హస:
శ్రీ మహాగణాధిపతయే నమ: నారికేళ ఫలోదక స్నానం సమర్పయామి
స్నానం: (ఈ కింది మంత్రం చెబుతూ పుష్పంతో నీటిని దేవుళ్ల ప్రతిమలపై చల్లాలి)
శ్లోకం: అపోహిష్ఠా మయోభువ: తాన ఊర్జే దధాతన।
మహేరణాయ చక్షసే యోవశ్శితమో రస:
తస్య భాజయతే హన:। ఉశతీరవ మాతర:
తస్మా ఆరంగం మాయవ: యస్యక్షయాయ జిన్వధ
అపోజన యథాయన: శ్రీ మహాగణాధిపతయే నమ:
ఔపచారిక స్నానం సమర్పయామి
(ఈ కింది మంత్రాన్ని చెబుతూ పుష్పంతో నీటిని పళ్లెంలో విడిచిపెట్టాలి)
శ్రీ మహాగణాధిపతయే నమ:
స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి
వస్త్రం:
(ఈ కింది మంత్రాన్ని చెబుతూ కుడిచేతితో అక్షతలు దేవుళ్ల ప్రతిమలపై ఉంచాలి)
శ్లోకం: అభివస్త్రా సువపనా న్య•షాభిధేనూ స్సుదఘా:పూయమానా:
అభిచంద్రా భర్త వేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ
శ్రీమహాగణాధిపతయే నమ:
వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి
యజ్ఞోపవీతం:
(ఈ కింది మంత్రం చెబుతూ అక్షతలు దేవుని వద్ద ఉంచాలి)
శ్లోకం:
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే ర్యత్సహజనం పురసాత్
ఆయుష్యమగ్య్రం పతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ:
శ్రీ మహాగణాధిపతయే నమ: యజ్ఞోపతీం అక్షతాన్ సమర్పయామి
గంధం: (ఈ కింది మంత్రాన్ని చదువుతూ దేవునిపై గంధం చల్లాలి)
శ్లోకం:
గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీణిషీమ్
ఈశ్వరీగ్‍ం సర్వభూతానాం తా మిహోపహ్వయే శ్రియమ్
శ్రీ మహాగణాధిపతయే నమ: దివ్యశ్రీ చందనం సమర్పయామి
అక్షతలు: (ఈ కింది మంత్రాన్ని చెబుతూ దేవునిపై అక్షతలు చల్లాలి)
శ్లోకం:
ఆయనే తే పరాయణే దూర్వా రోహంతు పుష్పిణీ:
ప్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహా ఇమే
శ్రీమహాగణాధిపతయే నమ:
గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి
పుష్పం: (ఈ కింది నామాలు చెబుతూ దేవుళ్లను పూలతో పూజించాలి)
ఓం సుముఖాయ నమ:, ఓం ఏకదంతాయ నమ:, ఓం కపిలాయ నమ:, ఓం గజకర్ణకాయ నమ:, ఓం లంబోదరాయ నమ:, ఓం వికటాయ నమ:, ఓం విఘ్నరాజాయ నమ:, ఓం గణాధిపాయ నమ:, ఓం ధూమకేతవే నమ:, ఓం గణాధ్యక్షాయ నమ:, ఓం ఫాలచంద్రాయ నమ:, ఓం గజాననాయ నమ:, ఓం వక్రతుండాయ నమ:, ఓం శూర్పకర్ణాయ నమ:, ఓం హేరంబాయ నమ:, ఓం స్కందపూర్వజాయ నమ:, ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమ:, ఓం కుమారగురవే నమ:, ఓం మహాగణాధిపతయే నమ:
నానావిధ పరిమళ పత్ర పుష్పరాజాం సమర్పయామి
ధూపం: (ఈ కింది మంత్రాన్ని చెబుతూ అగరవత్తుల ధూపాన్ని దేవునికి చూపాలి)
శ్లోకం:వనస్పత్యుద్భవై ర్ధివ్యై ర్నానాంగధై స్సుసంయుత:
ఆఘ్రేయ స్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్
శ్రీమహాగణాధిపతయే నమ:
ధూపమాఘ్రాపయామి ధూపం సమర్పయామి
దీపం: (ఈ కింది మంత్రాన్ని చదువుతూ దీపాన్ని దేవునికి చూపాలి)
శ్లోకం: సాజ్య మేకార్తిసం యుక్తం వహ్నినా యోజితం ప్రియమ్
గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహ
భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహి మాం నరకా ద్ఘోరా ద్దివ్య జ్యోతిర్నమోస్తుతే
శ్రీమహాగణాధిపతయే నమ: దీపం దర్శయామి
నైవేద్యం: (ఈ కింది మంత్రాన్ని చెబుతూ పుష్పముతో నీటిని నైవేద్యం కోసం ఉంచిన పండ్లు, బెల్లం ఇతర పదార్థాలపై చల్లాలి)
శ్లోకం:
ఓం భూర్భువస్సువ: ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు, అమృతోపస్తరణమపి
(కుడిచేయి మోచేతిని ఎడమ చేతితో పట్టుకుని కుడిచేతిలో ఈ కింది మంత్రాన్ని చెబుతూ ఐదుసార్లు నైవేద్యం చూపాలి)
ఓం ప్రాణాయ స్వాహా – ఓం అపానాయ స్వాహా – ఓం వ్యానాయ స్వాహా – ఓం ఉదానాయ స్వాహా – ఓం సనానాయ స్వాహా – మధ్యే మధ్యే పానీయం సమర్పయామి – ఓం అమృతా పిధానమసి – ఉత్తరాపోశనం సమర్పయామి – హస్తౌ ప్రక్షాళయామి – పాదౌ ప్రక్షాళయామి – శుద్ధాచమనీయం సమర్పయామి – ఓం మహాగణాధిపతయే నమ: నానావిధ భక్ష్య, భోజ్య, నారికేళ, కధలీఫల నైవేద్యం నివేదయామి
తాంబూలం:(ఈ కింది మంత్రాన్ని చదువుతూ దేవుని వద్ద తాంబూలాలు (తమలపాకులు, పోకచెక్కలు) ఉంచాలి)
శ్లోకం: పూగీఫలై స్సకర్పూరై ర్నాగవల్లీ దళైర్యుతమ్
ముక్తాచూర్ణ సమాయక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
శ్రీ మహాగణాధిపతయే నమ: తాంబూలం సమర్పయామి
నీరాజనం: (కర్పూరాన్ని వెలిగించి దేవునికి చూపిస్తూ ఈ మంత్రాన్ని చదవాలి)
శ్లోకం: సమ్రాజంచ విరాజంచ అభిశ్రీర్యాచనోగృహే
లక్ష్మీరాష్ట్రస్య యాముఖే తయాగసగ్‍ం సృజామసి సన్తత శ్రీరస్తు, సమస్త మంగళాని భవంతు
నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు
శ్రీ మహాగణాధిపతయే నమ:
ఆనంద కర్పూన నీరాజన దర్శయామి
(పుష్పముతో నీటిని హారతి పళ్లెములో విడిచి, ‘‘నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, నమస్కరోమి’ అంటూ హారతిని కళ్లకు అద్దుకోవాలి)
మంత్రపుష్పం: (చేతిలో అక్షతలు, పూలు, చిల్లర నాణేలు పట్టుకుని ఈ కింది శ్లోకాన్ని పఠించాలి)
శ్లోకం: సుముఖ శ్చైకదంతశ్చ కపిలో గజకర్ణ:
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప:
ధూమకేతుర్గణాధ్యక్ష: ఫాలచంద్రో గజానన:
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబ స్వందూర్వజ:
షోడశైతాని నామాని య: పఠేచ్ఛ్రుణుయాదపి
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్య నజాయతే
(ఈ కింది శ్లోకాన్ని చెబుతూ పుష్పాలు, అక్షతలు, దక్షిణ వినాయకుని వద్ద ఉంచాలి)
శ్రీ మహాగణాధిపతయే నమ:
సువర్ణదివ్య మంత్ర పుష్పం సమర్పయామి
అనయా ధ్యానా వాహనాది పూజయా భగవాన్ సర్వాత్మక:
శ్రీ మహాగణాధిపతి: సుప్రీతి: సుప్రసన్నో వరదో భవతు
ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్త్వితి భవంతి బ్రవంతు
ఉద్వాపన: (ఈ కింది శ్లోకాని చదువుతూ మూడుసార్లు వినాయక ప్రతిమను కదపాలి)
శ్లోకం:
యజ్ఞేన యజ్ఞ మయజంతదేవా: తాని ధర్మాణి ప్రథమాన్యాసన్
తేహనాకం మహిమాన స్సజంతే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవా:
మహాగణాధిపతయే నమ: యథాస్థాన ముద్వాసయామి
(అనంతరం పసుపు వినాయకుడిని కొద్దిగా తూర్పు దిశగా కదిలించాలి).
దీపావళి శ్రీలక్ష్మీదేవి పూజ
‘‘మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ మహాలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య •్రహ్మణ: ద్వితీయపరార్థే శ్వేతవరాహా కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీయుజ మాసే బహుళ పక్షే చతుర్దశి తిథౌ గురువాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణే, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిథౌ, శ్రీమాన్ …. గోత్ర … నామధేయ… మమ ధర్మపత్నీ సమేతస్య, సకుటుంబస్య, క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సర్వారీష్ట పరిహారార్థం, సర్వాభీష్టస్థిత్యర్థం, దీపావళి మహాలక్ష్మీ దేవతా ప్రీత్యర్థ్యం, దీపావళి మహాలక్ష్మీ దేవతా ముద్దిశ్చ ప్రీత్యర్థం యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే..’’
పై విధంగా చెప్పిన తరువాత కుడిచేతితో కొద్దిగా అక్షతలు తీసుకుని ఎడమచేతితో నీటిని తీసుకుని కుడిచేతిలో పోసుకుంటూ అక్షతలు పళ్లెంలో పడేలా నీరు వదలాలి.
(ఈ కింది శ్లోకాన్ని చదువుతూ అక్షతలు, నీరు కలిపి పళ్లెంలో పడేలా వదలాలి)
ఆవాహనం:(దేవి పాదాలపై కొన్ని అక్షతలు చల్లాలి)
శ్లోకం: ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం
చంద్రాం హిరణ్యయీం లక్ష్మీం జాత వేదో మమావహ
సహస్రదళ పద్మాస్యాం స్వస్థాంచ సుమనోహరాం
శాంతాంచ శ్రీహరే: కాంతాం తాం భజే జగతాం ప్రసూం
శ్రీమహాలక్ష్మీ దేవ్యైనమ: ఆవాహయామి
ఆసనం: (ఈ కింది శ్లోకాన్ని చదువుతూ పంచపాత్ర (గ్లాసు)లోని నీటిని పుష్పముతో కొద్దిగా దేవి పాదాలపై చల్లాలి)
శ్లోకం: ఆశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రభోదినీం
శ్రియం దేవీ ముపహ్వయే శ్రీర్మాదేవీజుషతాం
శుద్ధ గంగోదకమిదం సర్వవందిత మీప్సితం
పాపేధ్మవహ్నిరూపంచ గృహ్యతాం పరమేశ్వరీ
శ్రీమహాలక్ష్మీ దేవ్యైనమ:
పాదయో: పాద్యం సమర్పయామి
అర్ఘ్యం: (పంచపాత్రలోని నీటిని పుష్పంతో కొద్దిగా దేవి పాదాలపై చల్లాలి)
శ్లోకం:
కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీ తృప్తాం తర్పయంతీం
పద్మేస్థితాం పద్మవర్ణాం తా మిహోపహ్వయే శ్రియం
పుష్పచందన దూర్వాదిసంయుతం జాహ్నవీలజలం
శంఖ గర్భ స్థితం శుద్ధం గృహ్యతాం పద్మవాసిని
శ్రీమహాలక్ష్మీ దేవ్యై నమ: హస్తయో: అర్ఘ్యం సమర్పయామి
ఆచమనీయం:
(పంచపాత్రలోని నీటిని పువ్వుతో కొద్దిగా దేవి పాదాలపై చల్లాలి)
శ్లోకం:
చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీ శ్రియం లోకే దేవజుష్టాముదారాం
తాం పద్మినీమీగ్‍ం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్యేనశ్యతాం త్వాం వృణే
పుణ్యతీర్థాధికం చైవ విశుద్ధం శుద్ధిదం సదా
గృహ్యతాం కృష్ణకాంతే చ రమ్య మాచమనీయకం
శ్రీమహాలక్ష్మీ దేవ్యై నమ: ముఖే ఆచమనీయం సమర్పయామి పంచామృతాభిషేకం
(ఈ కింది శ్లోకాలు చదువుతూ పంచామృతాలతో దేవిని అర్చించాలి)
పాలతో అభిషేకం:
ఓం ఆప్యాయస్య సమేతుతే విశ్వతస్సోమ
వృష్టియంభవావాజస్య సంగథే
శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమ: క్షీరేణస్నపయామి
పెరుగుతో అభిషేకం:
ఓం దధిక్రావుణ్ణో అకారిషం జిష్ణోరశ్వస్య వాజిన:
సురభినో ముఖాకరత్ప్రన ఆయూగ్‍ం షి తారిషత్
శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమ: దధ్నా స్నపయామి
నెయ్యితో అభిషేకం:
ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా
త్వచ్ఛి ద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్శిభి:
శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమ: అజ్యేన స్నపయామి
తేనెతో అభిషేకం:
ఓం మధువాతా రుతాయతే మధుక్షరంతి
సింధవ:మాధ్వీర్నస్సంత్వోషధీ:
మధునక్తముతోషసి మధుమత్పార్థి వగ్‍ంరజ:
మధుద్వౌరస్తున: పితా మధుమాన్నే
వనస్పతి ర్మధుమాగ్‍ం అస్తుసూర్య: మాధ్వీర్గావో భవంతున:
శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమ: మధునా స్నపయామి
పంచదారతో అభిషేకం:
ఓం స్వాధు: సవస్వ దివ్యాయజన్మనే
స్వాదురింద్రాయ సుహవీతునామ్నే సాదుర్మిత్రాయ
వరుణాయవాయవే – బృహస్పతయే మధుమాగ్‍ం ఆదాభ్య:
శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమ: శర్కరేణ స్నపయామి
శుద్ధోదక స్నానం:
యా: ఫలినీర్యా ఫలా పుష్సాయాశ్చ పుష్పిణీ:
బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగ్‍ం హస:
శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమ: శుద్ధోదక స్నానం సమర్పయామి
వస్త్రం:
(ఈ కింది శ్లోకాన్ని చెప్పిన తరువాత కొత్త బట్టలను కానీ, అక్షతలను కానీ, పత్తితో చేసి వస్త్రయుగ్మం కానీ దేవి వద్ద ఉంచాలి)
శ్లోకం: ఉపైతు మాం దేవసఖ: కీర్తిశ్చ మహినాసహ
ప్రాదుర్భూతోస్మిరాష్ట్రేస్మిన్కీర్తిమృద్ధిం దదాతుమే
సౌందర్య ముఖ్యాలంకారం సదాశోభావివర్ణనం
కార్పాసజంచక్రిమిజం వసనం దేవిగృహ్యతాం
శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమ: వస్త్రయుగ్మం సమర్పయామి
చందనం:
(ఈ కింది మంత్రాన్ని చదువుతూ పుష్పమును గంధంలో ముంచి దేవి పాదాల వద్ద ఉంచాలి)
శ్లోకం: గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం
ఈశ్వరీగ్ సర్వభూతానాం తామిహోపహ్యయే శ్రియం
దీపావళి శ్రీమహాలక్ష్మీ అవతరణ గాథలు
వివిధ పురాణాలలో లక్ష్మీదేవి అవతరణకు సంబంధించిన గాథలు అనేకం ఉన్నాయి. వివిధ కల్పాలలో లక్ష్మీదేవి అవతరణకు సంబంధించిన గాథలు వేర్వేరుగా ఉన్నా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న గాథ మాత్రం ఒక్కటే. అది- క్షీరసాగర మథన సమయంలో లక్ష్మీదేవి ఉద్భవించిన కథ. ఆ కథ ప్రకారం..
ఒకసారి దూర్వాస మహాముని స్వర్గానికి వెళ్లాడు. ఆ సమయంలో ఐరావతంపై ఇంద్రుడు నందనవనంలో విహరిస్తున్నాడు. దూర్వాసుడి రాకను ఇంద్రుడు గమనించలేదు. దీంతో మండిపడిన మహాముని ‘నీ ఇంద్ర పదవి నుంచి నీకు పతనం ప్రాప్తించు గాక. నీ సమస్త ఐశ్వర్యం సముద్రంలో కలిసిపోగాక’ అని శపించాడు. అనంతరం రాక్షసులు స్వర్గంపైకి దండెత్తి దాన్ని స్వాధీనం చేసుకుంటారు. దూర్వాస మహాముని శాపం ప్రకారం ఇంద్రుడి ఐశ్వర్యమంతా ఆయనకు దూరం అవుతుంది. దీంతో ఇంద్రుడు త్రిమూర్తులకు మొరపెట్టుకోగా, సముద్రాన్ని మథించి తిరిగి పోయిన సంపదను సాధించడమే తరుణోపాయని చెబుతారు.
ఆ తరువాత దేవతలు క్షీరసాగర మథనాన్ని చేపడతారు. ఆ సమయంలో కల్పవృక్షం, కామధేనువుతో పాటు లక్ష్మీదేవి ఉద్భవించి, మహావిష్ణువును వరిస్తుంది.
ఇది చాలామందికి తెలిసిన కథ. ఇది కాక భృగు మహర్షి కుమార్తెగా లక్ష్మీదేవి జన్మించినట్టు మరో గాథ కూడా ఉంది.
భృగువు భార్య ఖ్యాతి పుత్రికా సంతానం కోరి, జగన్మాత అనుగ్రహం కోసం తపస్సు చేస్తుంది. జగన్మాత వరంతో ఆమెకు అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవి జన్మిస్తుంది. భృగు మహర్షి కుమార్తె కనుక ఆమెను భార్గవి అని కూడా పిలుస్తారు.
సంపదలను కొనితెచ్చే
లక్ష్మీగవ్వలు
గవ్వలు చాలా పవిత్రమైనవి. ఇవి సాక్షాత్తూ లక్ష్మీదేవితో సమానమైనవి. గవ్వలు స్థూలంగా ఒకటే ఆకృతిలో ఉన్నప్పటికీ చిన్న చిన్న తేడాలతో అనేక రకాలుగా ఉంటాయి. ఈ గవ్వల్లో పసుపు రంగులో మెరిసే గవ్వలను లక్ష్మీ గవ్వలని అంటారు. వీటిని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు.
అసలు లక్ష్మీగవ్వలు ఎక్కడివి?
ఎలా పుట్టాయి?
క్షీరసాగర మథనం సమయంలో అమృతం, హాలాహలంతో పాటు శంఖాలు, లక్ష్మీగవ్వలు కూడా ఉద్భవించాయట. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరునిగా, గవ్వను సోదరిగా భావిస్తారు. ఆ విధంగా లక్ష్మీగవ్వలు లక్ష్మీదేవికి ప్రతిరూపం అయ్యాయి.
గవ్వను లక్ష్మీదేవికి చెల్లెలుగా భావించే వారు కనుక నాణేలు, రూపాయలు పుట్టకముందు వాటినే కాసులుగా వాడేవారు. ఆర్థిక లావాదేవీల్లో గవ్వలనే మారకంగా వినియోగించే వారు. అంటే ఒకప్పుడు డబ్బుకు మారుగా గవ్వలే ఉండేవన్న మాట. ఎవరి దగ్గర ఎక్కువ గవ్వలు ఉంటే వారే ఆనాడు ధనవంతులు. గవ్వలకు నాడు చాలా ప్రాధాన్యం ఉండేది. గవ్వలు లేనివాళ్లు నిరుపేదల కింద లెక్క. ఇప్పటికీ బొత్తిగా డబ్బు లేదని చెప్పడానికి చిల్లిగవ్వ కూడా లేదని అనడం వింటుంటాం. గవ్వలను పూర్వం కానుకలుగా వినియోగించారంటే, అందుకు కారణం లేకపోలేదు. లక్ష్మీగవ్వలు సామాన్యమైనవి కావు. అవి ఇంట్లో ఉంటే సంపదలు కలుగుతాయి. ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి. అంటే గవ్వలకు లక్ష్మీదేవికి అవినాభావ సంబంధం ఉంది. ఎక్కడ లక్ష్మీగవ్వలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఇదీ లక్ష్మీగవ్వల విశిష్టత. అందుకే పూజా మందిరంలో లక్ష్మీదేవి విగ్రహంతో పాటు శంఖాన్ని, లక్ష్మీగవ్వలను కూడా పీఠంపై ఉంచి ప్రార్థించడం ఆనవాయితీ.
లక్ష్మీదేవి
చంచలత్వం
తత్తాదృజ్న ధురాత్మకం తవవపుస్సం ప్రాప సంపన్మయీ
సా దేవీ పరమోత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్యసి
తే నాస్యా బతకష్ట మచ్చుతవిభో త్వద్రూపమనోజ్ఞక
ప్రేమ స్థైర్యమయా దచాపలబలా చ్చాపల్యవార్తదభూత్
‘మధుర, మనోజ్ఞమైన నారాయణునిపై అనురాగం పెల్లుబుకడం చేత లక్ష్మీదేవి తన భక్తుల వద్ద కూడా ఎక్కువసేపు నిలబడదు. అందువల్లనే ఆమెకు ‘చంచల’ అనే పేరు వచ్చింది. ఆమె అనురాగమే ఆమెకు ఆ అపకీర్తిని తెచ్చిపెట్టింది’ అని పై పద్యానికి భావం.
ఇక్కడ గమనించాల్సిందేమంటే.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సదా నారాయణుడిని మనం మనసులో నిలుపుకోవాలి. ఎప్పుడైతే నారాయణుడు మన మనసులో నివాసం ఉండడో, అప్పుడు లక్ష్మీదేవి కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్తుంది. కాబట్టి ఆ భగవంతుడిని సదా మనసులో నిలుపుకోవాలి.
లక్ష్మీదేవికి చంచల, చపల అనే పేర్లున్నాయి. ఒకచోట స్థిరంగా ఉండదని ఈ పదాలకు అర్థం. ఎందరి జీవితానుభవాలో దీనికి నిదర్శనం. అయితే నిజానికి అమ్మవారి లక్షణం చాంచల్యం కాదు. మన కర్మాచరణకీ, బుద్ధికీ స్థిరత్వం లేకపోవడం చేత కర్మఫల ప్రదాయిని అయిన జగదంబ మనకు అస్థిర ఫలాలను ప్రసాదిస్తోంది. అమ్మవారి సహజగుణం అనవతర నారాయణాశ్రయం. అంటే క్షణకాలం నారాయణుడిని విడవజాలనితనం. నారాయణుడి అవతారాలన్నిటిలోనూ ఆమె ఏదో ఒకవిధంగా ఆయనను ఆశ్రయించుకునే ఉంటోంది. రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా లక్ష్మి నారాయణుడి వెంటే ఉంటుంది. ఇక్కడ మనుషుల మానసిక ప్రవృత్తిలో తేడా వల్లనే లక్ష్మీదేవి మనకు చంచల స్వభావిగా కనిపిస్తోంది. ఒకసారి ఈ విషయాన్ని మన కోణంలో నుంచి చూస్తే.. మనిషి విద్య, ధనం కోసం భగవంతుడిని ఆరాధిస్తాడు. వాటిని అనుగ్రహించి నారాయణుడు భక్తుడికి సన్నిహితమవుతాడు. ఆయన వెన్నంటి ఉంటే లక్ష్మీదేవి కూడా భక్తుడిని చేరుకుంటుంది. అయితే, తనకు కావాల్సినవన్నీ దక్కిన తరువాత మనిషి భగవంతుడిని మరిచిపోతాడు. అలా నారాయణుడు భక్తుడికి దూరమవుతాయి. అప్పుడు లక్ష్మీదేవి కూడా ఆ భక్తుడిని విడిచి వెళ్లిపోతుంది. నారాయణుడు ఉన్నచోటనే లక్ష్మీదేవి నివాసం. ఎవరైతే నిరంతరం నారాయణుడిని స్మరిస్తూ గడుపుతారో వారి ఇంట లేమి ఉండదు.
సిరి సంకేతం
శ్రీలక్ష్మీ తత్త్వం
శుద్ధసత్త్వ స్వరూపాయా
పద్మాసా పరమాత్మాన
సర్వసంపత్స్వ రూపా సా
తదధిష్టాతృ దేవతా
కాంతాతి దాంతా శాంతా చ సుశీలా సర్వమంగళా
లోభమోహ కామ రోష మదాం
హంకార వర్జితా
ప్రాణతుల్యాభగవత: ప్రేమ పాత్రం ప్రియంవదా
సర్వసస్యాత్మికాదేవీ జీవనోపాయ రూపిణీ
మహాలక్ష్మీ శ్చ వైకుంఠ పతిసేవారతా సతీ
దేవీ భాగవతంలో అమ్మవారి ఐదు శక్తుల గురించీ, లక్ష్మీదేవి గురించి వివరించిన పద్యమిది. లక్ష్మీదేవి సర్వ సంపదల స్వరూపం. సకల సంపదలకు అధిష్టాన దేవత. వైకుంఠంలో మహాలక్ష్మిగా విష్ణుసేవా పరాయణురాలు. పతిభక్తికి ప్రతీక. ‘శ్రీ’ అనేది లక్ష్మీదేవికి అసాధారణమైన పేరు. ఈ నామానికి అర్థాలిలా ఉన్నాయి.
శ్రీయతే పరం భగవతం ఇతి శ్రీ: భగవంతుడిని ఆశ్రయించునది కాబట్టి ఆమె శ్రీ
శ్రీయతే ఇతి శ్రీ: అందరిచేత ఆశ్రయింపబడుతున్నది కాబట్టి శ్రీ
శ్రుణోతి ఇతి శ్రీ: ఆశ్రితుల ప్రార్థన వింటుంది కాబట్టి శ్రీ
శ్రావయతి ఇతి శ్రీ: ఆశ్రితుల ప్రార్థనను స్వామికి వినిపిస్తుంది కాబట్టి శ్రీ
శృణాతి దోషాన్ ఇతి శ్రీ: ఆశ్రితుల దోషాలను పోగొడుతున్నది కాబట్టి శ్రీ
శ్రీణాతి గుణై ఇతి శ్రీ: తన సద్గుణాలతో సర్వత్రా వ్యాపిస్తోంది కాబట్టి శ్రీ
అటువంటి శ్రీ అనే ఈ ధనదేవత విశ్వచైతన్యానికి ప్రతీక. దారిద్య్రం అనే అంధకారాన్ని పారద్రోలే తల్లి.
విలగ్నౌతే పార్శ్వ ద్వయ పరిసరే మత్త కరిణౌ
కరో న్నీతై రంచన్మణి కలశ ముగ్ధాస్య గళితై
నిషించ న్తౌ ముక్తామణిగణ చయై స్త్యాం జలకణై
నమస్యామో దామోదర గృహిణి దారిద్య్ర దళితా
‘రెండు ఏనుగులు రెండువైపులా నిలిచి, తొండాలతో కలశాన్ని ఎత్తిపట్టుకుని ముత్యాలను తలపింపచేసే నీటి బిందువులతో నీకు అభిషేకం చేస్తుంటాయి. అంటువంటి తల్లీ నీకు వందనం’ అని పై శ్లోకానికి అర్థం.
లక్ష్మీదేవికి ఇరువైపులా రెండు ఏనుగులు ఉంటాయి. ఇవి శుభానికి, ఐశ్వర్యానికి సంకేతం. అందుకే రాజులు కూడా తమ సైన్యంలో ఏనుగులకు ప్రాధాన్యత ఇస్తుండే వారు. ఈ విధంగా లక్ష్మీదేవిని అదృష్టానికి, శుభానికి సూచికగా చెబుతుంటారు.
దీపావళి లక్ష్మీ
అనుగ్రహం
పూర్వం మగధ సామ్రాజ్యాన్ని గణపతివర్మ పరిపాలిస్తుండే వాడు. శత్రుదుర్భేధ్యమైన ఆ రాజ్యంలో ప్రజలు సిరిసంపదలతో, భోగభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతుండే వారు. అలా ఉన్నా కూడా రాజా గణపతివర్మ తన మంత్రి శూరసేనుడితో కలిసి మారువేషంలో తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకునే వాడు. ఆ రాజ్యంలో అందరూ ధనికులే అయినా శాంతశీల అనే పేదరాలు ఉండేది. ఆమె భర్త రుద్రసేనుడు మహా బలశాలి. ఓసారి రాజు, మంత్రి మారువేషంలో తిరుగుతుండగా బందిపోటు గుంపు వాళ్లపై దాడి చేసింది. అటుగా వెళ్తున్న రుద్రసేనుడు అది చూసి బందిపోట్లను తరిమికొట్టి రాజును, మంత్రిని రక్షిస్తాడు.
రుద్రసేనుడి తెగువను మెచ్చుకున్న రాజు, ‘ఏం కావాలో కోరుకో’ అంటాడు. ‘తమరు ఆపదలో ఉంటే కాపాడానే కానీ ఏదో ఆశించి మాత్రం కాదు’ అంటాడు రుద్రసేనుడు. అందుకు రాజు సంతోషించి, ‘నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా రా’ అని చెప్పి వెళ్లిపోతాడు. ఇదంతా రుద్రసేనుడు భార్య శాంతశీలకు చెబుతాడు. అప్పుడామెకు ఒక విషయం గుర్తుకువస్తుంది. అదేమిటంటే, కొద్దిరోజుల క్రితం తను కట్టెల కోసం అడవికి వెళ్లినపుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు. ఆయనతో తన పేదరికం గురించి చెప్పినపుడు ఆయన ‘తల్లీ! ఒక విషయం చెబుతాను. శ్రద్ధగా విను. లోకమంతా చీకటిగా, అది కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి, నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒకామె నీ ఇంట్లోంచి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నువ్వామెను అడ్డగించి బయటకు వెళ్తే లోనికి తిరిగి రాకూడదని షరతు పెట్టు. అప్పుడామె నేను లోపల ఉండే వెలుగును భరించలేను. చీకటిలోకి వెళ్లిపోతానంటుంది. ఇంకొకామె పట్టుపీతాంబరాలతో ధగధగా మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి యత్నిస్తుంది. ఆమెను కూడా అడ్డగించి లోపలికి వెళ్తే బయటకు వెళ్లకూడదని షరతు విధించు. అప్పుడామె బయట చీకటిని భరించలేను. లోపలికి వెళ్తానంటుంది. ఆమె ఇంట్లోకి రాగానే నువ్వు ఐశ్వర్యవంతురాలివవుతావు’ అని చెబుతాడు.
మునీశ్వరుడు చెప్పినదంతా శాంతశీలకు గుర్తుకువస్తుంది. వెంటనే ఆమె రాజు వద్దకు వెళ్లి తాను ఎవరో చెప్పి, వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరింట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది. రాజు అలాగేనని చాటింపు వేయిస్తాడు. మునీశ్వరుడు చెప్పినట్టు చేసి శాంతశీల ఐశ్వర్యవంతురాలవుతుంది. కానీ, శుక్రవారం ఎవరూ దీపం పెట్టకుండా రాజాజ్ఞ వేయించినందుకు బాధపడుతుంటుంది. అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా, దేవి ప్రసన్నురాలై ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో ఎవరు దీపం పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తాను అని వరమిస్తుంది.
శ్రీలక్ష్మీ అష్టకం
(ఇంద్రకృతం)
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ ర్నమోస్తుతే
నమస్తే గరుఢారూఢే డోలాసుర భయంకరి
సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ ర్నమోస్తుతే
సర్వజ్ఞే సర్వవరదే సర్దదుష్ట భయంకరి
సర్వదు:ఖహరే దేవీ మహాలక్ష్మీ ర్నమోస్తుతే
సిద్ధిబుద్ధిప్రదే దేవీ భుక్తిముక్తి ప్రదాయిని
మంత్రమూర్తే సదా దేవీ మహాలక్ష్మీ ర్నమోస్తుతే
ఆద్యంతరహితే దేవీ ఆదిశక్తే మహేశ్వరి
యోజజ్ఞేయోగసంభూతే మహాలక్ష్మీ ర్నమోస్తుతే
స్థూలసూక్ష్మే మహారౌద్రే మహాశక్తే మహోదరే
మహాపాపహరే దేవీ మహాలక్ష్మీ ర్నమోస్తుతే
పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి
పరమేశి జగన్మాతర్ మహాలక్ష్మీ ర్నమోస్తుతే
శ్వేతాంభరధరే దేవి నానాలంకార భూషితే
జగత్థ్సితే జగన్మాతర్ మహాలక్ష్మీ ర్నమోస్తుతే
మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం య:పఠే ద్భక్తిమాన్నర:
సర్వసిద్ధి మావాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్
ద్వికాలం య: పఠే న్నిత్యం ధనధాన్యసమన్వితం
త్రికాలం య: పఠే న్నిత్యం మహాశత్రు వినాశనం
మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా
శ్రీ మహాలక్ష్మీ గాయతి
ఓం మహాదేవ్యైచ విద్మహే
విష్ణుపత్న్యై చ ధీమహీ
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్
Review దీపావళి లక్ష్మీ.. రావమ్మా మా ఇంటికి.