నేడే నా సీమోల్లంఘనం

షిర్డీ సాయిబాబా దేహత్యాగం చేసి ఈ దసరా నాటికి నూట మూడు సంవత్సరాలు. విజయదశమి (దసరా) నాడే బాబా దేహత్యాగం చేశారు. అందుకే ప్రతి సంవత్సరం దసరా నాడు బాబా పుణ్యతిథిగా భావించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు భక్తులు. షిర్డీలో ఈ సందర్భాన్ని పురస్కరించిన విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. 1918వ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, అక్టోబరు 15వ తేదీ, మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సాయిబాబా భౌతిక శరీరాన్ని విడిచారు. పుణ్యతిథి వేళ బాబా భౌతికంగా సమాధి చెందిన లీల, తాను దేహత్యాగం చేయనున్న సంగతిని మహా సమాధి పొందడానికి రెండు సంవత్సరాల ముందే భక్తులకు వెల్లడిరచిన వైనం గురించి ఈ సందర్భంలో తెలుసుకోవడం పుణ్యప్రదం.

1916 సంవత్సరం, దసరా నాటి సాయంకాలం షిర్డీ గ్రామంలో, అందునా ద్వారకామాయి వద్ద ఒక విధమైన ఉద్విగ్నభరితమైన వాతావరణం నెలకొని ఉంది. గ్రామంలోని వారందరూ సీమోల్లంఘనం (గ్రామ సరిహద్దును దాటడం) చేసి తిరిగి వస్తుండగా, సాయిబాబా హఠాత్తుగా కోపోద్రిక్తులయ్యారు. తలగుడ్డ, కఫనీ, లంగోటీ తీసి చించివేశారు. వాటిని తన ఎదుట ఉజ్వలంగా మండుతూ ఉన్న ధునిలోకి విసిరివేశారు. ధునిలోని మంటలు మరింత ప్రజ్వలమయ్యాయి. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించారు. కొంతసేపటికి ధైర్యం చేసి భాగోజీ శిందే అనే భక్తుడు బాబా వద్దకు వెళ్లాడు. నెమ్మదిగా ఆయనకు లంగోటీని చుట్టి ఇలా అన్నాడు`

1916 సంవత్సరం, దసరా నాటి సాయంకాలం షిర్డీ గ్రామంలో, అందునా ద్వారకామాయి వద్ద ఒక విధమైన ఉద్విగ్నభరితమైన వాతావరణం నెలకొని ఉంది. గ్రామంలోని వారందరూ సీమోల్లంఘనం (గ్రామ సరిహద్దును దాటడం) చేసి తిరిగి వస్తుండగా, సాయిబాబా హఠాత్తుగా కోపోద్రిక్తులయ్యారు. తలగుడ్డ, కఫనీ, లంగోటీ తీసి చించివేశారు. వాటిని తన ఎదుట ఉజ్వలంగా మండుతూ ఉన్న ధునిలోకి విసిరివేశారు. ధునిలోని మంటలు మరింత ప్రజ్వలమయ్యాయి. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించారు. కొంతసేపటికి ధైర్యం చేసి భాగోజీ శిందే అనే భక్తుడు బాబా వద్దకు వెళ్లాడు. నెమ్మదిగా ఆయనకు లంగోటీని చుట్టి ఇలా అన్నాడు`

‘బాబా! సీమోల్లంఘనం నాడు ఇదంతా ఏమిటి?’
‘ఈ రోజు నా సీమోల్లంఘనం’ అంటూ బాబా మరింత ఆగ్రహంతో సటకాతో నేలపై గట్టిగా కొట్టారు.
బాబా ఆ రోజు రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఒక గంట తరువాత సాధారణ స్థితికి వచ్చారు. దుస్తులు వేసుకుని, చావడి ఉత్సవానికి సిద్ధమయ్యారు. ఈ విధంగా సాయిబాబా తాము దసరా నాడు మహా సమాధి చెందుతామని సూచనప్రాయంగా భక్తులను తెలియ చేశారు. కానీ, అప్పట్లో ఈ విషయం ఎవరికీ అర్థం కాలేదు. ఎవరూ బాబా అంతరార్థాన్ని గ్రహించలేదు. అలాగే, దిగువ విధంగా కూడా సాయిబాబా తాను భౌతిక దేహాన్ని త్వరలోనే విడువనున్నట్టు మరో సూచన కూడా చేశారు.

సాయిబాబా భక్తుడైన రామచంద్ర పాటీలు అప్పటికి తీవ్రంగా జబ్బుపడ్డాడు. ఎన్ని ఔషధాలు వాడినా అవేమీ గుణమివ్వలేదు. ఎంతమంది వైద్యులకు చూపించుకున్నా నయం కాలేదు. ఒకనాడు నడిరేయి సాయిబాబా రామచంద్ర పాటీలుకు ప్రత్యక్షమయ్యారు. అతనితో ఇలా అన్నారు` ‘నీ చావుచీటీ తీసివేశాను. త్వరలోనే బాగుపడతావు. లేచి నిలుచుంటావు. కానీ తాత్యాకోతే పాటీలు గురించి సంశయిస్తున్నాయి. అతను శక సంవత్సరం 1840 (1918) విజయదశమి నాడు మరణిస్తాడు. ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకు. ముఖ్యంగా వాడి (తాత్యాకోతే పాటీలు)కి కూడా తెలియనివ్వకు’. బాబా మాటలతో రామచంద్ర పాటీలు ఖిన్నుడయ్యాడు. తాత్యాకోతే పాటీలు గురించి బాబా చెప్పిన పలుకులు విని బెంగపెట్టుకున్నాడు. కాలం వేగంగా కదిలిపోయింది. 1918 సంవత్సరం భాద్రపద మాసం ముగిసింది. ఆశ్వయుజ మాసం సమీపించసాగింది. సాయిబాబా చెప్పిన విధంగానే తాత్యాకోతే పాటీలు జబ్బుపడ్డాడు. బాబా కూడా సరిగ్గా అదే సమయంలో జ్వరంతో ఉన్నారు. విజయదశమి రానే వచ్చింది. తాత్యా నాడి మరింత బలహీనపడిరది. అతను త్వరలోనే ప్రాణం విడుస్తాడని అందరూ అనుకోసాగారు. ఇంతలో ఎవరూ ఊహించని విధంగా ఒక గొప్ప వింత, ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఉన్నట్టుండి తాత్యాకోతే పాటీలు కోలుకున్నాడు. లేచి నిల్చున్నాడు. అతని ప్రాణం నిలిచింది. అతనికి మరణం తప్పింది. అతనికి బదులుగా ఆ సమయంలో సాయిబాబా దేహ త్యాగం చేశారు. అంటే, సాయిబాబా తాత్యాకోతే పాటీలును బతికించడం కోసం తన దేహాన్ని తాగ్యం చేశారని అందరూ అనుకున్నారు. వారిద్దరు వారిలో వారు మరణం మార్చుకున్నట్టు కనిపించింది. సాయిబాబా తన ప్రాణాన్ని తాత్యా కోసం అర్పించారని జనం అనుకున్నారు. సాయిబాబా ఎందుకు అలా చేశారో ఆయనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే, భగవంతుని

బాబా మాటలతో రామచంద్ర పాటీలు ఖిన్నుడయ్యాడు. తాత్యాకోతే పాటీలు గురించి బాబా చెప్పిన పలుకులు విని బెంగపెట్టుకున్నాడు. కాలం వేగంగా కదిలిపోయింది. 1918 సంవత్సరం భాద్రపద మాసం ముగిసింది. ఆశ్వయుజ మాసం సమీపించసాగింది. సాయిబాబా చెప్పిన విధంగానే తాత్యాకోతే పాటీలు జబ్బుపడ్డాడు. బాబా కూడా సరిగ్గా అదే సమయంలో జ్వరంతో ఉన్నారు. విజయదశమి రానే వచ్చింది. తాత్యా నాడి మరింత బలహీనపడిరది. అతను త్వరలోనే ప్రాణం విడుస్తాడని అందరూ అనుకోసాగారు. ఇంతలో ఎవరూ ఊహించని విధంగా ఒక గొప్ప వింత, ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఉన్నట్టుండి తాత్యాకోతే పాటీలు కోలుకున్నాడు. లేచి నిల్చున్నాడు. అతని ప్రాణం నిలిచింది. అతనికి మరణం తప్పింది. అతనికి బదులుగా ఆ సమయంలో సాయిబాబా దేహ త్యాగం చేశారు. అంటే, సాయిబాబా తాత్యాకోతే పాటీలును బతికించడం కోసం తన దేహాన్ని తాగ్యం చేశారని అందరూ అనుకున్నారు. వారిద్దరు వారిలో వారు మరణం మార్చుకున్నట్టు కనిపించింది. సాయిబాబా తన ప్రాణాన్ని తాత్యా కోసం అర్పించారని జనం అనుకున్నారు. సాయిబాబా ఎందుకు అలా చేశారో ఆయనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే, భగవంతుని కార్యాలు, చర్యలు మనవంటి సామాన్య జనానికి, భక్తులకు అవగతం కావు. భక్తుల కోసం భగవంతుడు ఎంతటి త్యాగం చేస్తాడో అనేందుకు తాత్యా కోసం బాబా చేసిన దేహ త్యాగమే నిదర్శనం. సాయిబాబా కృత్యములు అగోచరం. ఈ విధంగా సాయిబాబా తమ సమాధిని గురించి ముందుగానే భక్తులకు సూచించారు.

ఆ మర్నాడు అక్టోబరు 16వ తేదీన, పండరీపురంలో దాసగణుకు బాబా స్వప్నంలో సాక్షాత్కరించి ఇలా అన్నారు` ‘దాసగణూ! మసీదు కూలిపోయింది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టారు. కనుక ఆ స్థలాన్ని విడిచి పెట్టాను. ఈ సంగతి నీకు తెలియ చేయడానికే ఇక్కడకు వచ్చాను. వెంటనే అక్కడకు వెళ్లు. నన్ను సరిపడినన్ని పుష్పాలతో కప్పు’. కలలో బాబా పలికిన పలుకులతో దాసగణు గుండె ఆగినంత పనైంది. ఏదో కీడు జరిగిందని తలిచాడు. అంతలో షిర్డీ నుంచి వచ్చిన ఉత్తరం ద్వారా కూడా దాసగణుకి బాబా మహా సమాధి చెందారనే విషయం తెలిసింది. అతను వెంటనే తన శిష్యులతో కలిసి షిర్డీ వెళ్లాడు. భజన, కీర్తనలు ప్రారంభించాడు. సాయిబాబా భౌతిక దేహాన్ని సమాధి చేయడానికి ముందు అతను రోజంతా భగవన్నామ స్మరణ చేశాడు. భగవన్నామ స్మరణ చేస్తూనే ఒక చక్కని పువ్వుల హారాన్ని స్వయంగా గుచ్చి దానిని సాయిబాబా సమాధిపై వేశాడు. బాబా పేరుతో అన్నదానం చేశాడు.

దేహత్యాగానికి రెండ్రోజుల ముందే..

మిక్కిలి జాగరూకత, పూర్ణ చైతన్యం కలిగి ఉండే బాబా అవసాన కాలంలోనూ తగిన జాగ్రత్త పడ్డారు. విజయదశమికి రెండు మూడు రోజుల ముందు నుంచీ బాబా గ్రామం బయటకు వెళ్లడం, భిక్షాటనం చేయడం మొదలైనవి మాని మసీదులోనే కూర్చుని ఉండేవారు. చివరి వరకు బాబా చైతన్యంతో ఉండి, అందరినీ ధైర్యంగా ఉండాలని చెప్పి సలహానిచ్చారు. తాము ఎప్పుడు శరీరాన్ని విడుస్తారనే విషయాన్ని ఎవరికీ తెలియనివ్వలేదు. తన భక్తులపై గల ప్రేమానురాగాలకు తగుల్కొనకుండా ఉండేందుకు వారందరినీ అక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నారు. రోజూ కాకాసాహెబు దీక్షిత్‌, శ్రీమాన్‌ బూటీ.. ప్రియ భక్తులైన వీరంతా సాయిబాబాతో కలిసి మసీదులో భోజనం చేస్తుండే వారు. ఆనాడు (1918, అక్టోబరు 15వ తేదీ) హారతి ఇచ్చిన పిమ్మట వారిని తమ తమ బసలకు వెళ్లిపోవాలని, అక్కడే భోజనం చేయాలని బాబా సూచించారు. వారికి బాబాను విడిచిపెట్టి వెళ్లడం ఇష్టం లేకపోయింది. కానీ, సాయిబాబా మాటను జవదాట లేరు కదా!. మనసులో ఇష్టం లేకున్నా వారు పోలేక పోలేక మసీదును విడిచి పెట్టి వెళ్లారు. లక్ష్మీబాయి శిందే, భాగోజీ శిందే, బయ్యాజీ, లక్ష్మణ్‌ బాలాషింపీ, నానాసాహెబు నిమోన్‌కర్‌ మాత్రం సాయిబాబా వద్దనే, ఆయననే అంటిపెట్టుకుని ఉన్నారు. సాయిబాబా స్థితి అపాయకరంగా ఉందని, ఏదో జరగబోతోందని వారంతా ఆందోళనతో ఉన్నారు. కనుక వారు సాయిబాబాను విడిచి పెట్టలేదు. మసీదు కిందుగా ఉన్న మెట్లపై

రోజూ కాకాసాహెబు దీక్షిత్‌, శ్రీమాన్‌ బూటీ.. ప్రియ భక్తులైన వీరంతా సాయిబాబాతో కలిసి మసీదులో భోజనం చేస్తుండే వారు. ఆనాడు (1918, అక్టోబరు 15వ తేదీ) హారతి ఇచ్చిన పిమ్మట వారిని తమ తమ బసలకు వెళ్లిపోవాలని, అక్కడే భోజనం చేయాలని బాబా సూచించారు. వారికి బాబాను విడిచిపెట్టి వెళ్లడం ఇష్టం లేకపోయింది. కానీ, సాయిబాబా మాటను జవదాట లేరు కదా!. మనసులో ఇష్టం లేకున్నా వారు పోలేక పోలేక మసీదును విడిచి పెట్టి వెళ్లారు. లక్ష్మీబాయి శిందే, భాగోజీ శిందే, బయ్యాజీ, లక్ష్మణ్‌ బాలాషింపీ, నానాసాహెబు నిమోన్‌కర్‌ మాత్రం సాయిబాబా వద్దనే, ఆయననే అంటిపెట్టుకుని ఉన్నారు. సాయిబాబా స్థితి అపాయకరంగా ఉందని, ఏదో జరగబోతోందని వారంతా ఆందోళనతో ఉన్నారు. కనుక వారు సాయిబాబాను విడిచి పెట్టలేదు. మసీదు కిందుగా ఉన్న మెట్లపై మాధవరావు దేశ్‌పాండే (శ్యామా) కూర్చుని ఉన్నాడు. అంతలో బాబా తన భక్తురాలైన లక్ష్మీబాయి శిందేకు తొమ్మిది (9) రూపాయలను దానం చేశారు. అనంతరం తనకు ఆ స్థలం (మసీదు) బాగా లేదని, అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోనికి తీసుకుని వెళ్లాలని, అక్కడైతే తనకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. ఈ తుది పలుకులు చెబుతూనే సాయిబాబా బయ్యాజీ అప్పాకోతేపై ఒరిగి ప్రాణాలు విడిచారు. బాబా ఇక లేరనే విషయాన్ని భాగోజీ కనిపెట్టాడు. ఈ సంగతిని నానాసాహెబు నిమోన్‌కర్‌కు చెప్పాడు. నానాసాహెబు వెంటనే నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోశాడు. అవి బయటకు వచ్చేశాయి.
నానాసాహెబు బిగ్గరగా` ‘నా దేవా!’ అని అరిచాడు.

అంతలో సాయిబాబా కళ్లు తెరిచి మెల్లగా ‘ఆ’ అన్నారు.
అంతలో భోజనాలకు వెళ్లిన వారికి వారు భోజనాలు పూర్తి చేయకముందే సాయిబాబా తమ భౌతిక దేహాన్ని విడిచారనే వార్త అందింది. భోజనాలను మధ్యలోనే విడిచి అందరూ మసీదుకు పరుగెత్తుకుని వచ్చారు. బయ్యాజీ అప్పాకోతేపై సాయిబాబా దేహం ఒరిగి ఉంది. బాబా నేలపై కానీ, తమ గద్దెపై కానీ పడలేదు. తమ స్థలంలోనే ప్రశాంతంగా కూర్చుని తమ చేతితో దానం చేస్తూ శరీరాన్ని విడిచారు. యోగులు శరీరం ధరించి ఏదో పనిపై భూలోకానికి వస్తారు. అది నెరవేరిన అనంతరం ఎంత నెమ్మదిగా, సులభంగా అవతరిస్తారో అంత శాంతంగా వెళ్లిపోతారు.

సాయిబాబా తమ భౌతిక శరీరాన్ని విడిచి పెట్టారనే విషయం తేలిపోయింది. ఈ విషయం షిర్డీ అంతటా వ్యాపించింది. సాయిబాబా సమాధి చెందారనే విషయం గ్రామంలో కార్చిచ్చులా వ్యాపించింది. ప్రజలందరూ, స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు వెళ్లి రోదించసాగారు. కొందరు బిగ్గరగా రోదించారు. కొందరు వీధులలో దిక్కులేని వారుగా తిరుగుతూ విలపించారు. ఇంకొందరు బాబా లేరనే విషయాన్ని తట్టుకోలేక తెలివి తప్పి పడిపోయారు. అందరి కళ్ల నుంచి నీళ్లు కాలువల్లా పారాయి. అందరూ విచారగ్రస్తులయ్యారు. కొందరు సాయిబాబా చెప్పిన మాటలను ఆ సమయంలో జ్ఞాపకం చేసుకోసాగారు. మునుముందు ఎనిమిది సంవత్సరాల బాలునిగా ప్రత్యక్షమవుతానని బాబా తమ భక్తులతో చెప్పగా తాను ఒకసారి విన్నానని ఒకరు అన్నారు. ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక ఎవరూ సందేహించ వలసిన అవసరం లేదు. ఎందుకంటే` కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు ఈ కార్యాన్ని ఒనర్చారు. సుందర శరీరంతో, ఆయుధాలు గల చతుర్భుజాలతో, శ్రీకృష్ణుడు దేవకీ దేవికి కారాగారంలో ఎనిమిదేళ్ల బాలునిగానే ప్రత్యక్షమయ్యాడు. ఆ అవతారంలో శ్రీకృష్ణుడు భూమి భారాన్ని తగ్గించాడు. ఈ అవతారం (సాయిబాబా) భక్తులను ఉద్ధరించడానికి ఉద్భవించింది. కనుక సంశయించ కారణం ఏముంది? యోగుల జాడలు అగమ్య గోచరం. సాయిబాబాకు తన భక్తులతో సంబంధం ఈ యొక్క జన్మ తోడిదే కాదు. అది గడిచిన డెబ్బయి రెండు జన్మల సంబంధం. ఇటువంటి ప్రేమ బంధాలు కలిగించిన ఆ మహారాజు (సాయిబాబా) ఎక్కడికో పర్యటనకు వెళ్లినట్టు అనిపించడం వల్ల ఆయన శీఘ్రంగానే తిరిగి వస్తారనే ఈనాటికీ భక్తులకు దృఢ విశ్వాసం.

Review నేడే నా సీమోల్లంఘనం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top