రాములోరు గెలిచారు!

రాముడు పుట్టి పెరిగిన నేల.. రాముడేలిన భూమి.. కొన్ని కారణాలతో వివాదాస్పదమైంది. ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపమైన రాముడు చివరకు తన భూమి యాజమాన్య హక్కుల కోసం న్యాయబద్ధమైన పోరాటం జరపాల్సి వచ్చింది. ఆ వివాదాస్పద భూమిపై ఆయన పేరుపైనే వ్యాజ్యం దాఖలైంది. సుదీర్ఘ కాలం న్యాయ విచారణ కొనసాగింది. చివరకు ధర్మం గెలిచింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలం రాముడిదేనంటూ భారత అత్యున్నత న్యాయస్థానం ‘పట్టా’భిషేకం చేసింది. జాతి యావత్తూ ఉత్కంఠతతో ఎదురు చూసిన ఈ తీర్పు.. ఒక దీర్ఘ కాలిక వివాదానికి తెరదించింది.
అయోధ్య రామజన్మభూమి – బాబ్రీ మసీదు స్థల వివాదంపై భారత అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక, ఏకగ్రీవ తీర్పు ఇచ్చింది. అయితే ఈ వివాదానికి సంబంధించి ఎన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి? ఎంతమంది కక్షిదారులు ఉన్నారు? ఆయా వ్యాజ్యాల్లో కక్షిదారులకు ఏ తీర్పు దక్కిందంటే.. అయోధ్య వివాదంపై అయిదు ప్రధాన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటికి సంబంధించి 14 మంది కక్షిదారులు ఉన్నారు. ఆ వ్యాజ్యాల వివరాలు..
1. నిర్మోహి అఖాడా
తీర్పు హిందూ కక్షిదారులకు అనుకూలంగా వస్తే.. స్థలం హక్కులు, ప్రతిపాదిత రామ మందిరంలో పూజా కైంకర్యాల, మందిర నిర్మాణం పూర్తయ్యాక నిర్వహణ హక్కులను మాకే ఇవ్వాలి. అలహాబాద్‍ హైకోర్టు తీర్పును సమర్థిస్తే వివాదాస్పద స్థలంలో ముస్లింలు నిర్మాణాలు చేపట్టవద్దు. అక్కడ వారికి లభించే స్థలాన్ని మందిరాన్ని నిర్మించుకోవడానికి లీజుకు ఇచ్చేలా ఆదేశించాలి. ఆవరణకు వెలుపల ముస్లింలకు భూమి ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి.
సుప్రీంకోర్టు తీర్పు: వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా చేయాలన్న అలహాబాద్‍ హైకోర్టు తీర్పు సరైంది కాదు. నిర్మోహి అఖాడాకు స్థల యాజమాన్య హక్కులు ఉండవు. ఆలయ నిర్మాణానికి ఏర్పాటు చేయనున్న ట్రస్టులో మాత్రం అఖాడాకు ప్రభుత్వం సముచిత ప్రాధాన్యం కల్పించాలి.
2. షియా వక్ఫ్ బోర్డు
అయోధ్యలోని స్థలానికి మేమే హక్కుదారులం. అక్కడ రామాలయం నిర్మించాలి. అలహాబాద్‍ హైకోర్టు తీర్పులో సున్నీ వక్ఫ్ బోర్డుకు ఇచ్చిన భూమిని హిందూ దక్షిదారులకే కేటాయించాలి.
సుప్రీంకోర్టు తీర్పు: షియా వక్ఫ్ బోర్డు కోరిన యాజమాన్య హక్కులను ఏకాభిప్రాయంతో తిరస్కరిస్తున్నాం.
3. సున్నీ వక్ఫ్ బోర్డు
1992, డిసెంబరు 6వ తేదీ నాటికి బాబ్రీ మసీదు ఎలా ఉండేదో అలాగే కొత్త మసీదును పునర్నిర్మించాలి.
సుప్రీంకోర్టు తీర్పు: మసీదు నిర్మాణానికి అయోధ్యలోని ప్రాధాన్య ప్రాంతంలో ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయిస్తుంది.
4. రామ్‍లల్లా విరాజ్‍మాన్‍
మొత్తం వివాదాస్పద ప్రాంతానికి రామ్‍లల్లా (బాల రాముడు) మాత్రమే నిజమైన వారసుడు. ఈ ప్రాంతంలోని ఏ భాగాన్ని కూడా నిర్మోహి అఖాడాకు, ముస్లిం కక్షిదారులకు కేటాయించవద్దు.
సుప్రీంకోర్టు తీర్పు: అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతానికి రామ్‍లల్లానే అసలైన హక్కుదారు. కేంద్ర ప్రభుత్వం రామాలయ నిర్మాణానికి ఒక ట్రస్టును ఏర్పాటు చేసి, 2.77 ఎకరాల స్థలాన్ని దానికే అప్పగించాలి. ట్రస్టు నిర్వహణకు అధికారులనూ నియమించాలి.
5. గోపాల్‍సింగ్‍ విశారద్‍
మసీదు నిర్మాణానికి ముందే అక్కడున్న ఆలయంలో మా వంశస్తులే తరతరాలుగా పూజలు చేస్తూ వచ్చారు. ప్రతిపాదిత మందిరంలో పూజలు చేసే రాజ్యాంగ హక్కు మాకే ఉంటుంది.
సుప్రీంకోర్టు తీర్పు: గోపాల్‍ విశారద్‍ కోరిన వారసత్వ పూజా హక్కులనేవి.. వారి నిర్వహణ సామర్థ్యం, శాంతిభద్రతలను కాపాడే తత్వం అనే అంశాల పరిధిలోనిది. వీటిని సంబంధిత అధికారులు నిర్ణయిస్తారు.

భారత దేశ చరిత్రలో మేలి మలుపు అనదగిన తీర్పు వెలువడింది. శతాబ్దాల నాటి సమస్యకు సామరస్యంగా భారత సర్వోన్నత న్యాయస్థానం ముగింపు పలికింది. భారత దేశ లౌకిక వాదానికి, సిద్ధాంతాలకు, భిన్నత్వ భావనలకు రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదానికి 2019, నవంబరు 9న శాశ్వతంగా తెరపడింది. వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. దేశమంతా ఈ తీర్పును స్వాగతించింది. అన్ని పార్టీలు న్యాయ నిర్ణయాన్ని గౌరవించాయి. ‘ఇది మత విశ్వాసాలో, మరొకటో ఆధారంగా కాకుండా స్థిరాస్థికి సంబంధించిన వివాదంగానే పరిగణించాం. విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా కాకుండా సాక్ష్యాల ప్రాతిపదికన కేసును పరిష్కరించాం’ అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రకటించింది.
అయోధ్యలోని రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదం దేశాన్ని మత ప్రాతిపదికన నిలువునా చీల్చింది. రామ మందిర నిర్మాణమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ.. ప్రార్థన మందిరమే ధ్యేయంగా హిందూయేతర సంస్థలు ఈ స్థల వివాదంపై శతాబ్దాలుగా పోరాడుతూ వచ్చాయి. ఈ వివాదంపై నాలుగు దావాలు దాఖలయ్యాయి. వీటిని విచారించిన అలహాబాద్‍ హైకోర్టు.. వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‍ లల్లాకు సమానంగా పంచాలని 2010లో తీర్పునిచ్చింది. దీన్ని సవాల్‍ చేస్తూ సుప్రీంకోర్టులో 14 అప్పీళ్లు దాఖలయ్యాయి. వరుసగా 40 రోజుల పాటు ధర్మాసనం వీటిని విచారించింది. భారత సర్వోన్నత న్యాయస్థాన చరిత్రలో అయోధ్య కేసు రెండో సుదీర్ఘ విచారణగా నిలిచింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‍ రంజన్‍ గొగోయ్‍ నవంబర్‍ 17న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో.. సెలవు రోజైనప్పటికీ నవంబరు 9న ధర్మాసనం తన తీర్పును వెలువరించింది.
తీర్పులో ఏముంది?
ఐదుగురు సభ్యుల ధర్మాసనం అయోధ్య తీర్పు సారాంశాన్ని 1045 పేజీలలో పొందుపరిచింది. దీనిని 45 నిమిషాల పాటు రంజన్‍ గొగోయ్‍ చదివి వినిపించారు. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‍ ఎస్‍ఏ బాబ్డే, జస్టిస్‍ డీవై చంద్రచూడ్‍, జస్టిస్‍ అశోక్‍ భూషన్‍, జస్టిస్‍ అబ్దుల్‍ నజీర్‍ సభ్యులుగా ఉన్నారు.
ముఖ్యంగా వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభజించి పంచాలన్న అలహాబాద్‍ హైకోర్టు తీర్పు సరైంది కాదని ధర్మాసనం వ్యాఖ్యా నించింది. వివాదాస్పద స్థలాన్ని విభజించడం వల్ల ఎవరి ప్రయోజనాలూ నెరరవని, పైగా శాంతిభద్రతల పరిరక్షణకు ఏమాత్రం దోహదపడదని పేర్కొంది. పిటిషనర్లు దాఖలు చేసిన అభ్యర్థనలకు, హైకోర్టు ఇచ్చిన తీర్పుకు ఎలాంటి సంబంధం లేదని తేల్చింది. నిర్మోహీ అఖాడా వేసిన దావాకు కాలదోషం పట్టిందంటూ దానిని కొట్టివేసింది. సున్నీ సెంట్రల్‍ వక్ఫ్ బోర్డు, రామ్‍లల్లా విరాజ్‍మాన్‍ దావాలకు మాత్రం ఈ దోషం పట్టలేదని వ్యాఖ్యానించింది.
రాముడిదే ‘అయోధ్య’
రామ్‍లల్లాకే వివాదాస్పద 2.77 ఎకరాల స్థలం చెందుతుందనడానికి అక్కడ జరిగే పూజలు, ప్రార్థన మందిరాలను సుప్రీంకోర్టు పరిగణలోనికి తీసుకుంది. బాబ్రీ మసీదు గుమ్మటాల వెలుపలి భాగంలో హిందువుల పూజలు జరిగేవనడానికి గట్టి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్న ధర్మాసనం.. 1857లో గోడ నిర్మాణం జరిగినప్పటికీ పూజలు ఆగలేదని, దీన్ని బట్టి నిర్మాణం వెలుపలి భాగం హిందువుల అధీనంలో ఉన్నట్టు తెలుస్తోందని వ్యాఖ్యానించింది. 16వ శతాబ్దం నుంచి 1857 వరకు నిర్మాణం లోపలి భాగం పూర్తిగా తమ అధీనంలోనే ఉందనడానికి ముస్లింలు ఎటువంటి ఆధారాలను సమర్పించలేదని పేర్కొంది.
పురావస్తు ఆధారాలే కీలకం
సుప్రీంకోర్టు తన తీర్పునకు పురావస్తు శాఖ అందచేసిన ఆధారాలనే కీలకంగా తీసుకుంది. బాబ్రీ మసీదు కింద హిందూ నిర్మాణ శిథిలాలున్నట్టు పురావస్తు శాఖ తవ్వకాల్లో స్పష్టమైంది. ‘సదరు ఆధారాలను బట్టి అక్కడి హిందూ నిర్మాణం క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందినదని తేలింది. ఆ నిర్మాణ గోడలను ఆధారంగా చేసుకునే మసీదును నిర్మించారు. అప్పటి హిందూ నిర్మాణానికి 17 వరుసల్లో ఐదేసి చొప్పున 85 స్తంభాలున్నాయి. మసీదు దిగువన 8-10వ శతాబ్దం నాటి వలయాకార ఆలయ ఆనవాళ్లు కూడా కనిపించాయి. అది ఇస్లాంకు సంబంధించిన నిర్మాణం కాదు’ అని పురావస్తు శాఖ నివేదికలో ఉన్న అంశాలను బట్టి వివాదాస్పద స్థలం కచ్చితంగా రామ్‍లల్లాకే చెందుతుందని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.
అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై సుప్రీం కోర్టు ఎవరికీ నేరుగా హక్కులు కల్పించ లేదు. ఆ భూమిని రిసీవర్‍కు అప్పగిస్తే.. ఆయన ట్రస్టుకు అప్పగించాలని సూచించింది. ‘బాబ్రీ మసీదు గుమ్మటాల కింది భాగం, గుమ్మటాల వెలుపలి భాగం సహా వివాదాస్పద ప్రాంతం మొత్తం రామ్‍లల్లా విరాజ్‍మాన్‍కే దక్కుతుంది. మూడు నెలల్లోగా కేంద్ర ప్రభుత్వం ఒక ట్రస్టును ఏర్పాటు చేసి, దానికి సదరు స్థలాన్ని అప్పగించాలి. ఆ ట్రస్టు ద్వారానే ఆలయ నిర్మాణం జరగాలి. ట్రస్టులో నిర్మోహి అఖాడాకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి. ట్రస్టుకు వివాదాస్పద భూమిని అప్ప గించడం, సున్నీ స్రె వక్ఫ్ బోర్డుకు ఐదెకరాల స్థలం కేటాయింపు ఏకకాలంలో జరగాలి. తమకు కేటాయించిన భూమిలో మసీదు, ఇతర సౌకర్యాలు కల్పించుకోవడానికి సున్నీ సెంట్రల్‍ వక్ఫ్ బోర్డుకు అన్ని అధికారాలు ఉంటాయి’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో వివరించింది.
ఆ స్థలానికి రాముడే యజమాని
‘విచారణలో ఉన్న స్థలం రామజన్మభూమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, మేం నమ్మకాలు, విశ్వాసాల ఆధారంగా తీర్పు నివ్వడం లేదు. చట్టపరమైన ఆధారాలనే పరిగణన లోకి తీసుకుంటున్నాం. వివాదాస్పద ప్రాంతంలో రాముడు జన్మించాడనేది హిందువుల విశ్వాసం. ముస్లింలు కూడా ఆ ప్రాంతం గురించి అదే చెబుతారు. హిందువుల విశ్వాసం నిర్వి వాదాంశం. అక్కడ సీతా రోసోయీ, రామ్‍ ఛబుత్రా, బంఢార్‍ గృహ్‍ ఉండటం ఆ ప్రాంత మతపరమైన వాస్తవాలకు దర్పణం పడుతోంది. ఆ స్థలానికి లాంఛనప్రాయంగా రాముడే యజ మాని. అయితే, మాకు నమ్మకాలు, విశ్వాసాలతో సంబంధం లేదు. సున్నీ సెంట్రల్‍ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‍లల్లా విరాజ్‍మాన్‍ అనే మూడు పక్షాల మధ్య స్థల వివాదానికి సంబం ధించిన కేసుగానే దీనిని పరిగణించి తీర్పు నిస్తున్నాం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
మసీదు కూల్చివేత చట్ట విరుద్ధం
‘ముస్లింల ప్రార్థన స్థలంలో హిందూ దేవుళ్ల విగ్రహాలను ఉంచడం, బాబ్రీ కట్టడాన్ని కూల్చి వేయడం అంటే ముస్లింలకు ప్రార్థన చేసుకునే అవకాశాన్ని దూరం చేయడమే. వివాదాస్పద భూమి ఎవరి అధీనంలో ఉందన్న అంశంపై ముస్లింలతో పోలిస్తే హిందువుల ఆధారాలు మెరుగ్గా ఉన్నాయి. అయితే, 1949, డిసెంబరు 22 అర్ధరాత్రి విగ్రహాలను అక్కడ పెట్టడం ద్వారా ముస్లింలకు ప్రార్థనలకు అవకాశం లేకుండా చేశారు. 1949, డిసెంబరు 16న చివరిసారిగా అక్కడ ప్రార్థనలు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. కర సేవకులు 1992, డిసెంబరు 6న ఆ మసీ దును అక్రమంగా కూల్చేశారు. ఇది చట్ట విరుద్ధం. ఆ తప్పును సరిదిద్దాలి. ఒక లౌకిక దేశంలో అనుసరించడానికి వీల్లేని విధానం వల్ల మసీదును కోల్పోయిన ముస్లింలకు దక్కాల్సిన హక్కులను కోర్టు విస్మరిస్తే న్యాయం చేకూర్చినట్టు కాదు. సహనం, పరస్పర సహజీవనం వల్ల మన దేశ లౌకిక నిబద్ధతకు బలం చేకూరుతోంది. ఇందుకోసం రాజ్యాంగంలోని 142వ అధికరణం కింద లభించిన అధికారాలను ఉపయోగించు కుంటున్నాం. నిజానికి వివాదాస్పద ప్రాంతం 1500 చదరపు గజాల మేర ఉంది. ప్రార్థన స్థలాన్ని చట్ట విరుద్ధంగా కూల్చివేయడం వల్ల ముస్లిం సమాజానికి ఇవ్వాల్సిన పరిహారం ఎలా ఉండాలన్న దానిపై ఆలోచన చేశాం. సున్నీ సెంట్రల్‍ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలో ఐదు ఎక రాలను ఇవ్వాలని ఆదేశిస్తున్నాం’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం తన సుదీర్ఘ తీర్పులో పేర్కొంది.
1045 పేజీలు.. 533 సాక్ష్యాలు.. 88 మంది సాక్షులు
అయోధ్య కేసు విచారణలో సుప్రీంకోర్టు లోతైన పరిశీలనలు జరిపింది. పత్రాల రూపంలో అందిన 533 లిఖిత సాక్ష్యాలను పరిశీలించింది. వాటిలో మతపరమైన పత్రాలు, ట్రావెలాగ్‍లు, పురావస్తు శాఖ నివేదికలు, బాబ్రీ మసీదు కూల్చివేతకు పూర్వం నాటి ఫొటోలు ఉన్నాయి. శిలా శాసనాల అనువాదాలనూ కోర్టు పరి శీలించింది. 88 మంది సాక్షుల వాంగ్మూలాలను ఆలకించింది. వారిలో పలువురు చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు ఉన్నారు. మొత్తంగా తన తుది తీర్పును 1045 పేజీలలో పొందుపరిచింది. దీన్ని సీజేఐ రంజన్‍ గొగోయ్‍ 45 నిమిషాల పాటు చదివి వినిపించారు.

తీర్పు సూటిగా.. స్పష్టంగా..

అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామ మందిరం కోసం అప్పగించాలి.
వివాదాస్పద భూమిని ట్రస్టుకు అప్పగించాలి. అదే సమయంలో సున్నీ స్రె వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోని మంచి ప్రాంతంలో ఐదు ఎకరాల భూమిని కేటాయించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకుని నిర్ధిష్ట గడువులోగా ఈ కేటాయింపు పక్రియను పూర్తి చేయాలి. తనకు కేటాయించిన భూమిలో సున్నీ సెంట్రల్‍ వక్ఫ్ బోర్డు తన ఇష్టమైన నిర్మాణాన్ని చేపట్టుకోవచ్చు.
1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత చట్ట విరుద్ధం. లౌకిక దేశంలో ఇటువంటి చర్యలు వాంఛనీయం కాదు.
అయోధ్యలోని నిర్ధిష్ట ప్రాంత సేకరణ చట్టం- 1993 ప్రకారం దఖలు పడిన అధికారాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం మూడు నెలల్లోగా ట్రస్టును ఏర్పాటు చేయాలి. ఆలయ నిర్మాణ బాధ్యతతో పాటు దానితో సంబంధ మున్న ఇతరత్రా అధికారాలను సదరు ట్రస్టుకు అప్పగించాలి.
రామజన్మభూమి పరిధిలో ప్రస్తుతం ఉన్న ఇన్నర్‍, అవుటర్‍ కోర్టుయార్డు (బాబ్రీ మసీదులోపల, బయట ప్రాంతాలు) అంతటినీ ఈ ట్రస్టుకు అప్పగించాలి.
1857లో అడ్డుగోడ కట్టినప్పటికీ ఎలాంటి ప్రతిబంధకం లేకుండా మసీదు బయట హిందువులు పూజలు కొనసాగిస్తున్నారనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మసీదు బయట ప్రాంతం వారి చేతిలోనే ఉందన్నది సుస్పష్టం.
1857లో బ్రిటిష్‍ వారు అవధ్‍ను కలుపుకోవడానికి ముందు.. మసీదు లోపలి భాగంలో కూడా హిందువులు పూజలు చేసేవారనడానికి కొన్ని సాక్ష్యాలున్నాయి.
16వ శతాబ్దంలో మసీదు నిర్మాణం జరిగినప్పటి నుంచి 1857 ముందు వరకూ ఈ ప్రాంతం పూర్తిగా ముస్లింల చేతుల్లోనే ఉందని చెప్పడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు.
వివాదాస్పద భూ భాగాన్ని మూడు భాగాలుగా మూడు పక్షాలకు సమా నంగా పంచుతూ అలహాబాద్‍ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు అసంబద్ధ మైనది. సమాజంలో శాంతి, సామరస్యం నెలకొల్పడం కోసం హైకోర్టు ఆ తీర్పు ఇచ్చినా.. దానివల్ల సమస్య పరిష్కారం కాజాలదు. వివాదాస్పద స్థలం మొత్తం 1500 గజాల్లో ఉంది. ఆ భూమిని పంచి ఇవ్వడం వల్ల ఎవరి ప్రయో జనాలు నెరవేరకపోగా, శాంతి, సామరస్యా

Review రాములోరు గెలిచారు!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top