కమల్‍హాసన్ కుమార్తె శ్రుతిహాసన్ ఈ మధ్య వార్తల్లో బాగా నిలుస్తున్నారు. కోలీవుడ్ వర్గాలైతే ‘శ్రుతికి కొంచెం బిల్డప్ ఎక్కువైంది’ అని కూడా అంటున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే – తమిళ దర్శకుడు సుందర్ రూ. 200 కోట్లు భారీ బడ్జెట్ వ్యయంతో ‘సంఘమిత్ర’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. లీడ్ రోల్ కోసం శ్రుతి హాసన్‍ని తీసుకున్నారు. ఆమె రెండు నెలలు ఈ సినిమా కోసం పని చేశారు కూడా. అంతలోనే ఏమైందో ఏమో కానీ శ్రుతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆరు నెలలపాటు ఇదే సినిమా కోసం కత్తిసాము నేర్చుకుని… రెండు నెలలు నటించి కూడా ఆమె తప్పుకోవడం అంతటా హాట్‍టాపిక్‍గా మారింది. దర్శకుడు పూర్తిగా స్క్రిప్ట్ తన చేతికివ్వకపోవడం, తన పాత్ర తీరుతెన్నుల గురించి సరిగా చెప్పకపోవడం వల్లనే శ్రుతి తప్పుకుందని అంటున్నారు. అయితే ఇదే విషయమై శ్రుతిని అడిగితే మనం ఏం చేస్తున్నామో దానిపై క్లారిటీ ఉండాలి కదా! ఏమీ తెలియకుండా ఎలా చేయాలి? జనం మాత్రం నిజం తెలియకుండా ఏవేవో కథలు అల్లేస్తూ ప్రచారంలోకి తెచ్చేస్తున్నారు. నావరకు పాత్ర ఏమిటనే క్లారిటీ ఉంటేనే ఏ సినిమాలోనైనా నటిస్తాను’ అంటూ మీడియాకు పెద్ద క్లాసే తీసుకుంది. ‘సంఘమిత్ర’ సినిమాకోసం నేర్చుకున్న కత్తిసాము, ఇతర విద్యలను వేరే సినిమాలకోసం ఎప్పుడో అప్పుడు ఉపయోగపడతాయని, నేర్చుకున్నదేదీ వృథా పోదన్న తత్వం కూడా చెప్పుకొచ్చింది.
క్లారిటీ ఉండాలి కదా!

Review క్లారిటీ ఉండాలి కదా!.