
సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రతి సంవత్సరం ఆధ్యాత్మిక యాత్ర చేయడం మామూలే. ఈసారీ ఆయన స్పిరిచ్చువల్ జర్నీ షురూ అయ్యింది. వారం పది రోజుల పాటు ఆయన సినిమాలకు, లౌకిక ప్రపంచానికి దూరంగా ఈ యాత్రను సాగించనున్నారు. తొలిగా ఆయన ధర్మశాల వెళ్లారు. అక్కడి శివాలయాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత రిషికేష్‌కు బయల్దేరారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్‌లో 1917లో పరమహంస యోగానంద ప్రారంభించిన ‘యోగాద సత్సంగ సొసైటీ’ వందేళ్ల వేడుకలో పాల్గొంటారు. అన్నట్టు.. ఈ యాత్రలో ఉన్న రజనీని మీడియా వదల్లేదు. అందుకు ఆయన జవాబుగా, ‘ఇటీవల పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశాను. ఆ ప్రయాణం కోసం ఈ ప్రయాణం (ఆధ్యాత్మిక యాత్ర)లో ప్రత్యేక పూజలు చేయాలని అనుకోవడం లేదు’ అని తనదైన శైలిలో చెప్పారు. ఏమైనా, రజనీ స్టైలే వేరు!
Review రజనీ ఆధ్యాత్మిక యాత్ర.