మరోసారి బాలకృష్ణ సరసన..

హీరో నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా మారారు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం రానున్నట్టు ఇటీవలే అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ సరసన హీరోయిన్‍గా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై చిత్ర యూనిట్‍ దృష్టిపెట్టింది. బాలీవుడ్‍ కథానాయికకు ఇందులో అవాశం ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే విద్యాబాలన్‍తో పాటు మరో నటి పేరు వినిపిస్తోంది. విద్యాబాలన్‍ ఇప్పటికే బాలకృష్ణతో కలిసి ‘ఎన్టీఆర్‍ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్‍ మహానాయకుడు’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ జోడీ కొరటాల సినిమాతో మళ్లీ కలిసిందంటే.. ఈ సినిమాపై ఉత్తరాదిలోనూ మంచి అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇది బలమైన సామాజిక సందేశం ఉన్న యాక్షన్‍ కథతో రూపొందనుందని, దీంట్లో రాజకీయ అంశాలు మిళితమై ఉంటాయని తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పూర్వ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.

Review మరోసారి బాలకృష్ణ సరసన...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top