భాగ్యశ్రీ బోర్సే.. తెలుగులో చెప్పుకోదగిన చిత్రాలే చేసినా.. ఒక్క హిట్టూ పడలేదు. ఎట్టకేలకు ‘లెనిన్’తో ఆ లోటు తీరిపోయింది. అప్పటివరకు ఐరన్‍లెగ్ అన్న వాళ్లంతా ఇప్పుడు సక్సెస్‍స్టార్ అంటున్నారు. తెలుగునాట కుర్రాళ్ల కొత్త క్రష్‍గా మారిన భాగ్యశ్రీ ప్రయాణమంతా రంగుల కలే కాదు.. నవ్వించే కథలూ.. కన్నీళ్లు పెట్టించే జ్ఞాపకాలూ ఉన్నాయి. చిన్నప్పుడు క్యాడ్‍బరీ యాడ్‍లో మెరిసి.. ఇప్పుడు వెండితెరపై వెలుగులీనుతున్న ఈ అమ్మాయి చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే..
రాజమౌళి, త్రివిక్రమ్..
ప్రతి నటికీ ఒక డ్రీమ్ లిస్ట్ ఉంటుంది. నా లిస్టులో రాజమౌళి, త్రివిక్రమ్ గార్లతో కలిసి పనిచేయాలనేది మొదటి స్థానంలో ఉంటుంది. ఎప్పటికైనా వీరిద్దరి దర్శకత్వంలో నటిస్తాను. ఆ కల తీరాలని కోరుకుంటున్నాను.
మోడల్‍గా జర్నీ..
సినిమాల కంటే ముందే యాడ్స్ నా జీవితంలోకి వచ్చాయి. ముఖ్యంగా క్యాడ్‍బరీ డెయిరీ మిల్క్ సిల్క్ ప్రకటనతో చాలామంది నన్ను గుర్తుపట్టారు. ఆ గుర్తింపు నుంచే నా సినిమా ప్రయాణం మొదలైంది.
విజయం విలువ తెలుసు..
మా ఇంట్లో ఒక చిన్న డైరీ ఉండేది. అందులో రూ.10 పచ్చిమిర్చి, రూ.10 పాలకూర.. ఇలా ప్రతి ఖర్చూ రాసుకునే వాళ్లు. వారానికి కేవలం 300 రూపాయలతో అమ్మ ఇంటిని నడిపిన రోజులను చూశాను. అందుకే ఇప్పుడు వచ్చిన ప్రతి విజయానికి, దానికి ఉండే విలువ గురించి నాకు బాగా తెలుసు.
నాన్న తలవంచకూడదని..
నేను పుట్టిన కొద్దిరోజులకే నాన్న ఉద్యోగం పోయింది. ‘నాకు ఇద్దరు కూతుళ్లున్నారు. ఏదైనా పని ఇవ్వండి’ అని నాన్న ఉద్యోగాల కోసం తిరిగిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఈ రోజు నుంచీ ఒక్కటే నిర్ణయం తీసుకున్నా.. బాగా డబ్బు సంపాదించాలి.. మా నాన్న మళ్లీ ఎప్పుడూ తలవంచకూడదని..
డైలాగ్స్ నేనే చెబుతా..
తెలుగు నా మాతృభాష కాదు. కానీ, ప్రేక్షకులకు నిజాయితీగా కనిపించాలంటే నా డైలాగ్స్ నేనే చెప్పాలని నిర్ణయించుకున్నా. అందుకే ‘మిస్టర్ బచ్చన్’ కోసం చాలా కష్టపడి తెలుగు నేర్చుకున్నాను.
కలిసొచ్చిన ‘భాగ్య’నగరం
నేను ఎన్నిసార్లు కిందపడినా మళ్లీ లేవడానికి బలం ఇచ్చింది ఈ ప్రేక్షకుల ప్రేమే. ముఖ్యంగా హైదరాబాద్ నాకు చాలా స్పెషల్. ఈ భాగ్యనగరాన్ని నేను నా కర్మభూమిగా భావిస్తాను. ఈ నగరం నాకు చాలా ఇచ్చింది.
పెళ్లి ప్రశ్న..
ఒక కాలేజీ ఈవెంట్‍లో ‘ఫ్రెండ్, డేట్, మ్యారీ’ గేమ్ ఆడుతూ నా సినిమా హీరోలందరూ అప్పటికే పెళ్లయిన వారే.. వాళ్లను ఎలా మళ్లీ పెళ్లాడతానని అన్నాను. ఆ తరువాత ఆ వీడియో క్లిప్‍పై వచ్చిన మీమ్స్ చూసి బాగా నవ్వుకున్నాను. ఏదో సరదాగా చెప్పిన మాట అంత వైరల్ అవుతుందని అనుకోలేదు. చిన్నప్పుడు నలుగురిలో మాట్లాడాలంటే భయపడేదానిని. ఇప్పుడిప్పుడే అటువంటి భయాలన్నీ తొలగించుకుంటున్నాను.























































































































































































































































Review భాగ్యశ్రీ బోర్సే...