చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా.. అన్నారు మన పెద్దలు.
మన ‘తెలుగు’కు మనమే వెలుగుబాట కావాలి.
మన సంస్క•తీ సంప్రదాయాలకు మనమే ప్రతీకగా నిలవాలి.
మన ‘భాష’ను మనమే కాపాడుకోవాలి.
మన ‘యాస’ను మనమే నిలుపుకోవాలి.
ఈ ప్రయత్నంలో తెలుగు జిలుగు లను నేల
నలుచెరగులా విరజిమ్మాలనే తలంపుతో
అక్షర శ్రీకారం చుట్టుకొంది- ‘తెలుగు పత్రిక’
ఇది మన పత్రిక.. మన అచ్చ తెనుగు పత్రిక.
ఈ అక్షర మహా యజ్ఞంలో విదేశాల్లో ఉన్న
తెలుగు వారంతా భాగస్వాములు కావాలి.
అందుకే..
మీ మీ రచనలు పంపండి.
మీ అభిప్రాయాలను తెలపండి.
మీ బంధువులు, మీ మిత్రులకు స్వచ్ఛమైన తెలుగులో
ఈ పత్రిక ద్వారా శుభాకాంక్షలు అందచేయండి.
స్వస్థలం: బుక్కాపురం, అనంతపురం జిల్లా, ఆంధప్రదేశ్
పుట్టిన తేదీ: 1967, ఆగస్టు 19 హైదరాబాద్
తండ్రి: నాదెళ్ల యుగంధర్ (1962 బ్యాచ్ ఐఏఎస్)
ప్రాథమిక విద్యాభ్యాసం: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్
ఉన్నత విద్య: మణిపాల్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‍లో బీఈ (1988)
– విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ (అమెరికా)
– చికాగో యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‍లో మాస్టర్స్ డిగ్రీ (అమెరికా)
భార్య: అనుపమ నాదెళ్ల
సంతానం: ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు
స్థిర నివాసం: వాషింగ్టన్
తొలి ఉద్యోగం: సన్ మైక్రో సిస్టమ్స్
1992: మైక్రోసాఫ్ట్ విండోస్ డెవలప్‍మెంట్ విభాగంలో పోగ్రామ్ మేనేజర్‍గా చేరిక
2001: మైక్రోసాఫ్ట్ సెంట్రల్ విభాగ•ం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు
2007: మైక్రోసాఫ్ట్ బిజినెస్ సొల్యూషన్స్ విభాగానికి సీనియర్
ఉపాధ్యక్షుడు
2011: మైక్రోసాఫ్ట్ సర్వర్ అండ్ టూల్స్ వాణిజ్య విభాగం అధ్యక్షుడు
2014, ఫిబ్రవరి 4: మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‍గా నియామకం
ఘనత: మైక్రోసాఫ్ట్కు 3వ సీఈఓ (బిల్‍గేట్స్, స్టీవ్ బాల్మర్ తరువాత)
ఇష్టమైన క్రీడ: క్రికెట్
ఎక్కడో అనంతపురం జిల్లాలో పుట్టి.. హైదరాబాద్‍లో పెరిగి అమెరికాలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వైనం సాదాసీదా విజయగాథ కాదు. ఎంతో కృషి.. మరెంతో పట్టుదల.. ఎనలేని సంకల్పం.. ఇవన్నీ తోడైతేనే ఒక విజయం సాకారమవుతుంది.
సత్య నాదెళ్ల దృష్టిలో సక్సెస్ అంటే ఒక గమ్యం కాదు. ఏదైనా ఒక పాయింట్‍కు చేరుకో గానే ఆ ప్రయాణం పూర్తయినట్టు కాదు. అది నిరంతర పక్రియ. సక్సెస్ జర్నీ నాన్‍స్టాప్‍గా కొనసాగుతూనే ఉండాలి. ప్రస్తుతం ఆయన ప్రస్థానం మైక్రోసాఫ్ట్లో అలాగే విజయవంతంగా కొనసాగుతోంది.
‘సత్యమేవ జయతే’ అనేది భారతీయ సాంప్ర దాయంలో ఒక నైతిక మంత్రం. అది సత్య నాదెళ్ల విషయంలో విజయ సూత్రం.‘సత్య’ మాదిరిగా అలుపెరగకుండా పనిచేసే వారెవరైనా ‘సత్య’ మాదిరిగానే చేసే పనిలో జయం పొందు తారు.
తెలుగు వారి కీర్తికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన సత్య నాదెళ్ల చాలా సాదాసీదాగా కనిపిస్తారు. కానీ, ఆయన ఆలోచనలు మాత్రం చాలా అసాధారణంగా ఉంటాయి.
ఆయన ‘బాస్’ అనడాన్ని ఇష్టపడరు. ‘బాస్’ అంటే పని చేయించే వాడని అర్థమని అంటారు.
ఆయన ‘లీడర్’ కావడాన్ని, ‘లీడర్’గా ఉండ టాన్ని ఇష్టపడతారు. ‘లీడర్’ అంటే తన తోటి వారితో కలిసి తానూ నిరంతరం పని చేస్తూనే ఉంటారు.
అందుకే సత్య నాదెళ్ల ప్రపంచంలోనే బెస్ట్ లీడర్. మైక్రోసాఫ్ట్లో ఆయన కింద, ఆయన నాయత్వంలో పని చేయడానికి ఎంతోమంది ఇష్టపడుతున్నారు. మరెంతోమంది ఆయనను తమ నాయకుడిగా ప్రేమిస్తున్నారు.
ఇది నిజమైన సక్సెస్ స్టోరీ.. ఒక తెలుగు ఎన్నారై.. కేవలం టాలెంట్‍తో వెళ్లి.. విన్నర్‍గా నిలిచిన అద్భుత కథ.
సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్లో ఎలా చేరారు? ఎప్పుడు చేరారు? ఏం చదివారు? ఎలా చదివారు? ఎలా ఎదిగారు?.. ఇదంతా పాత కథ.
ఆయన వ్యక్తిత్వం ఏమిటి? సక్సెస్ ప్లాన్ ఏమిటి? ఆయనేం చెబుతారు? ఆయనేం చేస్తారు? ఏం మాట్లాడుతారు?.. ఇది సమ్‍థింగ్ స్పెషల్‍తో కూడిన కొత్త స్టోరీ..
అందుకే.. మీరు చదవబోయే ఈ విజయ గాథలో ఆయన నేపథ్యం, పుట్టుక వంటి కబుర్లు చెప్పదల్చుకోలేదు.
ఆయన వ్యక్తిత్వం, అకుంఠిత దీక్ష, సాధారణ వ్యక్తి అసాధారణ శక్తిగా మారిన వైనం గురించి మాత్రమే ఉంటుంది.
ఇవే మనకు స్ఫూర్తి కలిగించేవి. అవే మనకు వెలుగునిచ్చేవి. కాబట్టి ఆ విషయాలనే మననం చేసుకుందాం.
సత్య నాదెళ్ల అంటే సమ్‍థింగ్ డిఫరెంట్.
ఆయన ఎలా ఉంటారు? ఏం చేస్తారు?
సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ మాత్రమే అని భావిస్తే ఆయన నుంచి మనం మరేమీ నేర్చుకోలేం.
ఒక వ్యక్తిగా, శక్తిగా ఆయన ఎంత ఘనా పాఠో, ఆయన వ్యక్తిత్వం ఎంతటి విలక్షణమైనదో తెలుసుకుంటేనే ఆయన నుంచి మనం మరిన్ని సక్సెస్ మంత్రాలను స్ఫూర్తిగా పొందగలుగుతాం. అందుకే.. ఇది సత్య నాదెళ్లను మరో వైపు నుంచి చూపించే ప్రయత్నం..
ఇక అసలు విషయంలోకి వెళ్లిపోదాం.. సత్య నాదెళ్ల.. ఎవరేమి చెప్పినా శ్రద్ధగా వింటారు. భిన్నంగా ఆలోచిస్తారు. ఆయన నడకలో, నడతలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంటుంది. ఆయన ఆలోచనల్లో నవ్యత ఉంటుంది. సాంకేతికత ఉంటుంది.
అందరితో కలుపుగోలుగా ఉండటం, అంద రితో కలిసిపోవడం, అందరితో సత్సంబంధాలు ఏర్పర్చుకోవడంలో ఆయనకు ఆయనే సాటి.
మైక్రోసాఫ్ట్లో చేరడానికి చాలా ముందే.. అసలు ఆ విషయానికి వస్తే.. అందులో చేరాలనే తలంపు ఆయనకు రాక ముందే తండ్రి ఆయ నకు ఓ అద్భుత విజయసూత్రం చెప్పారట!. అదేమిటంటే..
‘ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు. ఓ సక్సెస్‍ఫుల్ ప్రొడక్ట్ని కనిపెట్టేందుకు నువ్వు ప్రొఫెషనల్‍వే కానక్కర్లేదు. ఆ మాటకొస్తే.. గూగుల్, యాపిల్ వంటి సంస్థలకు ఔత్సాహికుల ఆలోచనలే ఊపిరి పోశాయనే విషయం నీకు తెలుసా?’. అప్పటి నుంచి సత్య నాదెళ్ల ఆలోచన ధోరణి మారింది. కొత్తగా ఆలోచించడానికి ఆనాటి తండ్రి మాటలే ఆయనకు ఊతమిస్తుంటాయి.
మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‍గా ఆయన చాలా ‘ఈజీ’గా ఎంపికైపోయారు. అదేంటి.. ఎవరైనా ‘కష్టపడితే కదా.. ఉన్నత స్థానానికి చేరుకునేది?’ అని సందేహపడుతున్నారా?
మీకు కలిగిన సందేహం సరైనదే..
ఆయన మైక్రోసాఫ్ట్కు సీఈఓగా ఎంపిక కావా లనే లక్ష్యంతో కష్టపడలేదు. ఉన్నత స్థానానికి చేరుకోవాలని మాత్రం తపించి.. ఆ లక్ష్యంతో ఇష్టపడి పనిచేశారు. ఆయన కష్టం, ఇష్టం కల గలిసి ఆయనను ‘ఈజీ’గా ఓ దిగ్గజ సంస్థకు అధినేతను చేశాయి.
సత్య నాదెళ్లకు క్రికెట్ ఆడటం అంటే ఇష్టం. ఎందుకంటే నాయకత్వం వహించగలిగే అవ కాశం ఎక్కువ ఉన్న ఆట అది. అందుకే హైదరా బాద్ పబ్లిక్ స్కూల్‍లో చేరినప్పుడు ఆయన అక్కడి క్రికెట్ జట్టులోనూ సభ్యుడయ్యారు. నాయకత్వ లక్షణాలను ఆ ఆట నుంచే పొందానని ఆయన సగర్వంగా చెబుతారు.
బృందంతో కలిసి పని చేయడం సత్య నాదె ళ్లకు మహా ఇష్టం. ‘ఒంటరిగా ఏం చేయలేం.. జట్టుగానే సులువుగా విజయం సాధించగలం’ అనేది ఆయన విజయ సూత్రం.
1992లో మైక్రోసాఫ్ట్లో పోగ్రామ్ మేనేజర్‍గా చేరిన సత్య నాదెళ్ల.. అనంతరం స్వయంకృషితో, సాటి లేని మేటి ప్రతిభతో చివరకు సాఫ్ట్వేర్ రంగ సామ్రాజ్యానికి రారాజుగా ఎదిగారు. మైక్రో సాఫ్ట్లో క్లౌడ్ ఆపరేటింగ్ సిస్టమ్‍ను రూపొం దించిన ఘనత ఆయనదే. అధునాతన సాఫ్ట్వేర్ పోగ్రామ్‍ల నిర్వహణకు తరువాత కాలంలో ఇదే కీలకంగా మారింది. మైక్రోసాఫ్ట్లోని సర్వర్ అండ్ టూల్స్ విభాగాధిపతిగా.. ఆయన దాని స్వరూప స్వభావాలను పూర్తిగా మార్చివేశారు. అన్నీ తానై.. అంతటా తానై.. సర్వం తానై.. ఇక తన తరువాత మరెవరూ లేరనేంతగా ఆయన ఎదిగారు. మైక్రోసాఫ్ట్ను ముందుండి ఎవరు నడిపించాలనే ఆలోచన, భవిష్యత్తు ఏమవుతుందనే చింత.. దాని పూర్వ అధిప
బిల్‍గేట్స్కు అసలు కలగలేదు. ఎందుకంటే.. నడిపించే నాయకుడు కళ్లెదుటే ఉంటే.. ఇక మరో ఆలోచన ఎందుకు? అందుకే వేరే ఆలోచన లేకుండా సత్య నాదెళ్లను బిల్‍గేట్స్ సీఈఓగా ఎంపిక చేశారు.
‘నిన్ను మించిన వారు మరొకరు లేరు’ అంటూ అరుదైన కితాబును కూడా బిల్‍గేట్స్ నుంచి సత్య నాదెళ్ల అందుకున్నారు.
సత్య నాదెళ్లకు మైక్రోసాఫ్ట్ మాత్రమే ప్రపంచమా?
కాదు.. ఆయనకు ఇంకా తనదైన ప్రపంచం చాలా ఉంది.
ఖాళీ దొరికితే పుస్తకాలు చదువు తారు.
ఎప్పుడూ ఏదో ఒక ఆన్‍లైన్ కోర్సును పూర్తి చేయాలనే ఆసక్తితో ఉంటారు.
ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకునేందుకు, నేర్చుకునేందుకు ఉత్సు కత చూపుతుంటారు.
మనం నేర్చుకోవాలనే, తెలుసుకోవాలనే ఆసక్తితో లేకపోతే గొప్ప పనులు చేయలేమనేది ఆయన నిశ్చితాభిప్రాయం.
అందుకే కంప్యూటర్ సైన్స్ చేసిన ఆయనే ఎంబీఏ కూడా చేశారు. విభిన్నంగా ఉండటం అంటే అదే.. ఈ సందర్భంలోనే ఆయన ఓసారి చెప్పిన చిన్న పిట్ట కథను గుర్తు చేసుకోవాలి.
ఓ వ్యక్తి జీవితంలో ఎన్నో విజయాలు సాధిం చాడు. ఎన్నో అందలాలు ఎక్కాడు. ఓ రోజు అతని శిష్యుడు, ‘గురువు గారూ.. మీ విజయానికి కారణమేమిటి?’ అని అడిగాడు. దానికి ఆ గురువు చిరునవ్వు నవ్వి ‘నువ్వే ఆలోచించు. ఎవరూ చదవనిదే చదువు. ఎవరూ ఆలోచించని విధంగా ఆలోచించు. ఇతరులెవరూ చేయనిదే చేయి. అదే నిన్ను విజయ శిఖరాలు ఎక్కిస్తుంది’ అన్నాడట.
తన కుమారుడికి బుద్ధిమాంద్యం ఉండటంతో అలాంటి పిల్లలు అందరి కోసం సత్య నాదెళ్లదయ గల తండ్రి’గా మారారు. వారి కోసం హైదరాబాద్‍లో ఓ పాఠశాలను పెట్టి వారి భవి ష్యత్తుకు తాను దిక్సూచిగా, చుక్కానిగా మారారు.
విజయాలను, సంతోషాలను ఎలా అందరం పంచుకుంటున్నామో కష్టాలనూ అలాగే పంచు కోవాలంటూ ఆయన తరచుగా ఓ కథ చెబు తుంటారు. అది..
కరువు కాటకాలతో అల్లాడుతున్న కెన్యాలో ఓ వ్యక్తికి, జింబాబ్వే నుంచి వలస వచ్చిన మరో వ్యక్తి తారసపడ్డాడు. బక్కచిక్కిన శరీరంతో
ఉన్న ఆ వ్యక్తి.. మూడు రోజుల నుంచీ తాను ఏమీ తినలేదని, తినడానికి ఏమైనా పెట్టాలని ప్రాథేయపడ్డాడు. చలించిపోయిన మొదటి వ్యక్తి.. తాను తింటున్న రొట్టెముక్కను అతనికి ఇచ్చాడు. అయితే, అతను.. ‘మొత్తమంతా నాకు వద్దు. చెరి సగం తిందాం’ అంటూ సగం రొట్టెముక్కను వెనక్కి ఇచ్చాడట.
ఆయన మైక్రోసాఫ్ట్లో ఉన్నంత సమయం ఎంతో ఏకాగ్రతతో ఉంటారు. అదే ఆయనను
భిన్న ఆలోచనల్లోకి తీసుకు వెళ్తుందని సహచర ఉద్యో గులు అంటారు.
ప్రస్తుతం ఆయన ‘హిట్ రిఫ్రెష్’ అనే పుస్తకం రాస్తున్నారు. ఇందులో ఎన్నో ఆసక్తికర అంశాలు ఉండ నున్నాయని స్నేహితులు, సన్నిహితులు భావిస్తున్నారు.
సత్య నాదెళ్ల మాటలు.. ముత్యాల మూటలు. నేటి యువతకు దారి చూపే విజయపు బాటలు.
యువతను, సంస్థ ఉద్యోగుల్ని కార్యోన్ముఖుల్ని చేయడానికి ఆయన ఉపయోగించే పదాలు
ఉత్ఫ్రేర కాలుగా పని చేస్తాయి. ఆయన ప్రసంగం వేల కోట్ల ఎనర్జీని ఇస్తుంది.
ఆయన తోటి సిబ్బందిని, యువతను మోటివేట్ చేసేందుకు తన ప్రసంగంలో పిట్ట కథల్ని చెబుతుంటారు.
అవి వినేవాళ్లను కట్టిపడేస్తుంటాయి.
మనుషులుగా మనం ఒకరికొకరు సహక రించుకోవాలి. తోడ్పడాలి. అందుకు ఆయన వివిధ సందర్భాల్లో చెప్పే ఉదాహరణ ఇది. ఓసారి నేను (సత్య నాదెళ్ల) నడుస్తూ నడుస్తూ తూలి పడబోయాను. ఆ పక్కనే వీల్ చైర్‍లో ఉన్న ఓ కుర్రాడు చటుక్కున నన్ను పట్టుకుని ఆపాడు. అతనికి కృతజ్ఞతలు చెప్పి ‘వీల్‍చైర్‍లో ఉన్నావు.. ఏమైంది?’ అని అడిగాను. దానికి ఆ కుర్రాడు.. ‘కొన్నేళ్ల క్రితం నేనూ కాలు జారి పడ్డాను. కానీ, ఆ సమయంలో నన్ను పట్టుకుని ఆపేందుకు ఎవరూ లేరు’ అని బదులిచ్చాడు.
అంతా చదివారు కదా..
ఇంతకీ సత్య నాదెళ్ల గురించి ఏం తెలుసు కున్నారు.
ఆయన వ్యక్తి కాదు.. శక్తి.
ఆయన నేటి యువతకు నిత్య స్ఫూర్తి.
ఏకాగ్రతతో పనిచేయడం, కొత్త కొత్త విష యాలు నేర్చుకోవడం, తెలుసుకోవడం, ఒక విజన్‍తో ఉండటం, భిన్నంగా ఆలోచించడం
Review మన కీర్తి పతాక మన తెలుగు పత్రిక.