నిలివేతు పతాకం
మన జాతీయ పతాకం మన దేశ ఔన్నత్యానికి ప్రతీక.. అది నిండుగా ఎగిరితే చూసే గుండెలు ఉద్వేగంతో ఉప్పొంగుతాయి. దేశభక్తి ఉరకలెత్తుతుంది.
ఈ క్రమంలోనే మన దేశ ఔన్నత్యాన్ని చాటేలా పొడవైన జెండా స్తంభాన్ని ఏర్పాటు చేసింది అమ•త్‍సర్‍ ఇంప్రూవ్‍మెంట్‍ ట్రస్టు. భారత్‍-పాకిస్థాన్‍ సరిహద్దుల్లోని అట్టారీ వద్ద ఏర్పాటైన ఈ జాతీయ పతాకం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పాకిస్థాన్‍లోని లాహ•ర్‍• నుంచి కూడా ఈ పతాకం ఉన్న స్తంభం స్పష్టంగా కనిపిస్తుంది. అట్టారీ ప్రాంతం పాకిస్థాన్‍కు కూత వేటు దూరంలోనే ఉంది. జెండా స్తంభం ఎత్తు 360 అడుగులు (110 మీటర్లు). వెడల్పు 24 మీటర్లు. దీని మొత్తం బరువు 55 టన్నులు. నిర్మాణానికి దాదాపు రూ.3.50 కోట్లు వెచ్చించారు. పంజాబ్‍ మంత్రి అనిల్‍ జోషి ఈ స్తంభంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ప్రారంభించారు. సూర్యాస్తమయం సమయంలో ఇక్కడ జరిగే బీటింగ్‍ రీట్రీట్‍ వేడుకను చూడడానికి వచ్చే వేల మంది పర్యాటకులకు ఈ జెండా స్తంభం ఆకర్షణీయంగా మారింది. పాకిస్థాన్‍ వైపు నుంచి కూడా వీక్షకులు ఆసక్తిగా తిలకించారు. ఇప్పటి వరకు దేశంలోనే పొడవైన
జెండా స్తంభం రాంఛీలో ఉంది. దీని ఎత్తు 300 అడుగులు.

ప్రీత్ బారారా తోలగింపు
భారత సంతతికి చెందిన ప్రభుత్వ న్యాయవాది (ప్రాసిక్యూటర్‍) ప్రీత్‍ భరారాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ పదవి నుంచి తప్పించారు. అయితే తన రాజీనామాకు భరారా తిరస్కరించడంతో, తక్షణమే పదవి నుంచి వైదొలగాల్సిందిగా అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భరారాతో పాటు మాజీ అధ్యక్షుడు బరాక్‍ ఒబామా హయాంలో నియమితులైన దాదాపు 46 మంది ప్రభుత్వ న్యాయవాదులను కూడా రాజీనామా చేయాలని ట్రంప్‍ ప్రభుత్వం కోరింది. అయితే తాను రాజీనామా చేయలేదని.. ప్రభుత్వమే పదవి నుంచి తప్పించిందని భరారా ట్విటర్‍లో పేర్కొన్నారు. సదరన్‍ డిస్ట్రిక్ట్ ఆఫ్‍ న్యూయార్క్లో అమెరికా ప్రభుత్వ న్యాయవాదిగా విధులు నిర్వర్తించడం తనకు దక్కిన గౌరవంగా అభివర్ణించారు. అమెరికా ప్రభుత్వ న్యాయవాదుల్లో అత్యంత ప్రముఖుడుగా పేరుపొందిన భరారా.. ఎస్‍డీఎన్‍వైలో ఏడేళ్ల నుంచి ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. అవినీతి, విదేశీ వ్యవహారాలు, ఇన్‍ సైడర్‍ ట్రేడింగ్‍ వంటి పలు కీలక కేసుల్లో కచ్చితంగా వ్యవహరించడం ద్వారా గొప్ప పేరు సంపాదించుకున్నారు.

మలాలాకు మరో ఆఫర్
నోబెల్‍ శాంతి బహుమతి గ్రహీత మలాలాకు యూకేలోని ఒక విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం వచ్చింది. చదువుకునే అవకాశం ఇచ్చింది. ఈ విషయాన్ని మలాలా స్వయంగా ప్రకటించారు. నేను నా 13 ఏళ్లప్పుడు ‘ఏ’ లెవల్‍ ఎగ్జామ్స్ రాశాను.. కానీ ఇప్పుడు మూడు ‘ఏ’ లెవల్స్ తెచ్చుకోవాలనే షరతులతో ఆఫర్‍ వచ్చిందని తెలిపారు. ఇప్పుడు నేను మూడు ‘ఏ’లు సాధించాలన్నారు. నేను నా పనిచేసుకోవాలి.. చదువులు కొనసాగించాలని వెల్లడించారు. మలాలా ఫండ్‍ కోసం కష్టపడతానని తెలిపారు. ప్రతీ బాలిక, బాలుడు, చిన్నారి పాఠశాలకు వెళ్లాలన్నదే నా లక్ష్యమని.. ఇది ప్రాథమిక మానవహక్కు అని పేర్కొంది. నా లక్ష్యానికి మద్దతుగా నిలిచినందుకు క•తజ్ఞతలు చెబుతున్నాను.. ఇదే నన్ను బలంగా నిలబెట్టిందంటూ ట్విట్టర్‍ లో తెలిపారు మలాలా.

భరత్ కు శాశ్వత ప్రభుత్వం ఇవ్వాలి
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‍కు శాశ్వత సభ్యత్వం ఇచ్చే విషయమై పలు దేశాలు మద్దతు తెలిపాయి. ప్రపంచ శక్తులుగా కొన్ని దేశాలు అభివ•ద్ధి చెందినందున ఐరాస కూడా దాన్ని ప్రతిబింబించాలని అభిప్రాయపడ్డాయి. ఇటీవల జరిగిన భద్రతా మండలి సమావేశంలో ఫ్రాన్స్, బ్రిటన్‍ సహా 50 దేశాల వక్తలు భారత్‍కు అనుకూలంగా మాట్లాడారు. ఈ వివరాలను ఐరాస వెబ్‍సైట్‍లో ఉంచారు. 15 మంది సభ్యులు ఉన్న భద్రతామండలిలో సంస్కరణలు చేపట్టడం అవసరమని భారత్‍, బ్రెజిల్‍, జర్మనీ, జపాన్‍ వంటి దేశాలకు ప్రాతినిధ్యం ఇస్తే బాగుంటుందని సూచించాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్యులు సహా మొత్తం సభ్యుల సంఖ్యను పెంచాల్సి ఉందని ఐరాసలో బ్రిటన్‍ శాశ్వత ప్రతినిధి మాథ్యూ రైక్రాఫ్ట్ తెలిపారు. ఆఫ్రికా ఖండం నుంచి కూడా ఒక శాశ్వత సభ్యుడు ఉంటే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. భారత రాయబారి సయ్యద్‍ అక్బరుద్దీన్‍ మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు ఏమాత్రం స్పందించని భద్రతా మండలిని వెంటనే సంస్కరించవలసి ఉందని అన్నారు.
1945లో ఐరాస ఏర్పడినప్పటి నుండి చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్‍, యూఎస్‍లు శాశ్వత సభ్యదేశాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆపై ఎన్నో దేశాలు శాశ్వత సభ్యత్వం కోసం ఒత్తిడి తెస్తున్నా, నిర్ణయాలు మాత్రం తీసుకోలేదు. దక్షిణాసియాలో కీలక శక్తిగా ఎదుగుతున్న భారత్‍ ఎన్నో సంవత్సరాలుగా శాశ్వత సభ్యత్వం కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

మళ్ళి తండ్రి కాబోతున్న జకర్బర్గ్
ఫేస్‍బుక్‍ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‍ బర్గ్ మరోసారి తండ్రి కాబోతున్నాడు. ‘‘మా నవ శిశువుకు స్వాగతం చెప్పేందుకు మేం ఇక ఎంతమాత్రం ఎదురుచూడలేము. ఆ బిడ్డను మరో శక్తిమంతమైన మహిళగా పెంచేందుకు మేం శాయశక్తులా ప్రయత్నిస్తాం’’ అంటూ అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నాడు మార్క్. అయితే ఇప్పటికే వారికి 15 నెలల మ్యాక్స్ అనే ఓ పాప
ఉండగా, ఆ దంపతులు తాజాగా మరో బిడ్డకు తల్లి దండ్రులు కాబోతున్నారు.తమకు జన్మించబోయే రెండో కూతురు కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు న్నట్లు చెప్పారు జుకర్‍బర్గ్

పార్క్ గుయెన్ ఫై వేటు
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గుయెన్‍ను పదవి నుంచి తప్పించాలన్న కింది కోర్టు తీర్పును సమర్థించింది అక్కడి రాజ్యాంగ ధర్మాసనం. ఈ తీర్పుతో ఆమెపై క్రిమినల్‍ ప్రొసీడింగ్స్కు తెరలేపినట్లయింది. అదే జరిగితే పదవీ కాలం ముగియకముందే దిగిపోతున్న తొలి నేతగా పార్క్ నిలుస్తారు.
1980లో దక్షిణ కొరియాలో ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజాస్వామికంగా ఎన్నికైన ఏ నేతా పదవీకాలం ముగియకముందే దిగిపోలేదు. ఈ క్రమంలో తొలిసారిగా పార్క్ దిగిపోనుండటంతో రెండు నెలల్లో ఎన్నికలు నిర్వహించి మరో నేతను ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కోర్టు తీర్పు కంటే ముందే నిర్వహించిన సర్వేల్లో 70 నుంచి 80 శాతం మంది పార్క్ గుయెన్‍ను తొలగించాలన్న నిర్ణయాన్ని సమర్థించారు. 2012లో పార్క్ చేతిలో ఓడిపోయిన లిబరల్‍ మూన్‍ జే ఇన్‍ ఒపినియన్‍ సర్వేల్లో ఆధిక్యంలో ఉన్నారు. నిజానికి ఇప్పటికే రాజకీయ అస్థిరతతో కుదేలైన దక్షిణ కొరియాలో ఈ తీర్పు మరింత హింసకు తావిస్తుందన్న ఆందోళనలు కూడా నెలకొన్నాయి. మరోవైపు అవినీతిలో కూరుకుపోయిన పార్క్ రాజీనామా చేయాలంటూ చాలా రోజులుగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో గతేడాది డిసెంబర్‍ లో ఆమెనుతొలగించడానికి పార్లమెంట్‍ లో తీర్మానం చేశారు. అయితే రాజ్యాంగ ధర్మాసనం ఎలాంటి తీర్పును వెలువరించినా దానిని అంగీకరించబోమని ముందే ఇరు వర్గాలు హెచ్చరించాయి. పార్క్ ను పదవి నుంచి తొలగిస్తే హింస చెలరేగే ప్రమాదం ఉందని గత నెలలో ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు ఆమెను తొలగించాలన్న నిర్ణయాన్ని కోర్టు వ్యతిరేకిస్తే తాము నిరసన ర్యాలీలు చేపడతామని ప్రత్యర్థి వర్గం కూడా హెచ్చరించింది

Review .

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top