ఏంటీ అక్కడా? ఇక్కడా? అని డౌటా?అయితే చదవండి. మేడమ్ తుస్సాడ్ మ్యూజియం తెలుసు కదా? ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకునే ప్రముఖుల మైనపు విగ్రహాలను ఈ మ్యూజియంలో ప్రతిష్టిస్తారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘బాహుబలి’ ప్రభాస్ విగ్రహాన్ని తుస్సాడ్స్ బ్యాంకాక్ శాఖలో ఏర్పాటు చేశారు. తాజాగా లండన్ మ్యూజియంలో ‘కట్టప్ప’ సత్యరాజ్ విగ్రహం కొలువుదీరనుంది. బాహు బలి సినిమాలో ‘కట్టప్ప’ పాత్ర కూడా చాలా పాపులార్టీ సంపాదించుకుంది. ‘అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ అనేది దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చకు దారితీసింది కూడా. త్వరలోనే తుస్సాడ్స్ మ్యూజియం సిబ్బంది సత్యరాజ్‌ను కలిసి మైనపు విగ్రహానికి అవసరమైన కొలతలు తీసుకోనున్నారు. ఇకపోతే, లండన్ తుస్సాడ్స్‌లో చోటు సంపాదించుకో బోతున్న తొలి తమిళ నటుడుగా కూడా సత్యరాజ్ రికార్డు సృష్టించబోతున్నాడు.
అక్కడ బాహుబలి.. ఇక్కడ కట్టప్ప

Review అక్కడ బాహుబలి.. ఇక్కడ కట్టప్ప.