ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ రైతు పరిస్థితి ఏమంత బాగా లేదు. పంట విత్తిన దగ్గరి నుంచి చేతికి అందే వరకు ఎన్ని కష్టాలో.. ఎన్ని సమస్యలో.. వీటన్నిటినీ వెండితెరపై ఆవిష్కరించనున్నారు నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి. ట్రెండ్‍తో నిమిత్తం లేకుండా తన ధోరణిలో తాను సినిమాలు తీసే నారాయణమూర్తి తాజాగా తానే ప్రధాన పాత్రధారిగా ‘అన్నదాత సుఖీభవ’ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా జూన్ 1న విడుదల కానుంది. సినిమా సెన్సార్ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆయన చెబుతున్నారు. ‘అన్నం పెట్టే రైతు పరిస్థితి నేడు దారుణంగా ఉంది. అన్నదాత సుఖీభవలా లేదు. దుఃఖీభవ అనేలా ఉంది. పాలకులకు ప్రజలంటే భయం ఉండాలి. అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది’ అనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా అందిస్తున్నట్టు నారాయణమూర్తి అంటున్నారు.
అన్నదాత.. దుఃఖీభవ!

Review అన్నదాత.. దుఃఖీభవ!.