‘అల్లు’ సినిమాలో పల్లెటూరి పిల్ల?

అల్లు అర్జున్‍ – సుకుమార్‍ కాంబినేషన్‍ ప్రత్యేకతే వేరు. వీరిద్దరి కాంబినేషన్‍లో వచ్చిన సినిమాలన్నీ సూపర్‍డూపర్‍ హిట్లే. తాజాగా వీరిద్దరు మరోసారి జత కలిశారు. ఇటీవలే ‘రంగస్థలం’ వంటి బ్లాక్‍బస్టర్‍ హిట్‍ ఇచ్చిన సుకుమార్‍, ఆ చిత్రం తరువాత చేయబోతోన్న సినిమా ఇదే. దీంతో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. అందులోనూ హిట్‍ కాంబినేషన్‍ కావడంతో మరింత హైప్స్ ఇప్పటి నుంచే ఫిల్మ్నగర్‍ సర్కిల్‍లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక, వరుస విజయాలతో బిజీగా మారిన రష్మిక మందన్నా.. ఈ తాజా చిత్రంలో హీరోయిన్‍గా ఎంపికైంది. ఆమె గత పాత్రలకు భిన్నంగా ఇందులో పూర్తిగా పల్లెటూరి పిల్లలా కనిపించనుందని టాక్‍. ఆమె పాత్ర, కట్టు, బొట్టు, మాట తీరు అన్నీ కొత్తగా ఉంటాయని అంటున్నారు. అక్టోబర్‍ నెలలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా ఇప్పటి నుంచే క్రేజ్‍ పుట్టిస్తోంది.

Review ‘అల్లు’ సినిమాలో పల్లెటూరి పిల్ల?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top