
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో రాజమౌళి- జూనియర్ ఎన్టీఆర్- రామ్‍చరణ్ కాంబినేషన్‍లో రానున్న సినిమాపైనే అందరి కళ్లూ పడ్డాయి. ఈ సినిమా గురించి రకరకాల టాక్స్ వినిపిస్తున్నాయి. కానీ, అవేమీ నిజం కాదనే వార్తలూ వస్తున్నాయి. మొత్తానికైతే ఈ క్రేజీ కాంబినేషన్‍పై ఉన్న అంచనాలు అన్నీఇన్నీ కావు. రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి చాలా గోప్యం పాటిస్తున్నారు. అది మరింత ఎక్స్పెక్టేషన్స్కు కారణమవుతోంది. ‘బాహుబలి’ సమయంలోనే ఈ యువ హీరోలిద్దరికీ రాజమౌళి కథ చెప్పి ఓకే చేయించుకున్నారట. అప్పటి నుంచి ఎన్టీఆర్, రామ్‍చరణ్ తరచుగా కలుసుకోవడం మరింత క్రేజ్ సృష్టిస్తోంది. ఈ చిత్రం కోసం సన్నద్ధం కావడంలో భాగంగానే వీరిద్దరూ కలుస్తున్నారని అంటున్నారు. ఇటీవలే వీరిద్దరూ అమెరికా వెళ్లి వచ్చారనేది కూడా టాక్ ఆఫ్ ది టాలీవుడ్‍గా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్‍చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలోనూ, ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ సినిమాలు చేస్తున్నారు. ఈ రెండూ పూర్తి కాగానే క్రేజీ కాంబినేషన్ మూవీకి కొబ్బరికాయ కొడతారని అంటున్నారు. బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వం వహించనున్న సినిమా ఇదే కానుండటంతో జాతీయ స్థాయిలో ఈ చిత్రంపై డిస్కషన్స్ జరుగుతున్నాయంటే ఇదెంత క్రేజీ ప్రాజెక్టో అర్థం చేసుకోవచ్చు. ఇండస్ట్రీలోనే ఇది వండర్‍ఫుల్ కాంబినేషన్ అని ఇప్పటి నుంచే చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు.
Review అసలేం జరుగుతోంది.