ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా’. ఈ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విషయం తెలిసిందే. నరసింహారెడ్డి చిన్నప్పటి పాత్రలో ముంబైకి చెందిన ఓ బాలనటుడు నటించారు. ఈ చిన్నారిపై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ చిన్నారి క్యారెక్టర్ పూర్తి కావడంతో ఇక పెద్ద నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి ఎంటర్ అయ్యారు. మార్చి 15 నుంచి ఈ రెండో షెడ్యూలు ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‍లోనే నయనతార, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి వంటి హేమా హేమీలు నటించనున్నారు. ఇందు కోసం ఒక భారీ సెట్‍ను నిర్మిం చారు. సురేందర్‍రెడ్డి దర్శకత్వంలో కొణి దెల ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. బాహుబలి తరువాత అంతటి భారీ బడ్జెట్‍తో తెరకెక్కుతోన్న తెలుగు చిత్రమిది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‍లో ఇది 151వ చిత్రం. దీనిపై తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలే ఉన్నాయి.
ఇక పెద్ద చిరంజీవి వంతు…

Review ఇక పెద్ద చిరంజీవి వంతు….