అల్లు అర్జున్ తెలుగుతో పాటు తమిళం, మలయాళం కూడా బాగా మాట్లాడతారు. మలయాళంలో అయితే ఆయనకు పెద్ద ఫ్యాన్సే ఉన్నారు. మలయాళీలు అల్లు అర్జున్‍ను ముద్దుగా ‘మల్లు అర్జున్’ అని పిలుచుకుంటారు. ఇక, చెన్నైతోనూ అల్లు అర్జున్‍కు ప్రత్యేక అనుబంధం ఉంది. దాదాపు ఇరవై ఏళ్ల పాటు ఆయన అక్కడే చదువుకున్నారు. ఇదంతా ఎందుకంటే- లింగుస్వామి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెలుగు, తమిళంలో జ్ఞానవేల్ రాజా నిర్మాణ సారథ్యంలో ఇటీవల ఒక చిత్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ఎల్లారుక్కుమ్ వణక్కమ్ (అందరికీ నమస్కారం) అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇంకో విశేషం ఏమిటంటే.. ఇప్పటి వరకు అల్లు అర్జున్ నటించిన తెలుగు సినిమాలేవీ తమిళంలోకి డబ్ కాలేదు. అయితేనేం.. నేరుగా తమిళంలో స్రెయిట్ సినిమా ఇప్పుడు చేయబోతున్నారు. నేను పుట్టి పెరిగిన చెన్నైకి ఈ సినిమా ద్వారా పరిచయంకావాలని అనుకుంటున్నానని అల్లు అర్జున్ అన్నారు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి ద్వితీయార్థంలో లేదా మార్చి ప్రథమార్థంలో ప్రారంభంకానున్నది.
ఎల్లారుక్కుమ్ వణక్క

Review ఎల్లారుక్కుమ్ వణక్క.